Raju Srivastava ఇకలేరు.. ఎయిమ్స్‌లో కన్నుమూత

ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఇకలేరు. గుండెపోటుతో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆయన మరణానికి సంబంధించిన వివరాలు, వ్యక్తిగత విషయాల్లోకి వెళితే..

కమెడియన్ రాజు శ్రీవాస్తవ కెరీర్ విషయానికి వస్తే.. గ్రేట్ ఇండియా లాఫ్టర్ ఛాలెంజ్‌తో అభిమానులను సంపాదించకొన్నారు. ఆ తర్వాత కామెడీ కా మహా ముకాబలా, కామెడీ సర్కస్, కామెడీ నైట్స్ విత్ కపిల్ లాంటి షోలతో పాపులారిటి సంపాదించుకొన్నారు. అత్యంత ప్రతిభావంతుడైన కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆగస్టు 9వ తేదీన గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్ సహాయంతో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు.

Raju Srivastav

రాజు శ్రీవాస్తవ తన హాస్యంతో ఎంతో మంది సినీ, రాజకీయ నేతలను మెప్పించారు. ఓ సందర్భంలో ప్రధాని మోదీ ఎదుట మిమిక్రీ చేయగా ఆయన ఆనందంలో మునిగిపోయారు. మీరు నా హావభావాలతో మిమిక్రీ చేయవచ్చు. నాకు అభ్యంతరం ఏమీ లేదు అని ప్రధాన మోడీ చెప్పడం విశేషంగా మారింది. మిమిక్రీ కళకు రాజు శ్రీవాస్తవ ఎంతో గుర్తింపు తెచ్చారు.

మిమిక్రీ కళతోనే కాకుండా కమెడియన్‌గా బాలీవుడ్‌లో కూడా మెప్పించారు. మైనే ప్యార్ కియా, బాజీగర్, బాంబే టూ గోవా, ఆమ్‌దానీ అఠానీ, ఖర్చా రూపైయా చిత్రాల్లో నటించారు.

రాజు శ్రీవాస్తవం మరణవార్త వినగానే గుండె ముక్కలైంది. నాకు మంచి మిత్రుడు, నా శ్రేయోభిలాషి, నా పొరుగింటి వ్యక్తి. ఆయన లేరనే వార్తతో దిగ్బ్రాంతికి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X