For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హద్దులు దాటేశాడు.. దారుణంగా ధన్‌రాజ్ డబుల్ మీనింగ్ డైాలాగ్స్.. నెటిజన్ల ఫైర్

    |

    అదిరింది షోలో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు హద్దులు దాటుతున్నాయన్న టాక్ ఎప్పటి నుంచో వస్తోంది. అందులో మరీ ముఖ్యంగా కమెడియన్ వేణు, ధన్‌రాజ్ ద్వయం కలిశారంటే అక్కడే డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, అసభ్యకరమైన పదజాలాలకు కొదవే ఉండదు. గత ఎపిసోడ్‌లలో ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు వేశారు. తాజాగా ధన్ రాజ్ దసరా ఈవెంట్‌లోనూ తన మార్క్ డైలాగ్‌లను వేసేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు.

     గతంలోనూ అంతే..

    గతంలోనూ అంతే..

    మామూలుగా వేణు ధన్ రాజ్ గురూజీ ఆశ్రమం శిష్యులు అంటే స్కిట్‌ను చేస్తుంటారు. అందులో శిష్యులు అడిగి వింతే ప్రశ్నలకు డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో దుమ్ములేపుతుంటారు. దీపావళి అంటే ఏంటి? అని అడిగిన సందర్భంలో దీప అనే అమ్మాయికి.. అలీ అనే అమ్మాయికి పెళ్లి జరగడమని వింతగా చెప్పి చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ఇక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగిన ప్రశ్నకు కొట్టుకోవాలి.. అంటూ డబుల్ మీనింగ్ వేశాడు. ఆ వెంటనే సర్దుకుని గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలని కవర్ చేశాడు.

    తాజాగా అలాగే...

    తాజాగా అలాగే...

    ప్రస్తుతం జీ తెలుగు దసరా ఈవెంట్ ప్రోమోలు దుమ్ములేపుతున్నాయి. చిరంజీవి ప్రదీప్.. చిలసౌ శ్రీముఖి అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇందులో అనసూయ, జానీ మాస్టర్, నాగబాబు, నిహారిక వంటి వారంతా సందడి చేశారు. ఇక సద్దాం, చమ్మక చంద్ర వంటివారు తమదైన శైలి స్కిట్స్‌తో మెప్పించేందుకు రెడీ అయ్యారు. ఇందులో తాజాగా ధన్ రాజ్ చేసిన స్కిట్‌కు సంబంధించిన ప్రోమోను వదిలారు.

    అశ్లీలత అంటూ..

    అశ్లీలత అంటూ..

    దసరా ఈవెంట్‌లోనూ ధన్ రాజ్ మళ్లీ పాత పద్దతినే వాడాడు. ఆశ్రమం, గురువు, శిష్యులు అంటూ స్కిట్ చేశారు. ఇందులో అశ్లీలత అనే పేరు పెట్టుకున్న శిష్యురాలితో తమ స్కిట్స్‌లో అదే పెరిగిందని చెప్పకనే చెప్పి తమపై తామే సెటైర్ వేయించుకున్నారు.

    Chanakya Dussehra Special Interview | Gopichand | Mehreen Pirzada
    వేయాలి అంటూ..

    వేయాలి అంటూ..

    ఇక చిత్రం శీను అడిగిన ఓ ప్రశ్నకు ధన్ రాజ్ చెప్పిన సమాధానం మరీ ఘోరంగా ఉంది. గురువు గారు స్ట్రెస్ బాగా ఉంది ఏం చేయాలి అని చిత్రం శీను అడుగుతాడు. వెంటనే దన్ రాజ్ వేయాలి.. అంటూ చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. కానీ వెంటనే మళ్లీ తేరుకుని.. రోజూ ఆసనాలు వేయాలి అంటూ కవర్ చేశాడు. కానీ ధన్ రాజ్ మాత్రం తన డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో ఉన్న పరువును కూడా పోగొట్టుకుంటున్నాడు. కనీసం పండుగ నాడైనా కాస్త మంచి స్కిట్ చేస్తే బాగుంటుంది కదా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

    English summary
    Comedian DhanRaj Double meaning Dialogue In Zee Telugu Dasara Event, Comedian DhanRaj Controversial Comments On Diwali In Adhirindi. Comedian DhanRaj Vulgar Dialogues In Adirindi. Adirindi Latest Promo Goes Viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X