జబర్దస్త్ లేడీ కమెడియన్‌కు చేదు అనుభవం.. నడుముపై చేయివేసిన యువకుడు.. రచ్చ రచ్చ!

ఇటీవలి కాలంలో యువతులపై లైంగిక దాడులు మరీ పెరిగిపోయాయి. హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు కొందరు పోకిరి కుర్రాళ్ళు. అమ్మాయి కనిపిస్తే చాలు.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ విషయంలోనూ అదే జరిగింది. వివరాల్లోకి పోతే..

 జబర్దస్త్ షో.. లేడీ గెటప్స్

జబర్దస్త్ షో.. లేడీ గెటప్స్

జబర్దస్త్ వేదికపై ఎందరో కమెడియన్స్ తమ తమ ప్రత్యేకత చాటుకుంటూ భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఎవరికి వారు డిఫెరెంట్, డిఫెరెంట్ గెటప్స్ వేస్తూ బుల్లితెరప్రేక్షకులను తెగ నవ్విస్తున్నారు. ఇందులో ముఖ్యంగా లేడీ గెటప్స్ వేసే వినోదిని, శాంతి స్వరూప్ లాంటి వారికి ఫాలోయిన్ బాగా పెరిగింది.

పబ్లిక్ ప్లేస్‌లో జబర్దస్త్ కమెడియన్స్.. షాకింగ్ ఇన్సిడెంట్

పబ్లిక్ ప్లేస్‌లో జబర్దస్త్ కమెడియన్స్.. షాకింగ్ ఇన్సిడెంట్

ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్స్ పబ్లిక్ ప్లేస్ ఎక్కడికి వెళ్లినా వారితో సెల్ఫీలు దిగడం, వారితో మాట్లాడుతూ ఉండటం లాంటివి చేస్తున్నారు జనం. ఇంతవరకూ బాగానే ఉన్నా తాజాగా శాంతి స్వరూప్‌ చేదు అనుభవం ఎదురు కావడం, ఓ వ్యక్తి అతని నడుముపై చేయివేయడం షాకింగ్ పరిణామంగా మారింది.

 శాంతి స్వరూప్ నడుముపై చేయివేసి..

శాంతి స్వరూప్ నడుముపై చేయివేసి..

ప్రాంక్ వీడియో తీయడంలో భాగంగా ఓ యువకుడు శాంతి స్వరూప్ నడుముపై చేయి వేశాడు. అంతటితో ఆగకుండా ఆ యువకుడు ముద్దు కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించడంతో శాంతి స్వరూప్ అతనిపై ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చెప్పు తీసిన శాంతి స్వరూప్.. ప్రాంక్ వీడియో

చెప్పు తీసిన శాంతి స్వరూప్.. ప్రాంక్ వీడియో

తన నడుముపై చేయివేసిన సదరు యువకుడిని కొట్టడానికి చెప్పు కూడా తీశాడు శాంతి స్వరూప్. దీంతో ఆ యువకుడు తాము ప్రాంక్ వీడియో తీస్తున్నామని శాంతి స్వరూప్‌ కి చెప్పాడు. అయినప్పటికీ ఈ జబర్దస్త్ కమెడియన్ ఊరుకోలేదు. బూతులు తిట్టాడు. వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడం జరిగింది.

Recommended Video

Naga Babu Reveals His Financial Problems And Struggles || Filmibeat Telugu
నీ రేట్ ఎంత? అంటూ..

నీ రేట్ ఎంత? అంటూ..

ఓ సినిమా షూటింగ్‌లో శాంతి స్వరూప్‌ పాల్గొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. గతంలో కూడా ఇలాగే శాంతి స్వరూప్‌ పలుసార్లు చేదు అనుభవం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తనను నీ రేట్ ఎంత? ఎన్ని కూడా అడిగారని చాలాసార్లు మీడియా ముఖంగా చెప్పాడు శాంతి స్వరూప్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X