ఎవ్వరూ తగ్గడం లేదు.. కోల్డ్ వార్ ముదిరింది.. కొత్త షోలతో బుల్లితెరపై ఫైట్
వెండితెర అయినా బుల్లితెర అయినా కూడా ఎంటర్టైన్మెంట్ అన్నది కామన్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెండితెర కంటే ఎక్కువగా బుల్లితెరపైనే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా వస్తోంది. కొత్త కొత్త షోలతో వివిధ చానెళ్లు బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అయితే పైకి చెప్పకపోయినా కూడా చానెల్స్ మధ్య పోటీ ఉంటుందని అందరికీ తెలిసిందే. ఒక చానెల్ ఓ షోతో హిట్ కొట్టేసిందటే.. మరో చానెల్ అదే రకమైన షోను దింపుతుంది. తాజాగా ఇప్పుడు మళ్లీ అలాంటి షోలే రాబోతోన్నాయి.

బుల్లితెరపై రచ్చ..
ఇప్పుడు బుల్లితెరను సీరియళ్ల తరువాత జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలదే హవా. అందుకే ఈటీవీలో మల్లెమాల టీం సరికొత్త షోలను ఎంకరేజ్ చేస్తుంటుంది. జీ తెలుగు, స్టార్ మా వంటి చానెల్స్‌లోనూ కామెడీ, ఎంటర్టైన్మెంట్ షోలను ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ అన్నింటి కంటే ఈటీవీయే ముందుంటుంది.

అవి ఫెయిల్..
అయితే జీ తెలుగు, స్టార్ మాలో కొన్ని షోలు చేసి చేతులు కాల్చుకున్నారు. లాఫ్టర్ చాలెంజ్, అదిరింది, బొమ్మ అదిరింది వంటి షోలు దారుణంగా బెడిసి కొట్టాయి. అయితే స్టార్ మా మాత్రం మళ్లీ తమ సత్తా చాటేందుకు సరికొత్త ప్రోగ్రాంలతో రెడీ అయింది. అయితే ఇందులోనూ కోల్డ్ వార్ బయట పడింది.
Recommended Video

ఈటీవీలో అలా..
ఈటీవీలో శ్రీదేవీ డ్రామా కంపెనీ అనే కొత్త షో రాబోతోందని గత నెలలోనే ప్రోమోలను వదిలారు. అయితే తాజాగా అసలు సిసలు ప్రోమోను వదిలారు. ఇందులో కొన్ని సర్ ప్రైజ్‌లు వదిలారు. నాటి హీరోయిన్ రేఖను కూడా తీసుకొచ్చారు. సీరియల్ హీరో అర్జున్‌లను తీసుకొచ్చారు. అయితే ఆ షోను ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రసారం చేస్తామని ప్రకటించారు.

కామెడీ స్టార్స్ కూడా..
బిగ్ బాస్ కంటెస్టెంట్లను ముందు పెట్టి స్టార్ మాలో ఓ కామెడీ షోను ప్రారంభించేశారు. కామెడీ స్టార్స్ అంటూ మొదలుపెట్టిన ఈ షో ప్రోమో బాగానే వైరల్ అయింది. ఈక్రమంలో ఇందులో శేఖర్ మాస్టర్, నాటి హీరోయిన్ శ్రీదేవిలను తీసుకొచ్చారు. అంతే కాకుండా స్టార్ట్ మ్యూజిక్ అంటూ సుమతోనూ ఓ స్పెషల్ షోను ప్రారంభించారు.

అదే సమయానికి..
అయితే స్టార్ మా వాడు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకులను కంటిన్యూగా కట్టిపడేసేందుకు మంచిప్లాన్ వేశాడు. సుమ షో అయిన వెంటనే కామెడీ స్టార్స్ మొదలవుతుంది. అదే సమయంలో ఈటీవీలో శ్రీదేవీ డ్రామా కంపెనీ కూడా ప్రారంభం అవుతుంది. అయితే ఇలా ముందుగానే కావాలని ఒకే టైంకు ఈ స్పెషల్ షోలన వదిలినట్టుగా తెలుస్తోంది. ఈ రెంటిలో ఏది గెలుస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











