twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సన్నీ, కాజల్ రొమాన్స్ రచ్చ.. సారీ చెప్పిన సుదర్శన్.. అంతా ఎడిటింగే అంటూ!

    |

    బిగ్‌ బాస్‌ రియాలిటీ షో ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. మరి ముఖ్యంగా వీకెండ్‌ ఎపిసోడ్స్‌ అయితే ఇలా స్పెషల్‌ గా డిజైన్ చేస్తున్నారు. అందులో భాగంగానే సండే ఫండేగా సాగిన ఎపిసోడ్‌లో 'అనుభవించు రాజా' టీం సందడి చేసింది. ఈ సినిమా హీరో హీరోయిన్లు రాజ్‌ తరుణ్‌, కౌశిష్‌, కమెడియన్ సుదర్శన్‌ కనిపించి హౌస్‌ మేట్స్‌తో సరదాగా మాట్లాడి అందరినీ నవ్వించారు. అయితే అంతా బాగానే ఉన్నా ఆయన కాజల్‌-సన్నీల రిలేషన్‌ను తప్పుబడుతూ చేసిన కామెంట్స్‌ వివాదాస్పదం అయ్యాయి. ఈ క్రమంలో ఆయన క్షమాపణలు చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే

    సందడి

    సందడి

    బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక అందరి గురించి సుదర్శన్ మాట్లాడారు. అలాగే కాజల్ సన్నీ గురించి కూడా మాట్లాడారు. ఆ ఇద్దరి గేమ్‌ గురించి అప్పటి వరకు సరదాగా పంచ్ లు వేసిన సుదర్శన్‌..'చివర్లో కాజల్‌ మీరు అలిగినప్పుడు చాలా బాగుంటుందనీ, సన్నీ వచ్చి ఓదార్చడం..అదో టైప్‌ రొమాన్స్‌ బాగుంది'.. అంటూ నోరు జారాడు. దీంతో షాక్‌ అయిన సన్నీ మాది బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ రిలేషన్‌ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

    సైలెంట్ అయ్యారు కానీ

    సైలెంట్ అయ్యారు కానీ

    అయితే అప్పటికి పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపించినా సన్నీ-కాజల్‌ల రిలేషన్‌పై తప్పుగా మాట్లాడినందుకు కమెడియన్‌ సుదర్శన్‌ను నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. అసలు హౌస్ లో ఫ్రెండ్స్‌ లా మంచి రిలేషన్ లో ఉన్న వాళ్లు మీకు రొమాన్స్‌ చేస్తూ ఎప్పుడు కనిపించారు? అసలు రొమాన్స్ చేస్తున్న వాళ్లను పట్టించుకోకుండా అన్నా చెల్లెలు అలాంటి వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు.

    ఎడిటింగ్ వల్లే

    ఎడిటింగ్ వల్లే

    సినిమా ప్రమోషన్స్ చేసుకోవడానికి వచ్చి సినిమా ప్రమోషన్స్ చేసుకుని వెళ్లకుండా ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ముందు ఈ విషయాన్ని కూడా లైట్ తీసుకున్న సుదర్శన్ అంత అంత కంతకు ఈ వ్యవహారం పెద్దది అవుతూ ఉండడంతో క్షమాపణ చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు. హౌస్ లోపల ఉన్నప్పుడు మేం చాలా మాట్లాడుకున్నాం. కానీ ఎడిటింగ్‌ వల్ల కేవలం 5 నిమిషాలే చూపించారు. కాజల్‌-సన్నీ రిలేషన్‌ గురించి తప్పుగా మాట్లాడే ఉద్దేశం నాకు లేదు.

     క్షమాపణలు

    క్షమాపణలు

    బయటకు వచ్చిన వీడియో వల్ల నెగిటివ్‌గా అనుకుంటున్నారని ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే సన్నీ ఫ్యాన్స్‌, కాజల్‌ ఫ్యామిలీకి క్షమాపణలు చెబుతున్నా' అంటూ వీడియో రిలీజ్‌ చేశాడు సుదర్శన్‌. మరో పక్క హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతూ ఉండగా ఈ టాస్క్ లో షణ్మఖ్ కెప్టెన్గా గెలిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గతంలో ఒకసారి కెప్టెన్ గా పనిచేసిన షణ్ముఖ్ మరో సారి ఆటలలో గెలిచి కెప్టెన్సీ అందుకున్నట్లు చెబుతున్నారు.

    Recommended Video

    Akhanda Movie టార్గెట్.. | Naga Chaitanya మాస్ లో క్లాస్ ! || Filmibeat Telugu
    మళ్లీ అతనే కెప్టెన్

    మళ్లీ అతనే కెప్టెన్

    షణ్ముఖ్ ఎలాగూ టాప్ ఫైవ్ లో ఉంటాడని అందరూ భావిస్తున్నారు అయినా సరే ఈసారి కెప్టెన్గా ఎన్నికవడం అనేది ఆయనకు కాస్త బూస్ట్ ఇచ్చినట్లు చెప్పాలి. ముందు నుంచి కూడా చాలా సైలెంట్ గా వ్యవహరిస్తూ వచ్చిన షణ్మఖ్ ఆట చివరికి వచ్చేసరికి మాత్రం తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు.

    English summary
    comedian Sudarshan says sorry to Sunny and Kajal fans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X