ప్రముఖ కమెడియన్‌కు గుండెపోటు.. అపస్మారక స్థితిలో వెంటిలేటర్‌పై.. సీఎం,రక్షణ మంత్రి పరామర్శ
హిందీ వినోద పరిశ్రమలో స్టాండప్ కమెడియన్‌గా విశేషమైన పాపులారిటీని సంపాదించుకొన్న కమెడియన్లలో రాజు శ్రీవాస్తవ ఒకరు. రెండు దశాబ్దాలకుపైగా కెరీర్‌లో విభిన్నమైన హాస్యం, విలక్షణమైన హావభావాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకొన్నారు. అయితే ఆగస్టు 9వ తేదీన ఆయన తీవ్రంగా గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది. రాజు శ్రీవాస్తవ హెల్త్ బులెటిన్ వివరాల్లోకి వెళితే..

మిమిక్రీ నుంచి స్టాండప్ కమెడియన్‌గా
కమెడియన్ రాజు శ్రీవాస్తవ కెరీర్ విషయానికి వస్తే.. గ్రేట్ ఇండియా లాఫ్టర్ ఛాలెంజ్‌తో అభిమానులను సంపాదించకొన్నారు. ఆ తర్వాత కామెడీ కా మహా ముకాబలా, కామెడీ సర్కస్, కామెడీ నైట్స్ విత్ కపిల్ లాంటి షోలతో పాపులారిటి సంపాదించుకొన్నారు.

ప్రధాని మోదీని మెప్పించిన కమెడియన్
రాజు శ్రీవాస్తవ తన హాస్యంతో ఎంతో మంది సినీ, రాజకీయ నేతలను మెప్పించారు. ఓ సందర్భంలో ప్రధాని మోదీ ఎదుట మిమిక్రీ చేయగా ఆయన ఆనందంలో మునిగిపోయారు. మీరు నా హావభావాలతో మిమిక్రీ చేయవచ్చు. నాకు అభ్యంతరం ఏమీ లేదు అని ప్రధాన మోడీ చెప్పడం విశేషంగా మారింది. మిమిక్రీ కళకు రాజు శ్రీవాస్తవ ఎంతో గుర్తింపు తెచ్చారు.

గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరిక
అత్యంత ప్రతిభావంతుడైన కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆగస్టు 9వ తేదీన గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్ సహాయంతో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ఉదయం వర్కవుట్ చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

వర్కవుట్స్ చేస్తూ ట్రెడ్ మిల్‌పై
రాజు శ్రీవాస్తవ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 9వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో వర్కవుట్ చేస్తున్నారు. ఆ సమయంలో గుండెపోటుతో ట్రెడ్ మిల్‌పై కుప్పకూలారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. అతడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అని చెప్పారు.

యూపీ సీఎం యోగి ఆదిత్య ఫోన్
రాజు శ్రీవాస్తవ గుండెపోటుకు గురయ్యారనే వార్తను తెలుసుకొన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్‌లో ఫ్యామిలీని పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.

సంపూర్ణ ఆరోగ్యంతో వస్తాడంటూ
రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం గురించి మరో స్టాండప్ కమెడియన్ సునీల్ పాల్ సమాచారం అందించారు. సకాలంలో హస్పిటల్‌లో చేర్చడం ద్వారా ప్రమాదం తప్పింది. దేవుడి దయవల్ల ఆరోగ్యం మెరుగుపడుతున్నది. అతడికి ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేదు. త్వరలోనే రాజు భాయ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారు అని సునీల్ పాల్ చెప్పారు.


Click it and Unblock the Notifications











