బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్.. బయటకు వెళ్లే రెండో కంటెస్టెంట్ గురించి.. నాగార్జున హింట్!

By Manoj Kumar P

ఏమాత్రం అంచనాలు లేకపోవడం... పైగా పేరున్న కంటెస్టెంట్లు చాలా తక్కువగా ఉండడం... అన్నింటికీ మించి హౌస్‌లో ఆసక్తికర సన్నివేశాలు కనిపించకపోవడంతో మొదటి వారం బిగ్ బాస్ నాలుగో సీజన్ చప్పగా సాగింది. అయితే, రెండో వారం మాత్రం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు... ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన టాస్కులు అన్నింటికీ మించి ట్రైయాంగిల్ లవ్ స్టోరీలు ఇలా ఊహించని కథలతో షోపై ఆసక్తి పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండో వారం డబుల్ ఎలిమినేషన్ అని షాకిచ్చిన నాగ్.. కరాటే కల్యాణీ పేరును బయట పెట్టాడు. ఈ నేపథ్యంలో హౌస్‌ నుంచి బయటికెళ్లే రెండో కంటెస్టెంట్ ఎవరన్న దానిపై తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం.!

అంచనాలు లేకున్నా చరిత్ర సృష్టించిన బిగ్ బాస్

అంచనాలు లేకున్నా చరిత్ర సృష్టించిన బిగ్ బాస్

అంతకుముందు వాటితో పోలిస్తే ప్రస్తుతం నడుస్తున్న సీజన్‌పై ఆరంభానికి ముందు ఏమాత్రం అంచనాలు ఏర్పడలేదు. పైగా గతంలో మాదిరిగా పెద్దగా హడావిడి కూడా కనిపించలేదు. దీంతో సాధారణంగానే ప్రారంభం అయింది బిగ్ బాస్ ఫోర్త్ సీజన్. కానీ, ప్రీమియర్ ఎపిసోడ్‌కు ఎవరూ ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఫలితంగా బుల్లితెరపై ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి.

వారంలోనే ఇన్ని ట్విస్టులా.. అలా చెల్లుకు చెల్లు

వారంలోనే ఇన్ని ట్విస్టులా.. అలా చెల్లుకు చెల్లు

మొత్తం పదహారు మందిలో మొదటి వారం బిగ్ బాస్ హౌస్‌లో నుంచి ఒకరు (ప్రముఖ డైరెక్టర్ సూర్య కిరణ్) ఎలిమినేట్ అయ్యారు. ఆయన అలా వెళ్లాడో లేదో ఒక కంటెస్టెంట్‌ను వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపారు. ఇది జరిగిన మూడు రోజులకే మరొకరిని హౌస్‌లోకి పంపించారు. ఇప్పుడేమో ఏకంగా ఇద్దరిని ఎలిమినేట్ చేస్తున్నారు. ఒక్క వారంలోనే ఇన్ని ట్విస్టులు కనిపించాయి.

కల్యాణీ కన్ఫార్మ్... మరొక కంటెస్టెంట్ ఎవరు..?

కల్యాణీ కన్ఫార్మ్... మరొక కంటెస్టెంట్ ఎవరు..?

రెండో వారం ఎలిమినేషన్‌కు సంబంధించి ఏకంగా తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. అందులో శనివారం అక్కినేని నాగార్జున గంగవ్వను సేవ్ అయిన కంటెస్టెంట్‌గా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కరాటే కల్యాణీ ఎలిమినేట్ అయిందని, ఆదివారం మరొకరు బయటకు వెళ్తారని చెప్పాడు. అయితే, ఆ రెండో కంటెస్టెంట్ ఎవరన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Recommended Video

Bigg Boss Telugu 4: Karate Kalyani అవుట్, డబుల్ ఎలిమినేషన్ ఉత్తిదే.. సీక్రెట్ రూంలో హారిక!!
డేంజర్ జోన్‌లో ఉన్నది అతడే... గేమ్‌లో కూడా

డేంజర్ జోన్‌లో ఉన్నది అతడే... గేమ్‌లో కూడా

ఇక, ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న తొమ్మిది మందిలో కరాటే కల్యాణీ తర్వాత డేంజర్ జోన్‌లో ఉన్న కమెడియన్ కుమార్ సాయి అన్న విషయం తెలిసిందే. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటర్ అయిన అతడు.. తన మార్క్ చూపించలేకపోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అందుకు అనుగుణంగానే శనివారం జరిగిన టాస్క్‌లో అతడిని జీరో అని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో దేత్తడి హారిక ఇంటి నుంచి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X