మరీ దిగజారిపోయిన ధన్‌రాజ్.. అలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో బుల్లితెరపై సెగలు!

వెండితెరపై నవ్వులు పూయించిన ధన్‌రాజ్.. బుల్లితెరపై దనాదన్ ధన్‌రాజ్‌గా పంచ్‌ల వర్షం కురిపించాడు. జబర్దస్త్ షోలో ధన్‌రాజ్ వేసిన పంచ్‌లు, స్కిట్‌లు అందరికీ తెలిసిందే. ఎంతో కొంత మంది కొత్త ఆర్టిస్ట్‌లను జబర్దస్త్ షో వేదికకు పరిచయం చేశాడు. ఆపై వెండితెరపై బిజీగా అవ్వడంతో జబర్దస్త్‌కు దూరమయ్యాడు. మిగతా షోలు చేస్తూ మధ్యమధ్యలో జబర్దస్త్ వేదికపైనా మెరిసే వాడు. నాగబాబు బయటకు వచ్చి అదిరింది అనే కొత్త షోను ప్రారంభించడంతో ధన్ రాజ్ కూడా వచ్చి చేరాడు. ప్రస్తుతం ఆ వేదికపై పంచ్‌ల వర్షం కురిపిస్తున్నాడు.

 డబుల్ మీనింగ్ డైలాగ్స్..

డబుల్ మీనింగ్ డైలాగ్స్..

అది జబర్దస్త్ అయినా అదిరింది అయినా స్కిట్స్ కామన్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కామన్. అయితే ఒక్కొక్కరు ఒక్కో మోతాదులో ప్రయోగిస్తుంటారు. హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి, గెటప్ శ్రీను ఇలా ప్రతీ ఒక్కరూ తమ తమ స్కిట్స్‌లో డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చి పోతుంటారు.

జబర్దస్త్‌ను మించేలా..

జబర్దస్త్‌ను మించేలా..

జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన డైరెక్టర్లు నితిన్ భరత్.. నాగబాబు అదిరింది షోను ప్రారంభించారు. జబర్దస్త్‌కు పోటీగా, దాన్ని మించేలా అదిరిందిని ప్లాన్ చేశారు. అందుకే రవి, భానుశ్రీ, నవదీప్ వంటి వారిని ప్రత్యేకంగా తీసుకొచ్చారు. మొదట్లో షో కాస్త నెమ్మదిగానే సాగినా.. ప్రస్తుతం ఓ మోస్తరుగా రన్ అవుతోంది.

పంచ్‌ల వర్షం..

పంచ్‌ల వర్షం..

జడ్జ్‌లుగా ఉన్న నాగబాబు, నవదీప్‌లు రెచ్చిపోయి మరీ పంచ్‌లు వేస్తుంటారు. స్కిట్ మధ్యలో వచ్చి వేసే సెటైర్స్ అదిరిపోతాయి. టీమ్ లీడర్స్ అందరూ నవదీప్‌ను మాత్రం తెగ వాడేస్తుంటారు. నవదీప్ సైతం వారితో కలిసి.. రివర్స్ కౌంటర్స్ వేస్తుంటారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ధన్ రాజ్ వేసిన పంచ్‌లకు నవదీప్ ఇచ్చిన కౌంటర్, ధన్ రాజ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

కారు, షికారు, బారు..

కారు, షికారు, బారు..

నాగబాబు గారికి కారులంటే ఇష్టం.. నవదీప్ గారికి షికారులంటే ఇష్టమని ధన్ రాజ్ కౌంటర్ వేయగా.. నవదీప్ మధ్యలో ఎంట్రీ ఇచ్చి ధన్ రాజ్ గారికి బారులంటే ఇష్టమని రివర్స్ పంచ్ వేశాడు. దీంతో అందరూ పగలబడి నవ్వారు. అయితే తరువాత ధన్ రాజ్ వేసిన పంచ్‌కు అంతా షాక్ అయ్యారు.

Recommended Video

Adire Abhi Opinion On RGV || గొప్ప సినిమాలు తీసిన మీరు.. ఇప్పుడేంటి ఇలా.?
కొట్టుకోవాలి..

కొట్టుకోవాలి..


ఓ మనిషి ప్రశాంతంగా వందేళ్లు బతకాలంటే ఏం చేయాలి గురువు గారు అని ధన్ రాజ్‌ను అడుగుతారు. అయితే వెంటనే కొట్టుకోవాలి అని సమాధానం ఇస్తాడు ధన్ రాజ్. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అవుతారు. అయితే వెంటనే తేరుకుని.. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి అని మాట మార్చేస్తాడు. దీంతో అందరూ అవాక్కవుతారు. ఇలా ధన్ రాజ్ వేసే డబుల్ మీనింగ్ డైలాగ్స్ శ్రుతి మించుతున్నాయని స్కిట్స్‌లో భాగంగా వారిదే వారే కౌంటర్స్ వేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X