కమెడియన్ చెంప పగిలింది.. జబర్దస్త్ వేదికపై కొట్లాట

జబర్దస్త్ కామెడీ షో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఆడియెన్స్ లో మంచి ఆదరణ ఉంది. అందుకే 12 ఏళ్లుగా నిర్వరామంగా కొనసాగుతోంది. విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంటూ అంతకంతూ సంచలనంగా మారుతోంది. తొలుత ఈ షోకు ఆదరణ దక్కుతుందో లేదో అనే సందేహంతో ప్రారంభించినా ప్రస్తుతం ఈషో సెన్సేషన్ గా మారింది. ఎందరో సెలబ్రెటీలను ఈ షో తెలుగు చిత్ర పరిశ్రమకు అందింది. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ వస్తోందీ షో. ఇప్పటికే ఈ షో ద్వారా ఎంత మంది కమెడియన్లు స్టార్ గా ఎదిగారో మనకు తెలిసిందే.

సుడిగాలి సుధీర్, అనసూయ, వేణు, హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి వారు ప్రస్తుతం వెండితెరపై వెలుగుతున్నారంటే కారణం జబర్దస్త్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి టాలెంట్ ఉన్న వారికి ఈ వేదిక బంగారు భవిష్యత్ ను అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటికీ ఈ షో నిర్విరామంగా బుల్లితెర ఆడియెన్స్ కు హాస్యాన్ని పంచుతూనే ఉంది. ప్రతి శుక్ర, శనివారాల్లో ఈటీవీ విన్ ఛానెల్ లో ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

Comedians fight in Jabardasth Comedy show latest epiosde here is why

ఈ క్రమంలో తాజాగా లేటెస్ట్ జబర్దస్త్ కామెడీ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో కమెడియన్ల స్కిట్లు ఆకట్టుకుంటున్నాయి. లేటెస్ట్ ఎపిసోడ్ పై చాలా ఆసక్తిని పెంచేలా ప్రోమోను విడుదల చేశారు. అయితే ఇద్దరు కమెడియన్లు తమ స్కిట్ నుంచి బయటికి వచ్చి రియల్ గానే కొట్టు కుంటున్నట్లుగా కనిపించింది. అది ఎవరి స్కిట్టో కాదు. బుల్లితెర స్టార్ కమెడియన్ సద్దాం హుస్సేన్ టీమ్ లోని ఇద్దరు ఆర్టిస్ట్ లు కొట్లాడుకున్నారు. దాంతో అందరూ షాక్ అయ్యారు. అయితే అది స్కిట్ లో భాగమనే కనిపిస్తోంది. ఫుల్ ఎపిసోడ్ వస్తే అసలు మేటర్ తేలనుంది.

జబర్దస్త్ కు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్స్ ఏప్రిల్ 25, ఏప్రిల్ 26వ తేదీల్లో ఈటీవీన్ లో ప్రసారం కానుంది. సద్దామ్ హుస్సేన్ తో పాటు ఆటో రామ్ ప్రసాద్, ప్రవీణ్, కెవ్వు కార్తీక్ టీమ్ లు హిలేరియస్ కామెడీ స్కిట్లను అందించనున్నాయి. రెండు రోజుల పాటు బుల్లితెర ఆడియెన్స్ కు కడుపుబ్బా నవ్వించే కామెడీ అందనుంది. ఈ షోలకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మరింత కొత్త కంటెంట్ ను అందించేందుకు టీమ్ లీడర్లు, కమెడియన్లు ప్రయత్నిస్తున్నారు.

ఇక ఈ షోకు ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ మేల్ జడ్జీగా వ్యహరిస్తున్నారు. ఇంద్రజా ఫీమేల్ జడ్జీగా వ్యవహిరిస్తూ తీర్పులు చెబుతున్నారు. నాణ్యమైన, ఫ్యామిలీ అంతా కలిసి చూసే కామెడీని అందిస్తున్నారు. ఇక తాజా ఎపిసోడ్ లో మాత్రం సీనియర్ నటి లయా గెస్ట్ జడ్జీగా విచ్చేసింది. తన అభిమానులను ఈ షోతో ద్వారా పలకరించింది. ఇక యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరించింది. లేటెస్ట్ ఎపిసోడ్ లో తన ఇంట్రోతో అదరగొట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X