టీవీ కామెడీ స్టార్ పెళ్లి ఆమెతో ఫిక్సయిందా?
ముంబై: హిందీ ఎంటర్టెన్మెంట్ టెలివిజన్ ఛానల్ 'కలర్స్'లో ప్రసారం అయ్యే 'కామెడీ నైట్స్ విత్ కపిల్' ఈ మధ్య కాలంలో బాగా ఆదరణ పొందిన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ హిందీ కామెడీషో చూసే వారి సంఖ్య ఎక్కువే. ఈ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కపిల్ శర్మ పెళ్లికి సిద్దమైనట్లు వార్తలు లీకయ్యాయి. 'కామెడీ నైట్స్ విత్ కపిల్' కార్యక్రమానికి క్రియేటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న ప్రీతి సీమోస్‌ను అతను పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది.
2013 సంవత్సరం కపిల్ శర్మకు బాగా కలిసొచ్చింది. ఎందుకంటే ఈ సంవత్సరం అత్యంత ఎక్కువ ఆదరణ పొందిన కార్యక్రమంగా 'కామెడీ నైట్స్ విత్ కపిల్' టాప్ లిస్టులో చోటు దక్కించుకుంది. ఊహించని విధంగా పెద్ద పాపులర్ స్టార్ అయిపోయాడు కపిల్ శర్మ. ఇదంతా అతని ప్రొఫెషనల్ లైఫ్ కోణం. ఇక 2014 సంవత్సరం అతని పర్సనల్ లైఫ్‌కు అతి ముఖ్యమైన సంవత్సరంగా మారబోతోంది.

కామెడీ సర్కస్ కార్యక్రమం నుంచి వీరిద్దరూ కలిసి పని చేస్తున్నారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ క్రమంలోనే వీరి ఒకరికొకరు ఆకర్షితులయ్యారని, అదే ప్రేమగా మారిందని అంటున్నారు. ఇద్దరి ఆలోచనతోనే'కామెడీ నైట్స్ విత్ కపిల్' కార్యక్రమానికి రూపకల్పన జరిగినట్లు తెలుస్తోంది.
గిన్ని చత్రాత్ అనే భామతో కపిల్ శర్మ ఎఫైర్ ఉన్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఆమె కపిల్ శర్మ కాలేజీ ఫ్రెండ్ అని, ఇద్దరి మధ్య మంచి స్నేహం తప్ప ఇతర సంబంధమేమీ లేదని స్పష్టమైంది. కపిల్ శర్మ, ప్రీతి సీమోస్ వివాహం వచ్చే ఏడాది జరుగబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











