twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Gully boy riyaz: పవన్ కోసం జనసేనలో చేరుతున్నా..అక్కడి నుంచి పోటీ అంటూ ప్రకటన!

    |

    అదిరింది షో ద్వారా పాపులర్ అయిన రియాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే జబర్దస్త్ ప్రోగ్రాం లాగానే జీ తెలుగు అదిరింది షో ఏర్పాటు చేయగా అందులో కొన్నాళ్ల పాటు రియాజ్ పాల్గొని అలరించాడు. ఆ ప్రోగ్రాం చేస్తున్న సమయంలో రియాజ్ వైఎస్ జగన్ ను అనుకరిస్తూ చేసిన ఒక వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఈ వ్యవహారంలో వైసీపీ అభిమానులు రియాజ్ ని టార్గెట్ చేయడంతో ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు. ఆ సంగతి అలా ఉంచితే రియాజ్ ఇప్పుడు జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    జనసేన కోసం

    జనసేన కోసం

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జనసేన పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ ఏర్పాటు చేసిన కొత్తలో 2014 ఎన్నికలు రాగా ఆ సమయంలో ఆయన టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ, సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆయన ఎన్నికలకు వెళ్లినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.

    అప్పట్లో ప్రచారం

    అప్పట్లో ప్రచారం

    అయితే అప్పట్లో హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి వాళ్ళు నాగబాబు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆయనకు మద్దతుగా ప్రచారం చేసి గెలిపించాలని కోరారు. అయితే అది వర్కౌట్ కాలేదు నాగబాబు సహా పవన్ కళ్యాణ్ కూడా అక్కడ గెలవలేదు..

    బయట నుంచి మద్దతు

    బయట నుంచి మద్దతు

    అయితే ప్రస్తుతానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బయట నుంచి మద్దతు ఇస్తున్నారు కానీ స్వయంగా పార్టీలో చేరి మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువే కానీ అనూహ్యంగా ఇప్పుడు రియాజ్ తాను జనసేన పార్టీలో చేరుతున్నానని నెల్లూరు లోని 30వ డివిజన్ నుంచి నేను మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు రియాజ్ మాట్లాడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Recommended Video

    Anita Hassanandani, Rohit Reddy Blessed With A Baby Boy
    ఎన్నికల వేడి

    ఎన్నికల వేడి

    అదిరింది బొమ్మ అదిరింది షో ద్వారా పరిచయమైన రియాజ్ అడపాదడపా సినిమాల్లో కూడా కనిపించాడు. అలాగే నాగబాబు ఇప్పుడు స్వయంగా నిర్మించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేస్తున్న కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా రియాజ్ నటిస్తున్నాడు. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. నవంబర్ నెలలో రాష్ట్రంలో నిలిచిపోయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్, జడ్పీటీసీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది. అలా ఏపీలో మరోసారి ఎన్నికల శంఖారావం మోగనుంది.

    ఏపీలో ఎన్నికలు

    ఏపీలో ఎన్నికలు

    ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలను నవంబర్ నెల 7, 8 తేదీల్లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చ్ 2021లో వివిధ కారణాలతో రాష్ట్రంలో 4 కార్పొరేషన్లు, 32 మున్సిపాలిటీలు , నగర పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోయాయి.

    ఇందులో నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముందని అంటున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

    English summary
    Comedian Gully boy riyaz joins Jana Sena and contests in Nellore municipal elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X