Bigg Boss 17 విజేతగా యంగ్ కమెడియన్.. హైదరాబాద్ కుర్రాడికి షాక్.. టాలీవుడ్ హీరోయిన్‌కు ఏ ప్లేస్ అంటే!
బుల్లితెరపై సంచలనాత్మకమైన కంటెంట్‌తో ప్రసారం అవుతూ.. దేశంలోనే నెంబర్ వన్ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. అన్ని భాషల కంటే హిందీలోనే ముందుగా మొదలైన ఇది.. అక్కడ ఏకంగా 16 సీజన్లను పూర్తి చేసుకుంది.
ఈ క్రమంలోనే ఇటీవలే మొదలైన 17వ సీజన్ ఈ ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌తో ముగిసింది. ఇందులో ఎవరూ ఊహించని ఎన్నో పరిణామాలు జరిగాయి. చివరికి యంగ్ కమెడియన్ ఈ సీజన్‌లో విజేతగా నిలిచాడు. ఇంతకీ అతడెవరు? మరి హైదరాబాద్ కుర్రాడు, టాలీవుడ్ హీరోయిన్ పరిస్థితి ఏంటి? మీరే చూసేయండి!

17వ సీజన్ అలా మొదలైంది: హిందీ బిగ్ బాస్ వరుసగా పదహారు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత అక్టోబర్ 15వ తేదీన 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం అయింది. దీనికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్టుగా చేశాడు. రొటీన్‌గా సాగిపోతోన్న బిగ్ బాస్‌ను రంజుగా మార్చేందుకు ఈ సీజన్‌లో నిర్వహకులు ఎన్నో ప్రయోగాలు చేశారు. దీంతో ఈ సీజన్ చాలా ప్రత్యేకంగా సాగిందని చెప్పాలి.

ఆ గొడవలతో మరింత రేంజ్: బిగ్ బాస్ 17వ సీజన్‌లో కూడా గతంలో మాదిరిగానే గొడవలు జరిగాయి. అయితే, ఈ సారి పలువురు కంటెస్టెంట్లు కొట్టుకున్నారు. ఫలితంగా ఈ సీజన్ మరింత రసవత్తరంగా మారింది. ముఖ్యంగా అభిషేక్‌ను కెప్టెన్ ఎలిమినేట్ చేయడం.. ఆ తర్వాత అతడికి క్రేజ్ పెరగడం కనిపించాయి. కానీ, మన్నారా చోప్రా, మునావర్ వంటి వాళ్లు మొదటి నుంచీ భారీ ఫాలోయింగ్‌తో సత్తా చాటారు.
ఫినాలేకు చేరిన ఐదుగురు: 107 రోజుల పాటు సాగిన 17వ సీజన్ ఊహించని మలుపులతో ఆసక్తికరంగా సాగింది. ఆరంభంలో 17 మందితో పాటు మరో 4 మంది వైల్డ్ కార్డ్ మెంబర్లతో కలిపి మొత్తంగా 21 మంది ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక, వీరి నుంచి ఐదుగురు కంటెస్టెంట్లు మునావర్ ఫరూఖీ, మన్నారా చోప్రా, అభిషేక్ కుమార్, అరుణ్ శ్రీకాంత్ మాశెట్టి, అంకిత లోఖండే ఫినాలేకు చేరారు.

విజేతగా మునావర్ ఫరూఖీ: ఆదివారం బిగ్ బాస్ 17వ సీజన్ గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా జరిగింది. సల్మాన్ ఖాన్ అదిరిపోయే హోస్టింగ్‌తో పాటు పలువురు సెలెబ్రిటీల పెర్ఫార్మెన్స్‌ల నడుమ ఇది సందడిగా సాగింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మునావర్ ఫరూఖీ విజేతగా నిలిచాడు. తద్వారా బిగ్ బాస్ ట్రోఫీతో పాటు రూ. 50 లక్షలు ప్రైజ్ మనీని సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్నాడు.

టాలీవుడ్ హీరోయిన్ నిరాశ: బిగ్ బాస్ 17వ సీజన్‌లోకి టాలీవుడ్ హీరోయిన్, ప్రియాంక చోప్రా సోదరి మన్నారా చోప్రా కూడా కంటెస్టెంట్‌గా వచ్చారు. ఇందులో ఆమె కూడా మంచి నటనతో పాటు వ్యక్తిత్వంతో ఆకట్టుకుంది. ఫలితంగా ఈ సీజన్‌లో ఫినాలేకు చేరింది. కానీ, ఊహించని విధంగా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక, అభిషేక్ రెండో స్థానంలో, అంకిత నాలుగో స్థానంలో బిగ్ బాస్‌ను ముగించుకున్నారు.
హైదరాబాద్ కుర్రాడికి షాక్: బిగ్ బాస్ 17వ సీజన్‌లో మునావర్ ఫరూఖీ, మన్నారా చోప్రా, అభిషేక్ కుమార్, అరుణ్ శ్రీకాంత్ మాశెట్టి, అంకిత లోఖండే ఫినాలేకు చేరారు. ఇందులో అరుణ్ శ్రీకాంత్ హైదరాబాద్‌కు చెందిన యూట్యూబర్. ఇతగాడు ఆరంభం నుంచీ అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుని ఫినాలేకు చేరుకున్నాడు. అయితే, పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడంతో ఐదో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











