బిడ్డను కోల్పోవడంపై పెదవి విప్పిన అవినాష్: త్వరలోనే బెస్ట్ రాబోతుంది అంటూ!
తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ.. టాప్ కమెడియన్లలో ఒకడిగా వెలుగొందుతోన్నాడు ముక్కు అవినాష్. తనదైన ప్రత్యేకమైన శైలితో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. సినిమా అవకాశాలను సైతం అందుకుంటూ ముందుకు సాగుతోన్నాడు.
ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అవినాష్ భార్య అనూజ ఓ బిడ్డను పురిట్లోనే కోల్పోయింది. దీనిపై తాజాగా ఈ టాప్ కమెడియన్ స్పందించాడు. ఇంతకీ అతడు ఏం చెప్పాడో మీరే చూసేయండి!

అవినాష్ ఇంట్లో దుర్ఘటన: ముక్కు అవినాష్ భార్య అనూజ కొన్ని నెలల క్రితమే ప్రెగ్నెంట్ అయింది. అయితే, ఆమె డెలివరీకి డేట్ వచ్చేసినా దీనిపై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అవినాష్.. తమ బిడ్డను పురిట్లోనే కోల్పోయినట్లు తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన వివరణ ఇస్తూ పోస్ట్ చేశాడు. దీంతో అతడి అభిమానులు ఖంగుతిన్నారు.

అసలు విషయాన్ని చెప్తూ: అవినాష్ తన ఇన్‌స్టాలో 'నా లైఫ్‌లో సంతోషమైనా, బాధ అయినా మీతోనే పంచుకుంటా. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నా. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కొల్పోయాం' అని పోస్ట్ చేశాడు.

అవినాష్ రిక్వెస్ట్ చేశాడు: ముక్కు అవినాష్ పెట్టిన పోస్టులోనే 'దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ.. మీ అనూజ అవినాష్' అని రిక్వెస్ట్ చేశాడు. దీంతో అవినాష్‌ను ఎవరూ ఏ సందర్భంలోనూ ఈ దుర్ఘటన గురించి ప్రశ్నించలేదు. ఫలితంగా ఈ విషాదం గురించి చాలా మంది త్వరగానే మర్చిపోయారు.
తొలిసారి స్పందించాడు: బిడ్డను కోల్పోయినప్పటికీ అవినాష్ ఎప్పటి లాగానే షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. తన ప్రొఫెషన్‌పై ఉన్న ప్రేమతో అందరినీ నవ్విస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన 'బూట్‌కట్ బాలరాజు' సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఈ పరిస్థితుల్లో ముక్కు అవినాష్ తన బిడ్డను కోల్పోవడం గురించి తొలిసారి మీడియా ముందు మాట్లాడాడు.

సమాధానం చెప్పలేదు: తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావన రావడంతో అవినాష్ ఈ విషాదం గురించి మాట్లాడాడు. 'నేను రిక్వెస్ట్ చేయడంతో చాలా మంది త్వరగానే దీన్ని మర్చిపోయారు. కానీ, కొందరు సినిమా వాళ్లు కానీ, అభిమానులు కానీ ఓదార్చడం కోసం ఫోన్లు చేశారు. కానీ, నేనే వేటికీ రెస్పాండ్ కాలేదు. వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక ఏమీ మాట్లాడలేకపోయాను' అని వెల్లడించాడు.

బెస్ట్ వస్తుందేమో అని: ఆ తర్వాత ముక్కు అవినాష్ కంటిన్యూ చేస్తూ.. 'ఈ ఘటన నుంచి మేము త్వరగానే కోలుకున్నాం. నా లైఫ్‌లో ఇది కరిగిపోయిన మేఘం (passing cloud) లాంటిది. ఏమో.. ఫ్యూచర్‌లో మాకు ఇంకా బెస్ట్ రాబోతుందేమో అని అనుకుంటున్నాం. ఈ విషయంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు' అని చెప్పాడు.


Click it and Unblock the Notifications











