twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీముఖి కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.. ఆందోళనలో నిర్వాహకులు

    |

    Recommended Video

    Sreemukhi Effect On Patas Show

    బుల్లితెర పాపులర్ షో పటాస్ నుంచి ఇటీవలే యాంకర్ శ్రీ ముఖి తప్పుకున్న సంగతి తెలిసిందే. కారణం ఏదైనప్పటికీ ఈ షో నుంచి శ్రీముఖి తప్పుకున్నాక పటాస్ డిమాండ్ బాగా తగ్గిందని తెలుస్తోంది. యూత్ ఆడియన్స్ ని ఎంటర్‌టైన్ చేస్తూ యాంకర్స్ రవి, శ్రీ ముఖి ఈ షోని సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తూ వచ్చారు. అయితే కొద్దిరోజుల శ్రీముఖి తప్పుకోవడంతో రేటింగ్స్ పడిపోయాయని అంటున్నారు. వివరాల్లోకి పోతే..

    యాంకర్స్ స్పెషల్ అట్రాక్షన్

    యాంకర్స్ స్పెషల్ అట్రాక్షన్

    బుల్లితెర కామెడీ షోల్లో యాంకర్స్ పార్ట్ చాల ప్రధానమైంది. ఆడియన్స్ ని ఎంటర్‌టైన్ చేయడంలో పార్టిసిపెంట్స్ తో పాటు యాంకర్ పాత్ర కూడా చాలా కీలకం. అయితే పటాస్ షోలో ఈ బాధ్యతను ఇన్నాళ్లు సక్సెస్ ఫుల్‌గా కొనసాగిస్తూ వచ్చారు యాంకర్ రవి, శ్రీముఖి. బుల్లితెరపై ఈ ఇద్దరి కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

    రోజు రోజుకూ పాపులర్ అవుతూ

    రోజు రోజుకూ పాపులర్ అవుతూ

    పటాస్ ప్రోగ్రామ్ రోజు రోజుకూ పాపులర్ అవుతూ వచ్చింది. దాదాపు 1000 కి పైగా ఎపిసోడ్స్ లో బుల్లితెర ఆడియన్స్ లో జోష్ నింపుతూ వచ్చారు నిర్వాహకులు. అంతేకాదు ఈ షోకి మంచి టీఆర్పీ రేటింగ్స్ కూడా తెచ్చుకుంది సదరు టీవీ ఛానెల్. అయితే ఉన్నట్టుండి శ్రీముఖి తప్పుకోవడంతో టీఆర్పీ రేటింగ్స్ పడిపోయాయనే టాక్ వినిపిస్తోంది.

     చిన్న బ్రేక్ అంటూ శ్రీముఖి మెసేజ్

    చిన్న బ్రేక్ అంటూ శ్రీముఖి మెసేజ్

    కొద్ది రోజుల క్రితం పటాస్ షో నుంచి తప్పుకుంటున్నట్లుగా పేర్కొంటూ పటాస్ నిర్వాహకులకు థాంక్స్ చెప్పింది శ్రీముఖి. తన కెరీర్ లో కీలకమైన షో పటాస్ అని, ఇన్ని రోజులు పటాస్ వేదికపై ఫుల్లుగా ఎంజాయ్ చేశానని తెలుపుతూ వీడియో పోస్ట్ చేసింది శ్రీముఖి. ఇక అప్పటి నుంచి ఆమె పటాస్‌కి దూరమైంది.

    శ్రీముఖి లేని పటాస్

    శ్రీముఖి లేని పటాస్

    శ్రీముఖి తప్పుకున్నాక జనంలో పటాస్ పై క్రేజ్ బాగా తగ్గిపోయిందట. తనదైన కామెడీ పంచులు వేస్తూ గ్లామర్ గా కనిపించే ఆమె లేకుండా పటాస్ చూడలేకలేక పోతున్నారట బుల్లితెర ఆడియన్స్. దీంతో ఎప్పుడైతే శ్రీముఖి తప్పుకుండా అప్పటి నుంచే టీఆర్ఫీ రేటింగ్స్ భారీగా పడిపోయాయని ఆందోళన చెందుతున్నారట పటాస్ నిర్వాహకులు.

    బిగ్ బాస్ 3 కోసమేనా..?

    బిగ్ బాస్ 3 కోసమేనా..?

    త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ 3 లో శ్రీముఖి ఓ పార్టిసిపెంట్‌గా ఉండనుందని వార్తలు వస్తున్నాయి. జులై ఎండింగ్ లో ఈ షో ప్రారంభం కానుంది. దీంతో శ్రీముఖి పటాస్ షో నుంచి బయటకు రావడానికి ఇదే ప్రధాన కారణం అని తెలుస్తోంది. పైగా ఆమె పోస్ట్ చేసిన వీడియోలో లిటిల్ బ్రేక్ అని చెప్పింది కాబట్టి బిగ్ బాస్ 3 కోసమే ఆమె ఈ బ్రేక్ తీసుకుందని ఫిక్సయ్యారంతా.

    English summary
    One of the famous and popular show in television is Patas. Recently from this show Anchor Sreemukhi get back and She is going to participate in Bigg Boss3
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X