ఇంద్రజపై షాకింగ్ కామెంట్స్ చేసిన జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ షోతో పాపులర్ అయిన కమెడియన్ నూకరాజు తాజాగా సీనియర్ హీరోయిన్ ఇంద్రజను తన పిల్లలకు నాయనమ్మ అంటూ కామెంట్ చేసి షాక్ ఇచ్చాడు. మరి దీనంతటి వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

నూకరాజు జబర్దస్త్ తో పాటే శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి పలు బుల్లితెర షోలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఈ రెండు షోలలో కూడా జడ్జ్ గా ఇంద్రజనే కనిపించడం విశేషం. ఇక అటు జబర్దస్త్, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో నూకరాజు ఎక్కువగా ఇంద్రజపై ఇంట్రెస్టింగ్ పంచులు వేస్తూ ఉంటాడు.

Comedian Nookaraju shocking comments on Actress Indraja in Sridevi Drama Company Comedy Show

ఎప్పటిలాగే తాజాగా రిలీజ్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో లో కూడా నూకరాజు ఇంద్రజపై వెరైటీ కామెంట్స్ చేసి చర్చకు దారి తీసాడు. తరచుగా ఇంద్రజ తన తల్లి లాంటిది అంటూ ఎప్పుడు చెప్పే నూకరాజు ఈసారి మాత్రం ఆమెను మరోతరం వెనక్కి నెట్టేసాడు. ఈసారి ఏకంగా ఆమెను నాయనమ్మను చేసేసాడు.

శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ప్రోమోలో నూకరాజు వేసిన స్కిట్ లో ఈ కామెంట్స్ చేశాడు. రాంమ్ ప్రసాద్ వచ్చి డాన్స్ చేస్తే, ఇంద్రజ గారు జడ్జిమెంట్ ఇస్తే.. జడ్జిమెంట్ అంటే అందరికీ మంటే.. ఓయమ్మా ఇంద్రజమ్మా నా పిల్లలకి నువ్వు నాయనమ్మ అంటూ ఓ పాటకి స్పూఫ్ లాగా పాడాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.

ముఖ్యంగా ఇంద్రజ ఎక్స్ ప్రెషన్ చూడాలి. ఆమె నవ్వును ఆపుకోలేకపోయింది. మరో కామెడీ షో జబర్దస్త్ లో కూడా ఇంద్రజ జడ్జిగా తప్పుకుంటున్నాను అంటూ చెప్పి కంటతడి పెట్టింది. అందులో కూడా ఇంద్రజ నూకరాజును ఎమోషనల్ గా దగ్గరకు తీసుకోవడం కన్పించింది.

Comedian Nookaraju shocking comments on Actress Indraja in Sridevi Drama Company Comedy Show

అలాగే ఆ తర్వాత నూకరాజు ఫైమాను టార్గెట్ చేశాడు. ఆమెపై పంచుల వర్షం కురిపించాడు. ఇక చివరిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని స్పెషల్ పాటలు పాడి అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాడు నూకరాజు. అప్పట్లో తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ప్రాణ త్యాగం చేసిన ఎందరో అమరవీరులను మరోసారి తన పాటతో కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు.

ఇక ఈ లేటెస్ట్ ప్రోమోను చూసిన తర్వాత టెలివిజన్ ప్రేక్షకులందరూ నూకరాజుకు పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో పంచులు వేసి నవ్వించే ప్రతిభ మాత్రమే కాకుండా ఇలా అద్భుతంగా పాటలు పాడే టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X