»   » ప్రియురాలితో కమెడియన్ పెళ్లి... అప్పట్లో ఆ పని చేసి దొరికిపోయారట!

ప్రియురాలితో కమెడియన్ పెళ్లి... అప్పట్లో ఆ పని చేసి దొరికిపోయారట!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Comedian Revealed Funny Things During College Days | Filmibeat Telugu

  హిందీ టెలివిజన్ రంగంలో తన కామెడీ షోలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కపిల్ శర్మ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ప్రియురాలిని పెళ్లాడబోతున్నాడు. ఇండియన్ ఐడల్ 10కి గెస్టుగా హాజరైన కపిల్... ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

  ఢిల్లీ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో స్నేహితులతో కలిసి ఎక్కడ పెళ్లి ఫంక్షన్ జరిగితే అక్కడికి వెళ్లి ఫ్రీగా మెక్కడానికి వెళ్లేవారమని గుర్తు చేసుకున్నాడు. అయితే లోపలికి వెళ్లడానికి కొన్ని సార్లు కష్టపడాల్సి వచ్చేదని, దొరికిపోయిన రోజులను నెమరువేసుకున్నారు.

  ఓసారి దొరికిపోయాం

  ఓసారి దొరికిపోయాం

  పెళ్లి వేడుకల్లో వడ్డించే వంటకాలు చాలా పసందుగా ఉండేవి. అందుకే తమకు ఆహ్వానం లేకున్నా వెళ్లి ఎలాంటి మొహమాటం లేకుండా వెళ్లేవారం. అయితే ఓ సారి తమను ఓ అంకుల్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అ వెంటనే మా ఫ్రెండ్ ఒకరు... మా కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ అయిపోయిందని, అక్కడ తినడానికి ఏమీ లేక ఇక్కడికి వచ్చామని కథ చెప్పడంతో ఆయన నమ్మేశాడని గుర్తు చేసుకున్నారు.

  నా జీవితంలో మరిచిపోలేని సంఘటన

  నా జీవితంలో మరిచిపోలేని సంఘటన

  అలా పిలవని పెళ్లికి వెళ్లి దొరికిపోవడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. ఆ సమయంలో అంకుల్ మమ్మల్ని డాన్స్ కూడా చేయమని పట్టుబట్టారు. దీంతో మేము మరింత ఎక్కువ తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేశాం అంటూ కపిల్ గుర్తు చేసుకున్నారు.

  పెళ్లి ఎప్పుడంటే...

  పెళ్లి ఎప్పుడంటే...

  కపిల్ శర్మ డిసెంబర్ 12న తన ప్రియురాలు గిన్ని ఛత్రత్‌ను పెళ్లాడబోతున్నారు. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. మా పెళ్లికి మీ అందరి ఆహ్వానం కావాలంటూ తన అభిమానులను ఉద్దేశించి కపిల్ శర్మ ట్వీట్ చేశారు.

   త్వరలో రీ ఎంట్రీ

  త్వరలో రీ ఎంట్రీ

  ఒకప్పుడు హిందీ టెలివిజన్ రంగంలో కామెడీ రారాజుగా వెలుగొందిన కపిల్ శర్మ... ఆ మధ్య కొన్ని వివాదాల కారణంగా డిప్రెషన్లోకి వెళ్లిపోయి బుల్లితెరకు దూరం అయ్యాడు. అయితే ఇపుడు అంతా సెట్టడంతో త్వరలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

  English summary
  Comedian Kapil Sharma, who will marry his girlfriend Ginni Chatrath on December 12, said: “During our college days, my friends and I used to go to weddings to eat good food. Once we got caught red-handed by an uncle. My friend made up a story saying that the food in our college mess got over and that we didn’t have anything to eat.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more