జబర్ధస్త్ షోలో అనుకోని సంఘటన.. వర్షకు నిజంగానే ముద్దు పెట్టిన కమెడియన్
సాధారణంగా బుల్లితెరపై వచ్చే షోలు ఎక్కువ కాలం కొనసాగాలంటే చాలా కష్టం అనే చెప్పాలి. అలాంటి దాదాపు తొమ్మిదేళ్లుగా టెలివిజన్ రంగంలో భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని దూసుకుపోతోన్న షోనే జబర్ధస్త్. సంవత్సరాలు మారుతున్నా ఏమాత్రం ప్రభావాన్ని కోల్పోకుండా ప్రేక్షకులను నవ్విస్తోన్న ఈ షోలో వర్ష యమ హైలైట్ అవుతోంది. దీంతో ఇందులో వరుసగా స్కిట్లు చేస్తూ అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ కమెడియన్ నిజంగానే ముద్దు పెట్టేసి షాకిచ్చాడు. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!
అలా పాపులర్ అయిన వర్ష:మోడలింగ్ రంగంలో తనదైన అందంతో సత్తా చాటిన వర్ష 'ప్రేమ ఎంత మధురం' ద్వారా ఈ అమ్మడు మరింత పాపులర్ అయింది. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. హైపర్ ఆది ద్వారా ఇందులోకి అడుగు పెట్టిన ఈ భామ.. ఒక్కసారిగా గుర్తింపును తెచ్చుకుంది. ఇందులో అందంతో పాటు యాక్టింగ్‌తో ఇరగదీస్తూ ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుని హైలైట్ అయింది.

అతడితో లవ్ ట్రాక్‌తో క్రేజ్:జబర్ధస్త్ షోలోకి చాలా మందే ఆర్టిస్టులుగా వచ్చారు. కానీ, వారిలో కొందరు మాత్రమే పాపులర్ అవుతారు. అందులో చాలా తక్కువ మందికి మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఇలా బుల్లితెర జంటగా అప్పట్లో రష్మీ.. సుధీర్ ఫేమస్ అయ్యారు. వీళ్ల తర్వాత ఇప్పుడు వర్ష - ఇమాన్యూయేల్‌ను కూడా జోడీగా చేశారు. ఈ జంట క్రమక్రమంగా పాపులర్ అవుతూ క్రేజ్ పెంచుకుంటోంది.
ఇమ్మూ టీమ్‌లో పంచులు:జబర్ధస్త్ షోలో అసాధారణ టాలెంట్‌ను చూపించిన ఇమాన్యూయేల్ ఇప్పుడు ఓ టీమ్‌కు లీడర్ అయ్యాడు. ఇందులోనే వర్ష కూడా చేస్తోంది. ఈ జట్టు నుంచి వచ్చే ప్రతి స్కిట్లలోనూ ఇమాన్యూయేల్‌తో పాటు వర్ష కూడా యమ హైలైట్ అవుతోంది. ముఖ్యంగా ఆమెపై అతడు వేసే పంచులకు మంచి స్పందన వస్తోంది. ఆమె వేసే కౌంటర్లు కూడా బాగానే అదిరిపోతున్నాయి.

దెయ్యం స్కిట్‌తో క్రేజీగానే:ఈ శుక్రవారం ప్రసారం అయిన ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ ఎపిసోడ్‌ను షో నిర్వహకులు మరింత కొత్తగా ప్లాన్ చేశారు. దీన్ని గెటప్‌ల స్పెషల్‌గా చూపించారు. ఇందులో భాగంగా సినిమాల్లో ఫేమస్ అయిన గెటప్‌లతో కమెడియన్లు తెగ సందడి చేశారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ గతంలో కంటే ఎక్కువగానే ఫన్ క్రియేట్ చేసింది. దీంతో దీనికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభించింది.
ఏదో ఒకటి చేయాలి అని:ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ షోలో భాగంగా గత శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో ఇమాన్యూయేల్ టీమ్‌లో వర్ష, దుర్గారావు దెయ్యం గెటప్‌లతో, ఇమాన్యూయేల్ సినిమా డైరెక్టర్‌గా వచ్చారు. ఇందులో భాగంగా దెయ్యాలు 'బేబీ' సినిమాను చేస్తే ఎలా ఉంటుందో చూపించమని అతడు వాళ్లిద్దరినీ అడిగాడు. దీంతో దుర్గారావు రెచ్చిపోయి వర్షను ఎక్కడపడితే అక్కడ తాకుతూ రచ్చ చేశాడు.
నిజంగానే ముద్దు పెట్టాడు:దుర్గారావు రెచ్చిపోతుండడంతో ఇమాన్యూయేల్ అతడిని ఆపాడు. అప్పుడతను 'బతికున్నప్పుడు ఎలాగో కావడం లేదు సార్. ఇప్పుడైనా ఏదైనా చేయనివ్వండి' అన్నాడు. ఆ తర్వాత ఈ స్కిట్‌లో భాగంగా దుర్గారావు ఏకంగా వర్ష చేతిపై ముద్దు పెట్టేశాడు. దీంతో ఆమెతో పాటు అందరూ షాక్ అయిపోయారు. మొత్తానికి ఫన్నీగా సాగిన ఈ స్కిట్ అందరినీ ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











