ముక్కు అవినాష్ ఇంట్లో పెను విషాదం: పురిట్లోనే బిడ్డను కోల్పోయిన భార్య.. అసలు ఏం జరిగిందంటే!

తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా ఎంతో మంది ఆర్టిస్టులు తమదైన శైలి టాలెంట్లను చూపిస్తూ సత్తా చాటుతోన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చుకున్నారు. అందులో కమెడియన్ ముక్కు అవినాష్ ఒకడు.

చాలా కాలం క్రితమే ఈ రంగంలోకి అడుగు పెట్టిన ఈ కుర్రాడు.. ఆరంభంలోనే అద్భుతమైన టైమింగ్‌తో అందరి దృష్టిలో పడ్డాడు. అదే సమయంలో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్తోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అవినాష్ ఇంట్లో పెను విషాదం జరిగింది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే....

 Comedian Mukku Avinash and His Wife Anuja Lost Their Baby

ఆమెను పెళ్లాడిన అవినాష్: జబర్ధస్త్‌ ద్వారా వెలుగులోకి వచ్చి.. బిగ్ బాస్ షోతో సెన్సేషన్‌గా మారి.. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సెలెబ్రిటీగా మారిపోయాడు ముక్కు అవినాష్. కెరీర్ పరంగా సక్సెస్ అయిన అతడు.. కొన్నేళ్ల క్రితమే అనూజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెతో వైవాహిక జీవితాన్ని కూడా విజయవంతంగా నడుపుకుంటున్నాడు. ఆమె కూడా సోషల్ మీడియాలో క్రేజ్ పొందింది.

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా: వివాహం అయిన తర్వాత ముక్కు అవినాష్ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగిపోతోన్నాడు. అతడు ఇప్పుడు 'కామెడీ స్టాక్ ఎక్చేంజ్', 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' వంటి షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అదే సమయంలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లలో సైతం భాగం అవుతున్నాడు. ఇలా కొంత కాలంగా అవినాష్ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.

 Comedian Mukku Avinash and His Wife Anuja Lost Their Baby

భార్య ప్రెగ్నెంట్.. వీడియో: అనూజను వివాహం చేసుకున్న తర్వాత అవినాష్ ఆమె బంధాన్ని అందంగా కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా ఇద్దరూ కలిసి యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు కూడా చేస్తున్నారు. దీంతో వీళ్లిద్దరూ బెస్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు. ఇక, ఇటీవలే అనూజ ప్రెగ్నెంట్ కూడా అయింది. అయినప్పటికీ ఆమె యూట్యూబ్‌లో ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తూనే ఉంది.

 Comedian Mukku Avinash and His Wife Anuja Lost Their Baby

అవినాష్ ఇంట్లో విషాదం: ముక్కు అవినాష్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడని అతడి అభిమానులు ఆసక్తిగా, ఎంతో సంతోషంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆమె డెలివరీకి డేట్ వచ్చేసినా దీనిపై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అవినాష్.. తమ బిడ్డను పురిట్లోనే కోల్పోయినట్లు తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన వివరణ ఇస్తూ పోస్ట్ చేశాడు.

బిడ్డను కోల్పోయాం అని: ఇన్‌స్టా పోస్టులో అవినాష్ 'నా లైఫ్‌లో సంతోషమైనా, బాధ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కొల్పోయాం' అని తెలిపాడు.

 Comedian Mukku Avinash and His Wife Anuja Lost Their Baby

జీర్ణించుకోలేని విషయం: ఇదే పోస్టులో ముక్కు అవినాష్ 'మేము బిడ్డను కోల్పోయిన విషయం జీవితంలో ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత త్వరగా మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థ్యాంక్యూ. మీ లవ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ రాసుకొచ్చాడు.

అవినాష్ రిక్వెస్ట్.. ఓదార్పు: ముక్కు అవినాష్ పెట్టిన పోస్టులో 'దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ.. మీ అనూజ అవినాష్' అని రిక్వెస్ట్ చేశాడు. ఇక, ఈ సంఘటనపై అవినాష్, అనూజ దంపతులకు చాలా మంది అభిమానులు, సెలెబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. వాళ్లను ఓదార్చుతూ కామెంట్లను పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X