Hyper Aadi Gundu: హైపర్ ఆదికి చేదు అనుభవం.. గుండు కొట్టించి మరీ.. అమ్మాయి ముద్దు ఎఫెక్ట్

తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది కుర్రాళ్లు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే తమదైన టాలెంట్‌తో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుతోన్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకడు. పైన పేర్కొన్న దానికంటే ఎక్కువ ప్రభావాన్నే చూపిస్తోన్న అతడు.. సినిమాలు, షోలతో దూసుకెళ్తోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా హైపర్ ఆదికి కొందరు గుండు కొట్టించారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అసలేం జరిగిందో మీరే చూడండి!

బుల్లితెరపై స్టార్‌గా హైపర్ ఆది

బుల్లితెరపై స్టార్‌గా హైపర్ ఆది

జబర్ధస్త్ ద్వారా వెలుగులోకి వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగాడు హైపర్ ఆది. పది నిమిషాల పాటు ఉండే అతడి స్కిట్లో లెక్కపెట్టలేనన్ని పంచులు ఉండడం వల్లే అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. దీనికితోడు రైటర్‌గానూ సత్తా చాటుతోన్న అతడు తనదైన స్కిట్లతో అలరిస్తున్నాడు. దీంతో అతడికి అవకాశాలు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి.

సినిమాల్లోనూ.. ఆల్‌రౌండర్‌గా

సినిమాల్లోనూ.. ఆల్‌రౌండర్‌గా

గుక్క తిప్పుకోకుండా పంచులు వేస్తూ తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్న హైపర్ ఆది.. సినిమాల్లోకి కూడా అడుగు పెట్టేశాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు కూడా చేశాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్ చేశాడు. ఇక, అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు సంభాషణలు అందించి డైలాగ్ రైటర్‌గానూ వర్క్ చేశాడు.

జబర్ధస్త్‌లోకి.. షోలు, ఈవెంట్లు

జబర్ధస్త్‌లోకి.. షోలు, ఈవెంట్లు

దాదాపు ఐదారేళ్లుగా జబర్ధస్త్‌లో నెంబర్ వన్ టీమ్‌ లీడర్‌గా హవాను చూపిస్తోన్న హైపర్ ఆది.. కొంత కాలం పాటు ఆ షోలో కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా గ్యాప్ తర్వాత అతడు షోలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే, 'ఢీ14', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో కూడా సందడి చేస్తూ ముందుకెళ్తున్నాడు. అలాగే, ఎన్నో స్పెషల్ స్కిట్లలోనూ అలరిస్తూ సత్తా చాటుతోన్నాడు.

హైలైట్‌ ఆది.. చదివింపులతో

హైలైట్‌ ఆది.. చదివింపులతో

వరుస షోలతో బిజీగా గడుపుతోన్న హైపర్ ఆది.. తాజాగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో పాల్గొన్నాడు. వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ను 'చదివింపులు' అనే కాన్సెప్టుతో చూపించబోతున్నారు. ఇక, ఇందులో హైపర్ ఆది తనదైన శైలి కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అంతేకాదు, ప్రత్యేకమైన స్కిట్లను చేసి ఓ రేంజ్‌లో హైలైట్ అయ్యాడు.

నెంబర్ వెనుక టాస్కు అంటూ

నెంబర్ వెనుక టాస్కు అంటూ

'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో భాగంగా వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో హైపర్ ఆదితో యాంకర్ రష్మీ ఓ గేమ్ ఆడించింది. దీని ప్రకారం.. స్క్రీన్‌పై కనిపించే ఓ నెంబర్‌ను అతడు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని వెనుక ఏమి రాసి ఉంటే అతడు ఆ టాస్కును చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎంతో సందడిగా సాగినట్లు ప్రోమోను చూస్తే అర్థం అవుతోంది.

30 సెకెన్లు ముద్దు పెట్టాలంటూ

'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో నెంబర్ టాస్కులో భాగంగా హైపర్ ఆది తన లక్కీ నెంబర్ 9 అని దాన్నే కోరుకున్నాడు. దీంతో అతడికి 'ఒకరికి 30 సెకెన్లు ముద్దు పెట్టాలి' అని టాస్క్ వచ్చింది. దీంతో అతడు జబర్ధస్త్ ఐశ్వర్యను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. దీంతో పొట్టి నరేష్ 'ఇవన్నీ కావాలని పెట్టుకున్నావు కానీ.. వేరే నెంబర్ ట్రై చెయ్' అనడంతో ఆది వెనక్కి తగ్గాడు.

గుండు కొట్టించి మరీ ఘోరంగా

గుండు కొట్టించి మరీ ఘోరంగా

మొదటి నెంబర్ వద్దని అనడంతో ఈసారి హైపర్ ఆది 11ను సెలెక్ట్ చేసుకున్నాడు. దీని వెనుక 'గుండు కొట్టించుకోవాలి' అని వచ్చింది. దీంతో అతడు పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ, అక్కడున్న వాళ్లందరూ పట్టుకుని గుండు చేయించినట్లు చూపించారు. అయితే, చివర్లో గుండు చేయించుకుని వెళ్లేది ఎవరో మాత్రం క్లియర్‌గా చూపించలేదు. దీంతో ఇది హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X