»   » కామెడీ నైట్స్: బాబాపై కామెడీ చేసిన యాక్టర్ అరెస్ట్

కామెడీ నైట్స్: బాబాపై కామెడీ చేసిన యాక్టర్ అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హిందీ చానల్స్ చూసే వారికి....‘కామెడీ నైట్స్ విత్ కపిల్' కార్యక్రమం గురించి పరిచయం ఉండే ఉంటుంది. ఈ షోలో పాలక్ పేరుతో కామెడీ చేసే కికూ శర్దాను పోలీసులు అరెస్టు చేసారు. అతను చేసిన నేరం....ఓ బాబాను ఇమిటేట్ చేస్తూ నవ్వించడమే.

డేరా సచ్చా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్‌ను అనుకరిస్తూ కామెడీ చేసిన కారణంగా కికూపై జనవరి ఒకటిన కేసు నమోదైంది. తమ గురువును కించపరచడం ద్వారా తమ మనోభావాలను, ధార్మిక విశ్వాసాలను దెబ్బతీశారని బాబా శిష్యులూ కొందరు ఆయనపై కేసు పెట్టారు.

Comedy Nights Actor Kiku Sharda Arrested

ఈ కేసును విచారించిన పోలీసులు చివరకు కికూను అరెస్ట్ చేశారు. అయితే తాను కావాలని ఏమీ చేయలేదని, రైటర్, డైరక్టర్ సూచనల మేరకే చేశానని వెల్లడించారు. అయితే ఈ అరెస్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేక్షకులను నవ్వించడానికి ఇలాంటి షోలో చేయడం మామూలే, ఈ మాత్రం దానికి ఇంత రాద్దాంతం చేయాలా? అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.

English summary
Comedian Kiku Sharda who features in the blockbuster TV hit "Comedy Nights With Kapil" has been arrested in Haryana for imitating self-styled spiritual guru Baba Gurmeet Ram Rahim Singh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu