Jabardasth: కొత్త యాంకర్ పై హైపర్ ఆది తలధించుకునే కామెంట్.. సిగ్గు పడే విధంగా దారుణంగా..

కామెడీ షోగా మంచి గుర్తింపు అందుకున్న జబర్దస్త్ షో ఇటీవల కాలంలో చాలా తక్కువ స్థాయిలో రేటింగ్స్ అందుకుంటోంది. ఇక మళ్ళీ రేటింగ్స్ హై రేంజ్ లో ఉండాలని కమెడియన్స్ అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు వేసే సెటైర్లు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక కొత్త యాంకర్ పై ఇటీవల హైపర్ ఆది తలదించుకునే తరహాలో కామెంట్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

సక్సెస్ కాదని..

సక్సెస్ కాదని..

జబర్దస్త్ షో స్టార్ట్ అయినప్పుడు నిర్వాహకులకు మొదట యాంకర్ దొరకడం చాలా కష్టమైంది. అసలు ఆ షో సక్సెస్ కాదని అప్పట్లో ప్రముఖ యాంకర్స్ కూడా రిజెక్ట్ చేశారు. అందులో శ్రీముఖి కూడా ఉంది. ఇక ఆ తరువాత అనసూయ భరద్వాజ్ లాక్కుతో ఛాన్స్ అందుకొని ఊహించని రేంజ్ లో క్రేజ్ అందుకుంది. అనంతరం రష్మి కూడా ఎక్స్ ట్రా జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకుంది.

యాంకర్స్ కూడా దూరంగా

యాంకర్స్ కూడా దూరంగా

ఇక కాలం మారుతున్న కొద్దీ ఈ టాప్ కామెడీ షోలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా టీమ్ లీడర్స్ కూడా చాలా మంది మారారు. కొందరు మనస్పర్థలు రావడం వలన బయటకు వెళ్లిపోతే మరికొందరు సినిమాల్లో బిజీగా ఉండడం వలన జబర్దస్త్ కు దూరమయ్యారు. ఇక యాంకర్స్ అనసూయ కూడా అదే తరహాలో దూరమయ్యారు. రష్మి విషయంలో మాత్రం కొంత విబేధాలు వచ్చినట్లు ఒక టాక్ అయితే వచ్చింది.

కొత్త యాంకర్

కొత్త యాంకర్

అనసూయ, రష్మి అనంతరం కూడా కొందరు యాంకర్స్ జబర్దస్త్ లో క్లిక్ అవ్వాలని అనుకున్నారు. కానీ ఎవరూ కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇక ఇటీవల కన్నడ సీరియల్స్ ద్వారా క్రేజ్ అందుకున్న సౌమ్యా రావ్ ను తీసుకు వచ్చారు. ఇక ఆమెపై కూడా హైపర్ ఆది చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హైపర్ ఆది రావడంతో

హైపర్ ఆది రావడంతో

ఇక జబర్దస్త్ షోకు హైపర్ ఆది కూడా కొన్నాళ్ళు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది మేనేజ్మెంట్ తో రెమ్యునరేషన్ విషయంలో న్యాయంగా ఉండడం లేదనే కారణం చేత హైపర్ ఆది జబర్దస్త్ కు దూరమైనట్లు అప్పట్లో చాలా రకాల రూమర్స్ వచ్చాయి. కానీ అందులో నిజం లేదని మరికొందరు వివరణ ఇచ్చారు. ఇక మొత్తానికి జబర్దస్త్ లో హైపర్ ఆది మళ్ళీ ఎప్పటిలనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సిగ్గుపడి తలదించుకునేలా..

సిగ్గుపడి తలదించుకునేలా..

ఈ వారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో లో హైపర్ ఆది సౌమ్య సిగ్గుపడి తలదించుకునే తరహాలో కామెంట్ చేశాడు. స్కిట్ చేసిన అనంతరం జడ్జిగా ఉన్న కృష్ణ భగవాన్ ఒక ప్రశ్న వేశారు. ఈ ప్రపంచంలో మీ ఇద్దరు మాత్రమే ఉంటే ఏం చేస్తారు అని అడిగినప్పుడు.. ఇద్దరం కలిసి మరో ప్రపంచాన్ని సృష్టిస్తాం అని.. ఒకరి తరువాత మరొకరు పుడతానే ఉంటారు అని కామెంట్ చేశాడు. ఇక సౌమ్యకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సిగ్గుతో కాస్త తల దించుకుంది. ప్రోమోలోనే ఇలా ఉంటే ఆది ఫుల్ ఎపిసోడ్ లో ఇంకా ఎలాంటి కామెంట్స్ చేసి ఉంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X