For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jabardasth Praveen: ప్రవీణ్ ఇంట్లో పెను విషాదం.. షోలోకి వచ్చిన కొద్ది రోజులకే మృతి

  |

  తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూ నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. ఈ షో వల్ల ఎంతో మంది ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. అందులో చాలా మంది తమ టాలెంట్లను చూపించుకుని బిగ్ సెలెబ్రిటీలుగా ఎదిగిపోయారు. అలాంటి వారిలో యంగ్ కమెడియన్ ప్రవీణ్ ఒకడు. ఈ మధ్య కాలంలో జబర్ధస్త్ షోలో యమ హైలైట్ అవుతూ దూసుకుపోతోన్న ఈ కుర్రాడు.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఈ నేపథ్యంలో తాజాగా ప్రవీణ్ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. దీంతో బుల్లితెర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

  పటాస్ ద్వారా వచ్చిన ప్రవీణ్

  పటాస్ ద్వారా వచ్చిన ప్రవీణ్

  ప్రస్తుతం జబర్ధస్త్‌లో టాలెంటెడ్ కమెడియన్‌గా వెలుగొందుతోన్న ప్రవీణ్.. ముందుగా అదే ఛానెల్‌లో ప్రసారమైన 'పటాస్' అనే షో ద్వారా వెలుగులోకి వచ్చాడు. అందులో తనదైన స్కిట్లు చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. దీంతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. దీంతో అతడికి బుల్లితెరపై ఎన్నో ఆఫర్లు కూడా వచ్చాయి.

  హాట్ షోతో షాకిచ్చిన కీర్తి సురేష్: ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!

  జబర్ధస్త్ ఎంట్రీ.. ఫుల్ ఫేమస్

  జబర్ధస్త్ ఎంట్రీ.. ఫుల్ ఫేమస్

  సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను అలరించి.. కరోనా లాక్‌డౌన్ కారణంగా 'పటాస్' షో ఆగిపోయింది. దీంతో ప్రవీణ్ జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో రాకింగ్ రాకేష్ టీమ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. అయితే, ఈ యంగ్ కమెడియన్ మాత్రమే అదిరిపోయే పంచులు, ప్రాసలతో హైలైట్ అవుతున్నాడు. తద్వారా భారీ స్థాయిలో గుర్తింపును అందుకుని దూసుకెళ్తోన్నాడు.

  ప్రవీణ్ ఇంట్లో పెను విషాదం

  ప్రవీణ్ ఇంట్లో పెను విషాదం

  జబర్ధస్త్‌లో తనదైన కామెడీతో విశేషమైన గుర్తింపుతో మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ యంగ్ కమెడియన్ తండ్రి అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. దీంతో ప్రవీణ్‌తో పాటు అతడు చేస్తోన్న జబర్ధస్త్ ఫ్యామిలీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణంపై పలువురు బుల్లితెర ప్రముఖులు సంతాపం తెలిపారు.

  Bigg Boss 6: షోలోకి ముగ్గురు యాంకర్లు.. లీకైన కంటెస్టెంట్ల పేర్లు.. తెలుగు భామలకు లక్కీ ఛాన్స్

  ప్రవీణ్ తండ్రి సమస్య ఇదే

  ప్రవీణ్ తండ్రి సమస్య ఇదే


  జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ తండ్రి కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆయన వెన్నుపూసలో నీరు చేరింది. ఈ నీరును తొలగించే క్రమంలో ఆయన కాళ్లు చేతులకు పక్షవాతం వచ్చింది. దీంతో ప్రవీణ్ తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలోనే ఆయన మంగళవారం ప్రాణాలు కోల్పోయారు.

  మూడేళ్లకే తల్లి.. ఇప్పుడిలా

  మూడేళ్లకే తల్లి.. ఇప్పుడిలా


  జబర్ధస్త్ ప్రవీణ్‌కు మూడేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. అప్పటి నుంచి అతడిని తండ్రి పెంచాడు. ఇందుకోసం ఆయన మరో వివాహం కూడా చేసుకోలేదు. పెద్ద కొడుకును వెటర్నరీ చదివించి పెళ్లి చేశారు. అయితే, ఉద్యోగం రాకవడంతో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఇక, ప్రవీణ్ జబర్ధస్త్‌లోకి వచ్చాడు. అంతా హ్యాపీ అనుకున్నప్పుడే ఆయన చనిపోయారు.

  ఆగిపోయిన హీరోయిన్ పూర్ణ పెళ్లి: క్లారిటీ ఇస్తూ ఇన్‌స్టా పోస్ట్.. ఆ ఫొటో షేర్ చేయడంతో!

  ఆ షోలోకి వచ్చి బాధ చెప్పి

  ఆ షోలోకి వచ్చి బాధ చెప్పి


  గత మార్చి నెలలో జరిగిన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ జరిగింది. దీనికి కమెడియన్లు అందరూ తమ తల్లులు, సోదరీమణులను తీసుకుని వచ్చారు. అయితే, ప్రవీణ్‌కు మదర్, సిస్టర్ లేకపోవడంతో తన తండ్రిని తీసుకొచ్చాడు. ఆ సమయంలో ఆయన తన కుమారులను ఎలా పెంచారన్న విషయాన్ని వెల్లడిస్తూ బాధ పడ్డారు. దీంతో సుధీర్ ధైర్యం చెప్పాడు.

  ఆత్మహత్య చేసుకుందామని

  ఆత్మహత్య చేసుకుందామని


  'శ్రీదేవి డ్రామా కంపెనీ'లోకి వచ్చిన సమయంలో ప్రవీణ్ తండ్రి తన బాధలు చెప్పుకున్నారు. ఒకానొక సందర్భంలో తాను ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నట్లు చెప్పారు. అయితే, కొడుకుల భవిష్యత్ కోసం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని అన్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన అనారోగ్యంతో మరణించారు. ప్రవీణ్‌కు ఇలా జరగడంతో అంతా దుఖంలో ఉన్నారు.

  Read more about: jabardasth
  English summary
  Young Comedian Jabardasth Praveen Father passed away on Tuesday at Hospital due to Health Issues.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X