వైభవంగా ముక్కు అవినాష్ వివాహ వేడుక.. హాజరైన సెలబ్రెటీలు.. స్పెషల్ ఎట్రాక్షన్ వాళ్లే!

జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ముక్కు అవినాష్ చిన్నపాటి కమెడియన్ నుంచి టీం లీడర్ వరకు వచ్చాడు. అయితే జబర్దస్త్ తర్వాత అతని కెరీర్లో మరో స్థాయికి వెళ్లడానికి బిగ్ బాస్ సీజన్ 4 ఎంతగానో హెల్ప్ అయ్యింది. బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ఫైనల్స్ వరకు ఉంటాడు అని అందరు అనుకున్నారు. కానీ కొంచెం దూరంలోనే అతను మళ్ళీ వెనుదిరగాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ షో ద్వారా తన ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ దాటి మంచి స్థాయికి చేరుకున్నాడు. ఇక ఫైనల్ గా అబినాష్ ఒక ఇంటివాడు అయ్యాడు. తన కుటుంబ సభ్యులు చూసిన చూసిన దగ్గరి బంధువు అమ్మాయిని నేడు పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లికి ముందే బుల్లితెరపై..

పెళ్లికి ముందే బుల్లితెరపై..

గత కొన్ని వారాల క్రితం ముక్కు అవినాష్ తను ఇష్టపడిన అనుజా అనే అమ్మాయితో సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫోటోషూట్స్ అంటూ సోషల్ మీడియాలో తనకు కాబోయే భార్యను కూడా ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అంతేకాకుండా పలు రియాల్టీ షోలలో కూడా అనుజతో ప్రత్యేకంగా కొన్ని స్కిట్స్ కూడా చేశాడు. ముక్కు అవినాష్ తన భార్యతో ఇటీవల పుట్టినరోజు వేడుకను కూడా హ్యాపీ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ వేడుకలో పలువురు సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు.

అవినాష్ పెళ్లి వేడుకలో సెలబ్రెటీలు

అవినాష్ పెళ్లి వేడుకలో సెలబ్రెటీలు

ఇక నిశ్చితార్థ వేడుకను సింపుల్ గానే చేసుకున్నటువంటి ముక్కు అవినాష్ పెళ్లి మాత్రం కాస్త ఘనంగా చేసుకున్నాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు బుల్లితెర ప్రేక్షకులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ దివి, అరియానా, సోహెల్ వంటివారు అవినాష్ పెళ్లి వేడుకలో ఎంతగానో సందడి చేశారు. అలాగే జబర్దస్త్ కమెడియన్స్ కూడా అవినాష్ పెళ్లి వేడుకలు స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు.

 పెళ్లి సందడిలో శ్రీముఖి

పెళ్లి సందడిలో శ్రీముఖి

అయితే ఒక రోజు ముందుగానే నిర్వహించిన హల్దీ వేడుకల్లో శ్రీముఖి కూడా దర్శనమిచ్చింది. అవినాష్ పెళ్ళికొడుకుని చేసే వరకు కూడా ఆమె ఇంట్లోనే ఉంది. ముక్కు అవినాష్ శ్రీముఖి ఇద్దరు కూడా మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక స్నేహితుడి పెళ్లి వేడుకలో శ్రీముఖి స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది. మా అవఇన్స్ పెళ్ళికొడుకాయనే అంటూ కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

Recommended Video

Auto Ramprasad's Peep Show First Look | Poster Launch Press Meet
 ఆర్థికంగా నిలదొక్కుకున్న అవినాష్

ఆర్థికంగా నిలదొక్కుకున్న అవినాష్

ముక్కు అవినాష్ మొదట సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత జబర్దస్త్ లో ఒక చిన్న కమెడియన్ గా అవకాశం అందుకని ఆ తర్వాత కొన్నాళ్లకు టీమ్ లీడర్ వరకు వచ్చాడు. అతని ప్రతిభకు ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాల్లో ఆఫర్స్ కూడా వచ్చాయి. వీలైనంత వరకు తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటూ ముందుకు సాగుతూ వచ్చాడు. ఇక జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ షో లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తన స్థాయిని మరింత పెంచుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా అవినాష్ నిలదొక్కుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X