బిగ్‌బాస్ 4 కోసం జబర్దస్త్ కమెడియన్‌కి సాలీడ్ రెమ్యునరేషన్ .. శ్రీముఖి కంటే ఎక్కువే?
ఇండియన్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎప్పుడు మొదలుకానుంది అనే విషయంపై ప్రస్తుతం అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో కూడా బిగ్ బాస్ పై ఎన్నో కథనాలు వెలువడుతున్నాయి. ఇక తెలుగులో అయితే ఒక స్పెషల్ డేట్ వచ్చినట్లు టాక్ వస్తోంది. హౌజ్ లోకి రాబోయే కంటెస్టెంట్స్ పేర్లు కూడా లీకైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరొక కొత్త కంటెస్టెంట్ పేరు కూడా వినిపిస్తోంది.
Recommended Video

కొత్త ప్లాన్..
ఇప్పటికే బిగ్ బాస్ 4 మొదలు కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ స్టార్ మా నిర్వాహకులు ఒక కొత్త ప్లాన్ తో సిద్ధమైనట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ అనంతరం జూన్ లో బ్యాక్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

అప్పుడే టెలికాస్ట్..
ఇక జూన్ ఎండింగ్ లో గాని లేదా జులైలో బిగ్ బాస్ షోను స్టార్ట్ చేసి టెలికాస్ట్ మాత్రం సెప్టెంబర్ లో మొదలుపెట్టాలని నిర్వాహకులు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గడిచిన మూడు సీజన్లలో కంటే ఈ సారి మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండేలా కొత్త తరహా టాస్క్ లను కూడా క్రియేట్ చేయనున్నారట. ఇక ఇందులో జబర్దస్త్ కమెడియన్స్ కూడా కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

హైపర్ అది కోసం..
హైపర్ ఆది బగ్ బాస్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వస్తున్నాయి. అతని మార్కెట్ ని బట్టి ఎపిసోడ్ కి లక్షకు పైగా రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు టాక్ వస్తోంది. గత సీజన్ లో శ్రీ ముఖి ఎపిసోడ్ కి లక్షకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే తరహాలో హైపర్ ఆది కోసం నిర్వాహకులు అతనికి భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

హోస్ట్ ఎవరు..
గడిచిన మూడు సీజన్లలో జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున అద్భుతమైన హోస్టింగ్ తో షోకి మంచి బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక.ఇప్పుడు సీజన్ 4 హోస్ట్ గా ఎలాంటి హీరో ఎంట్రీ ఇస్తాడనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ హోస్ట్ గా రానున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఆయన షూటింగ్స్ తో చాలా బిజీగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











