నాగబాబు, ఇంద్రజలపై ఫైమా షాకింగ్ కామెంట్స్.. జబర్దస్త్ వదిలేయాలనుకుందా?

ఈటీవీలో ప్రసారమైన 'పటాస్' షోతో బుల్లితెరకు పరిచయమైన కమెడియన్ ఫైమా (Faima). తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కమెడియన్ ఫైమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె పాల్గొన్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమంలో చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా జబర్దస్త్ జడ్జెస్ నాగబాబు, ఇంద్రజలపై చేసిన వ్యాఖ్యలు, అలాగే తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

'పటాస్' ద్వారా కెరీర్ ప్రారంభించిన ఫైమా, తన టాలెంట్‌తో త్వరగానే గుర్తింపు పొందింది. అనంతరం జబర్దస్త్ లోకి అడుగుపెట్టి, లేడీ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. అక్కడ బుల్లెట్ భాస్కర్ వంటి టీం లీడర్ల ప్రోత్సాహంతో ఎదిగి, ప్రస్తుతం మెంటర్ స్థాయికి చేరుకోవడం ఆమె ప్రయాణంలో కీలక ఘట్టంగా నిలిచింది. అంతేకాదు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్‌గా పాల్గొని తన వ్యక్తిత్వంతో మరింత అభిమానాన్ని సంపాదించుకుంది.

Comedy Artist Faima Clarifies Jabardasth Exit Rumors Reacts on Nagababu and Indraja Comments

ఇటీవల 'కిస్సిక్ టాక్స్' షోలో ఫైమాకు జబర్దస్త్ జడ్జెస్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. 'నాగబాబు ఉంటే జబర్దస్త్‌లో పాల్గొనను' అంటూ ఫైమా అన్నారనే ప్రచారం ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని యాంకర్ వర్ష నేరుగా ప్రశ్నించగా, ఫైమా ఒక్కసారిగా షాక్‌కు గురైంది. "ఇలా అడిగితే నా కెరీర్‌కే నిప్పు పెట్టినట్టే కదా!" అంటూ నవ్వుతూ, కానీ కొంచెం టెన్షన్‌తో రియాక్ట్ అయింది. అయితే వర్ష అక్కడితో ఆగకుండా, సరదాగా మరింత రచ్చ చేసింది. 'నాగబాబు గారు మాకు ఫాదర్ లాంటి వారు... కానీ ఫైమా మాత్రం ఆయన ఉంటే షో వదిలేస్తానంటుంది'అంటూ ఆటపట్టించడంతో సెట్లో నవ్వులు పూశాయి.

దీంతో ఫైమా వెంటనే చేతులు జోడించి క్లారిటీ ఇచ్చింది. 'ఇది అంతా పూర్తిగా కల్పితం... నాకు అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు' అంటూ స్పష్టంగా తెలిపింది. తర్వాత ఆమె నాగబాబు గురించి ఎంతో గౌరవంతో మాట్లాడింది. "నాగబాబు సార్ సెట్లోకి వస్తేనే ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటుంది. ఆయన ముందు ప్రతి ఆర్టిస్ట్ కూడా మరింత బాగా చేయాలని ప్రయత్నిస్తారు. ఆయన చూపు పడాలంటేనే మేమంతా మా బెస్ట్ ఇస్తాం" అని చెప్పింది. అంటే, ఆయన ఉనికి కమెడియన్లలో పోటీ భావనను పెంచుతుందని ఆమె సూచించింది.

'మొదట నాగబాబు గారి ముందు స్కిట్ చేయాలంటే చాలా భయంగా అనిపించేది. ఆయన ఎలా స్పందిస్తారో తెలియక టెన్షన్ ఉండేది. కానీ ఒకసారి స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం మొదలుపెడితే, ఆయన ఇచ్చే ఎనర్జీ, ఎంకరేజ్‌మెంట్ వల్ల మేము చాలా కంఫర్ట్‌గా ఫీల్ అయ్యేవాళ్లం. అదే మా పెర్ఫార్మెన్స్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లేది' అని తెలిపింది. అంతేకాదు, ఆయన మళ్లీ షోలో కనిపించడం పట్ల తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేసింది. "జబర్దస్త్‌లో నాగబాబు సార్ తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన రావడంతో షోకి కొత్త కళ వచ్చింది. మాలో కొత్త ఉత్సాహం పెరిగింది. మరింత కొత్తగా, క్రియేటివ్‌గా చేయాలనే తపన పెరిగింది' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

తర్వాత హోస్ట్ అడిగిన "నాగబాబు గారు ఇష్టమా? లేక ఇంద్రజ గారు ఇష్టమా?" అనే ప్రశ్నకు ఫైమా తనదైన స్టైల్‌లో "రెండు కళ్లలో ఏది ఇష్టం అని అడిగితే ఎలా చెప్పగలం? ఇద్దరూ నాకు సమానం" అంటూ ఇద్దరికీ సమాన గౌరవం ఉందని తెలిపింది. ఈ సమాధానం అక్కడున్నవారిని ఆకట్టుకోవడంతో పాటు, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఈ సందర్భంలో ఫైమా చెప్పిన మాటలు చూస్తే, నాగబాబు మీద ఆమెకు ఎంత గౌరవం ఉందో స్పష్టంగా తెలుస్తోంది.

Read more about: nagababu indraja faima
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X