మళ్లీ బుక్కైన కమెడియన్ పృథ్వీ: అప్పుడు ఇప్పుడు వెనుక నుంచే.. పరువు పోయేలా మాట్లాడుతూ రచ్చ

విలక్షణమైన నటనతో సపోర్టింగ్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా సత్తా చాటుతూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు పృథ్వీ రాజ్. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో మంచి మంచి పాత్రల్లో నటించిన ఆయన.. ప్రేక్షకులకు మజాను పంచుతూనే ఉన్నారాయన. అదే సమయంలో రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చారు. అయితే, అక్కడ మాత్రం ఆయనకు అంతగా కలిసి రాలేదు. దీనికి కారణం ఆయన ఓ వివాదంలో చిక్కుకోవడమే. తాజాగా దీనిని ప్రస్తావిస్తూ పృథ్వీ రాజ్ ఓ షోలో షాకింగ్ కామెంట్స్ చేసి బుక్కైపోయారు. ఆ సంగతులు మీకోసం!

‘30 ఇయర్స్ ఇండస్ట్రీ' ఫుల్ ఫేమస్

‘30 ఇయర్స్ ఇండస్ట్రీ' ఫుల్ ఫేమస్

ఈ మధ్య కాలంలో గుర్తింపు దక్కించుకున్నప్పటికీ పృథ్వీ రాజ్ చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో పాత్రలను పోషించిన ఆయన.. 'ఖడ్గం' సినిమాలో '30 ఇయర్స్ ఇండస్ట్రీ' అంటూ చెప్పిన డైలాగ్‌తో ఫుల్ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత 'లౌక్యం'లో బబ్లూ పాత్రతో ఎన్నో మరపురాని క్యారెక్టర్లు చేసి మెప్పించారు. దీంతో ఫుల్ బిజీ అయిపోయారు.

 పొలిటికల్ ఎంట్రీ... మంచి పదవిలో

పొలిటికల్ ఎంట్రీ... మంచి పదవిలో

అప్పుడెప్పుడో సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. పృథ్వీ రాజ్ ఇటీవలి కాలంలోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడాయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని కేటాయించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆయనకు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్‌వీబీసీ) చైర్మన్‌ పదవిని ఇచ్చారు.

 వివాదంలో చిక్కుకుని... దూరంగా

వివాదంలో చిక్కుకుని... దూరంగా

ఎస్‌వీబీసీ చైర్మన్‌గా కొనసాగుతోన్న సమయంలోనే కమెడియన్ పృథ్వీ రాజ్.. ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో తన పదవికి రాజీనాయా చేశారాయన. అదే సమయంలో రాజకీయాలకు సైతం దూరమైపోయారు. అప్పటి నుంచి సినిమాల్లో ఆఫర్ల కోసం అన్వేషించి ఇప్పుడు బిజీ అయ్యారు.

శ్రీమంతుడిగా మారిన కమెడియన్

శ్రీమంతుడిగా మారిన కమెడియన్

ఈ మధ్య కాలంలో కమెడియన్ పృథ్వీ రాజ్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు టీవీ కార్యక్రమాల్లో సైతం గెస్టుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఎన్నో షోలలో తనదైన శైలి టైమింగ్‌తో సందడి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షో కోసం 'శ్రీమంతుడు' గెటప్‌తో ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేశారు.

మళ్లీ బుక్కైన కమెడియన్ పృథ్వీ

షోలో భాగంగా కమెడియన్లంతా 'కరువు వచ్చింది కాబట్టి ఊరు వదిలి వెళ్లిపోదాం' అని నిర్ణయించుకుంటారు. సరిగ్గా అప్పుడే కమెడియన్ పృథ్వీ రాజ్ సైకిల్ మీద ఒక పెట్టె పట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో ఆయనకు శ్రీమంతుడా అనే బ్యాగ్రౌండ్ స్కోర్ వేశారు. ఇక రావడం రావడమే ఊరుని దత్తత తీసుకుంటున్నట్లు చెబుతారు. ఆ తర్వాత ఓ డైలాగ్‌తో బుక్కైపోయారు.

Recommended Video

MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
 అప్పుడు ఇప్పుడు వెనుక నుంచే

అప్పుడు ఇప్పుడు వెనుక నుంచే

గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ పృథ్వీ రాజ్.. స్టేజ్ మీద ఉన్న హైపర్ ఆదితో 'ఏం ఆది వెనుక నుంచి వచ్చానని కంగారు పడ్డావు కదా' అని అన్నారు. దీనికి ఆ యంగ్ కమెడియన్ 'మీరు వెనుక నుంచి వస్తారని తెలుసు కానీ.. మాకోసం కూడా వస్తారని తెలీదు' అంటూ సెటైర్ వేశాడు. దీంతో తన వివాదాన్ని గుర్తు చేసుకుని మరీ పృథ్వీ రాజ్ పరువు పోగొట్టుకున్నట్లు అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X