కసి ఉంటేనే రావాలి.. ‘అదిరింది’ని ఇంటింటికి తీసుకెళ్లాలి.. కమెడియన్ వేణు కామెంట్స్

వెండితెరపై నవ్వులు పూయించిన వేణు.. బుల్లితెరపై వేణు వండర్స్‌గా మరింత ఫేమస్ అయ్యాడు. ఓ రకంగా జబర్దస్త్ షో పుట్టుకకు కారణమైన వారిలో వేణు కూడా ఉన్నాడు. బృందావనం సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో వేణు, ధన్‌రాజ్ చేసిన కామెడీ స్కిట్లు వేలాదిమంది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఆ సమయంలోనే జబర్దస్త్ పుట్టుక కూడా జరిగింది. మొదట్లో వీరే జబర్దస్త్‌ను నడిపించిన సంగతి తెలిసిందే.

జబర్దస్త్‌తో మరింత గుర్తింపు..

జబర్దస్త్‌తో మరింత గుర్తింపు..

అప్పటి వరకు వెండితెరపై నవ్వులు పూయిస్తున్న వేణు, జబర్దస్త్, రోలర్ రఘు వంటి వారు బుల్లితెరకు వచ్చారు. జబర్దస్త్ షో మొదలైంది తమతోనే అని, మొదటి ఎపిసోడ్, మొదటి స్కిట్, మొదటి విజేత కూడా తానేనని ధన్‌రాజ్ చెప్పిన సందర్భాలెన్నో. ఇలా బుల్లితెరపై వీరందరికీ ఎంతో గుర్తింపు వచ్చింది.

మధ్యలో గ్యాప్..

మధ్యలో గ్యాప్..

వేణు వండర్స్, ధనాధన్ ధన్‌రాజ్ వంటి వారు మధ్యలో జబర్దస్త్‌ను వీడిపోయారు. మధ్యలో రావడం మళ్లీ వెళ్లడం జరిగిపోయింది. అయితే కంటిన్యూగా రాకపోయే సరికి మధ్యలో కొత్తవారు ఎంట్రీ ఇచ్చారు. తమ టీమ్‌లో పనిచేసిన వారే టీమ్ లీడర్స్‌గా ఎదిగిపోయారు. దీంతో వారు జబర్దస్త్‌కు పూర్తిగా దూరమయ్యారు. తాజాగా వేణు ఓ మీడియాతో ముచ్చటిస్తూ తన ప్రయాణం గురించి ఎన్నో వివరాలు వెల్లడించాడు.

కసి ఉంటేనే రావాలి..

కసి ఉంటేనే రావాలి..


మనలో నటించాలనీ, నటుడవ్వాలనీ కోరిక చాలా బలంగా ఉండాలని అన్నాడు. ఆ లక్ష్యంతో ఒక కసితో, నటించాలనే పిచ్చితో ఈ రంగంలోకి రావాలని తెలిపాడు. అలాంటివారికి ఈ రంగంలో ఎదగడానికి ఇప్పుడు లక్షదారులు ఉన్నాయని పేర్కొన్నాడు.

Recommended Video

Vakeel Saab : Key Changes In Pawan Kalyan's Vakeel Saab Movie
‘అదిరింది’ని ఇంటింటికి..

‘అదిరింది’ని ఇంటింటికి..

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన నితిన్ భరత్.. అదిరింది షోను ప్రారంబించిన సంగతి తెలిసిందే. ఈ కామెడీ షోలో వేణు, ధన్‌రాజ్, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ వంటి వారు నవ్వులు పూయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో గురించి వేణు మాట్లాడుతూ.. ‘ఈ లాఫ్టర్‌ షో ద్వారా ప్రేక్షకులకు మంచి కామెడీ ఇస్తున్నాం. మా శాయశక్తులా కష్టపడుతున్నాం. ‘అదిరింది' షో ఇంటింటికీ తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తున్నామ'ని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X