For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాబోయే భార్యతో ముక్కు అవినాష్ ముద్దులు..రొమాంటిక్ స్టెప్పులు..లేటెస్ట్ ఫొటోస్ వైరల్

  |

  టెలివిజన్ ఇండస్ట్రీలో ఒక మంచి కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకున్న ముక్కు అవినాష్ పెళ్లికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని కొన్నేళ్లుగా అతను పెళ్లిపై ఏ స్థాయిలో రూమర్స్ వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలామంది యాంకర్స్ తో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో కూడా అతను ప్రేమలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఫైనల్ గా అవి కేవలం ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో గాసిప్స్ మాత్రమే అని తేలిపోయింది.

  అవినాష్ చాలా క్రమశిక్షణతోనే ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నాడు. ఇక ఫైనల్ గా అవినాష్ తనకు నచ్చిన అబ్బాయితోనే కుటుంబ సభ్యుల నిర్ణయంతో వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అయితే తనకు కాబోయే భార్య తో అవినాష్ కొన్ని ఫోటోలు మాత్రమే ఇటీవల రిలీజ్ చేశాడు. ఇక రీసెంట్ గా మరొక ముఖ్యమైన వీడియోను కూడా విడుదల చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇక అందులో అవినాష్ తన ప్రేయసికి ఇష్టంగా ముద్దుపెట్టుకుంటూ రొమాంటిక్ డాన్స్ కూడా చేసే ప్రయత్నం చేశాడు.

  అవకాశాల కోసం..

  అవకాశాల కోసం..

  హైదరాబాద్ లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనంతరం అవినాష్ సినిమాల్లో అవకాశాలు అందుకోవాలని మొదట్లో చాలా ప్రయత్నాలు చేశాడు. ఫిలింనగర్ లో ఎన్నో స్టూడియోల చుట్టూ తిరిగాడు. అయితే ఇక్కడ కూడా తనకు అవకాశాలు రాకపోవడంతో ఒక మిత్రుడి సలహాతో జబర్దస్త్ లో కి వెళ్ళాడు. వచ్చిన కొత్తలోనే అతను మంచి కమెడియన్ గా గుర్తింపు అందుకొని టీమ్ లీడర్స్ తో కూడా మంచి సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఒకరి తర్వాత మరొకరు గ్రూప్ లో స్కిట్స్ చేసుకుంటూ వెళుతూ తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు.

  ఊహించని దెబ్బ..

  ఊహించని దెబ్బ..

  ఇక ఆ తర్వాత జబర్దస్త్ లోనే కొన్నాళ్ళకు టీం లీడర్ గా ఎదిగిన అవినాష్ మంచి ఆదాయాన్ని కూడా అందుకున్నాడు. అక్కడ మంచి ఆదాయం రావడంతో ఒక మంచి ఫ్లాట్ ను కూడా కొనుగోలు చేసుకొని తల్లిదండ్రులను కూడా ఎంతో బాగా చూసుకునే స్థాయికి వచ్చాడు. ఇక కరెక్ట్ గా అతని కెరీర్ కి ఒక ట్రాక్ లో పడుతున్న సమయంలోనే ఊహించని దెబ్బ పడింది. జబర్దస్త్ లో అతనికి అవకాశం రావడం సంతోషించదగ్గ విషయమే. కానీ అందులోకి వెళ్లడానికి అతను నానా తంటాలు పడాల్సి వచ్చింది.

   బిగ్ బాస్ లోకి వెళ్లడానికి..

  బిగ్ బాస్ లోకి వెళ్లడానికి..

  జబర్దస్త్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం బయటకు వెళ్ళడానికి వీలు లేదు. ఒక వేళ వెళితే కొంత డబ్బు కట్టి బయటకు వెళ్లాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితులను నిలదొక్కుకోవాలి అంటే బిగ్ బాస్ లాంటి షో రూమ్ లోకి వెళ్లి మంచి ఆదాయాన్ని అందుకోవాలని అవినాష్ తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. ఇక శ్రీముఖి గెటప్ శ్రీను వంటి వారి సహాయంతో జబర్దస్త్ కి భారీ స్థాయిలో డబ్బును ముట్ట చెప్పే NOC పత్రాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ తో అతనికి మంచి ఆదాయం లభించింది.

  అందుకే వాయిదా వేసుకుంటూ వచ్చాడు

  అందుకే వాయిదా వేసుకుంటూ వచ్చాడు

  మొత్తానికి బిగ్ బాస్ తరువాతే అవినాష్ కెరీర్ కొంత గాడిలో పడింది అని చెప్పవచ్చు. అప్పులు తీర్చడమే కాకుండా తన సొంత ఊరిలో కూడా ఇంటిని మళ్ళీ కొత్తగా నిర్మించుకున్నాడు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. అసలైతే గత ఏడాదిలోనే అవినాష్ కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికీ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉండడం వలన అవినాష్ ఆ పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చాడు.

  పెద్దల నిర్ణయం ప్రకారమే

  పెద్దల నిర్ణయం ప్రకారమే

  మొత్తానికి కుటుంబ సభ్యులు చూసిన ఒక మంచి అమ్మాయిని ఇటీవల ఫిక్స్ చేసేశారు. మొదట కుటుంబ సభ్యులు మాట్లాడుకున్న తర్వాతనే అవినాష్ పెద్దల నిర్ణయాన్ని గౌరవించి అనుజ అనే అమ్మాయికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇటీవల చాలా సింపుల్ గా అమ్మాయి ఇంట్లోనే నిశ్చితార్థ వేడుకను పూర్తి చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలు కూడా అవినాష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.

  ముద్దులు పెట్టుకుంటు..

  ముద్దులు పెట్టుకుంటు..

  తనకు కాబోయే భార్య అనుజతో అవినాష్ చాలా ఇష్టంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. అనుజను దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా ముద్దులు కూడా పెట్టాడు. అవినాష్ తరహాలోనే అనుజ కూడా కాబోయే భర్త నుదిటిపై ప్రేమగా ముద్దులు పెట్టింది. ఇక ఇద్దరూ కాస్త రొమాంటిక్ టచ్ చూపిస్తూ స్టెప్పులు కూడా వేశారు. ఒకరికొకరు దండలు ఉంగరాలు మార్చుకున్నారు. అలాగే గోరుముద్దలు కూడా తినిపించుకున్నారు. ఈ జంటను చూసిన నెటిజన్లు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

  English summary
  Comedian mukku avinash new romantic stills with her fiance
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X