‘హైస్కూల్’ సిరీయల్‌పై కేసు

లోకంలో ఎక్కడో ఓ చోట.. ఏదో రీతిన వెళ్లగక్కే కక్షలూ కార్పణ్యాలూ - పగలూ ప్రతీకారాలూ.. ఇప్పుడు ఏకంగా ఛానెళ్లకు కాసుల పంట పండిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ - రియాల్టీ షోలలో అర్థంపర్థంలేని 'బూతు' ప్రహసనం విజృంభించింది. కోర్టు ఒక్క మొట్టికాయ మొట్టి అటువంటి 'షో'లన్నీ అర్ధరాత్రిళ్లు పెట్టుకోండి అనటంతో - పరిస్థితి కాస్తంత సద్దుమణిగినా - రోజువారీ సీరియళ్లలో అంతకంటె ఘోరమైన బాగోతాలు ఎన్ని కనిపించటం లేదు?!
రోజూ సీరియళ్లు ప్రసారం అయ్యే సీరియళ్లలో ఏ భార్యామణిని తీసుకున్నా - ఆవిడగారి జీవితం సజావుగా నడవదు. ఉన్నట్టుండి ఆఫీస్‌లో స్టెనో రూపంలోనో.. రోడ్డు మీద వెళ్లే అమ్మాయి రూపంలోనో సంసారాన్ని కాటువేస్తుంది. ఇక అక్కడ్నుంచీ కథ ఎన్ని మలుపులు తిరగాలో అన్ని మలుపులూ తిరుగుతుంది. ఇప్పుడు పిల్లలను కూడా వదలడం లేదు సీరియళ్ల రూపకర్తలు. పిల్లల పాత్రల్లో పగలు, ప్రతీకారాలు నింపి చూపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











