twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘హైస్కూల్’ సిరీయల్‌పై కేసు

    By Bojja Kumar
    |

    Television
    హైదరాబాద్: ప్రైవేట్ ఛానెల్‌లో ప్రసారమవుతున్న 'హై స్కూల్' సీరియల్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 'హై స్కూల్' సీరియల్ పిల్లల్లో వైషమ్యాలు పెంచే విధంగా ఉందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో 'హై స్కూల్' సీరియల్‌పై మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్సీ)కు, పోలీస్ కమిషనర్‌కు బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. ఈ సీరియల్ వల్ల పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 'హై స్కూల్' సీరియల్‌ను ప్రసారం చేస్తున్న ఛానెల్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సమాచారం.

    లోకంలో ఎక్కడో ఓ చోట.. ఏదో రీతిన వెళ్లగక్కే కక్షలూ కార్పణ్యాలూ - పగలూ ప్రతీకారాలూ.. ఇప్పుడు ఏకంగా ఛానెళ్లకు కాసుల పంట పండిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ - రియాల్టీ షోలలో అర్థంపర్థంలేని 'బూతు' ప్రహసనం విజృంభించింది. కోర్టు ఒక్క మొట్టికాయ మొట్టి అటువంటి 'షో'లన్నీ అర్ధరాత్రిళ్లు పెట్టుకోండి అనటంతో - పరిస్థితి కాస్తంత సద్దుమణిగినా - రోజువారీ సీరియళ్లలో అంతకంటె ఘోరమైన బాగోతాలు ఎన్ని కనిపించటం లేదు?!

    రోజూ సీరియళ్లు ప్రసారం అయ్యే సీరియళ్లలో ఏ భార్యామణిని తీసుకున్నా - ఆవిడగారి జీవితం సజావుగా నడవదు. ఉన్నట్టుండి ఆఫీస్‌లో స్టెనో రూపంలోనో.. రోడ్డు మీద వెళ్లే అమ్మాయి రూపంలోనో సంసారాన్ని కాటువేస్తుంది. ఇక అక్కడ్నుంచీ కథ ఎన్ని మలుపులు తిరగాలో అన్ని మలుపులూ తిరుగుతుంది. ఇప్పుడు పిల్లలను కూడా వదలడం లేదు సీరియళ్ల రూపకర్తలు. పిల్లల పాత్రల్లో పగలు, ప్రతీకారాలు నింపి చూపిస్తున్నారు.

    English summary
    AP Child rights commission filed Complaint against 'High School' serial.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X