Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
హద్దులు దాటేశాడు.. దారుణంగా ధన్‌రాజ్ డబుల్ మీనింగ్ డైాలాగ్స్.. నెటిజన్ల ఫైర్
అదిరింది షోలో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు హద్దులు దాటుతున్నాయన్న టాక్ ఎప్పటి నుంచో వస్తోంది. అందులో మరీ ముఖ్యంగా కమెడియన్ వేణు, ధన్‌రాజ్ ద్వయం కలిశారంటే అక్కడే డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, అసభ్యకరమైన పదజాలాలకు కొదవే ఉండదు. గత ఎపిసోడ్లలో ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు వేశారు. తాజాగా ధన్ రాజ్ దసరా ఈవెంట్లోనూ తన మార్క్ డైలాగ్‌లను వేసేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు.
గతంలోనూ అంతే..
మామూలుగా వేణు ధన్ రాజ్ గురూజీ ఆశ్రమం శిష్యులు అంటే స్కిట్‌ను చేస్తుంటారు. అందులో శిష్యులు అడిగి వింతే ప్రశ్నలకు డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో దుమ్ములేపుతుంటారు. దీపావళి అంటే ఏంటి? అని అడిగిన సందర్భంలో దీప అనే అమ్మాయికి.. అలీ అనే అమ్మాయికి పెళ్లి జరగడమని వింతగా చెప్పి చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ఇక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగిన ప్రశ్నకు కొట్టుకోవాలి.. అంటూ డబుల్ మీనింగ్ వేశాడు. ఆ వెంటనే సర్దుకుని గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలని కవర్ చేశాడు.
తాజాగా అలాగే...
ప్రస్తుతం జీ తెలుగు దసరా ఈవెంట్ ప్రోమోలు దుమ్ములేపుతున్నాయి. చిరంజీవి ప్రదీప్.. చిలసౌ శ్రీముఖి అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇందులో అనసూయ, జానీ మాస్టర్, నాగబాబు, నిహారిక వంటి వారంతా సందడి చేశారు. ఇక సద్దాం, చమ్మక చంద్ర వంటివారు తమదైన శైలి స్కిట్స్‌తో మెప్పించేందుకు రెడీ అయ్యారు. ఇందులో తాజాగా ధన్ రాజ్ చేసిన స్కిట్‌కు సంబంధించిన ప్రోమోను వదిలారు.
అశ్లీలత అంటూ..
దసరా ఈవెంట్లోనూ ధన్ రాజ్ మళ్లీ పాత పద్దతినే వాడాడు. ఆశ్రమం, గురువు, శిష్యులు అంటూ స్కిట్ చేశారు. ఇందులో అశ్లీలత అనే పేరు పెట్టుకున్న శిష్యురాలితో తమ స్కిట్స్‌లో అదే పెరిగిందని చెప్పకనే చెప్పి తమపై తామే సెటైర్ వేయించుకున్నారు.
Recommended Video
వేయాలి అంటూ..
ఇక చిత్రం శీను అడిగిన ఓ ప్రశ్నకు ధన్ రాజ్ చెప్పిన సమాధానం మరీ ఘోరంగా ఉంది. గురువు గారు స్ట్రెస్ బాగా ఉంది ఏం చేయాలి అని చిత్రం శీను అడుగుతాడు. వెంటనే దన్ రాజ్ వేయాలి.. అంటూ చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. కానీ వెంటనే మళ్లీ తేరుకుని.. రోజూ ఆసనాలు వేయాలి అంటూ కవర్ చేశాడు. కానీ ధన్ రాజ్ మాత్రం తన డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో ఉన్న పరువును కూడా పోగొట్టుకుంటున్నాడు. కనీసం పండుగ నాడైనా కాస్త మంచి స్కిట్ చేస్తే బాగుంటుంది కదా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.