twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్‌కు భారీ షాక్.. వెంటనే షో నిలిపివేయాలి, ఇలాంటి పనులు చేయిస్తూ!

    |

    నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ చివరి దశకు చేరుకుంది. విజేతగా నిలవడం కోసం ఇంటి సభ్యులంతా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. యువతని ఆకట్టుకునే విధంగా షో సాగుతోంది. ప్రతివారం జరుగుతున్న ఎలిమినేషన్ లు ఉత్కంఠ పెంచుతున్నాయి. హౌస్ మేట్స్ మధ్య జరుగుతున్న టాస్క్ లు ఆడియన్స్ కి వినోదాన్ని కలిగిస్తున్నాయి. అదే సమయంలో బిగ్ బాస్ షోని వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు.

    బిగ్ బాస్‌కు షాక్

    బిగ్ బాస్‌కు షాక్

    బిగ్ బాస్ షో ఎక్కువగా యువతని ఆకట్టుకునే విధంగా రూపొందించారు. ఇదిలా ఉండగా ప్రముఖ న్యాయవాది బిగ్ బాస్ షోకి వ్యతిరేకంగా హెచ్ ఆర్ సిలో ఫిర్యాదు నమోదు చేశారు. బిగ్ బాస్ షో పై వ్యతిరేకత కూడా ఉందనేందుకు ఇది నిదర్శనం.

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Episode 77 Highlights
    ఇలాంటి పనులా

    ఇలాంటి పనులా

    బిగ్ బాస్ పేరుతో కొందరిని మానవ హక్కులకు విరుద్ధంగా ఇంటిలో బందించి వారిచేత అడ్డమైన పనులు చేయించడం ఎలా ఆమోదనీయమై న్యాయవాది భాస్కర్ ఫిర్యాదు చేశారు. ఇంటి సభ్యులచేత బిగ్ బాస్ పేరుతో బాత్రూంలు కడిగిస్తూ, వారందరిని బానిసలుగా మార్చేలా పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు.

    నిలిపివేయాలి

    నిలిపివేయాలి

    బిగ్ బాస్ షో చూస్తున్నవారి మానసిక స్థితిపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. వింత టాస్క్ లు, వింత చేష్టలు చేయిస్తూ కుటుంబ సాంప్రదాయాల్ని మంటగలిపే విధంగా ఈ షో ఉందని అందువలన వెంటనే బిగ్ బాస్ నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

     ఇప్పటికే

    ఇప్పటికే

    బిగ్ బాస్ షో ఇప్పటికే 78 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. మరో నెలరోజుల్లో బిగ్ బాస్ 2 వ సీజన్ పూర్తి కానుంది. దేశం మొత్తం అన్ని భాషల్లో బిగ్ బాస్ షో జరుగుతోంది. ఈ నేపథ్యంలో షో నిలిచిపోయే పరిస్థితులు ఉండవని నిపుణులు అంటున్నారు.

    ఒకవేళ

    ఒకవేళ


    బిగ్ బాస్ పై వస్తున్న ఫిర్యాదుల్ని హెచ్ ఆర్ సి సీరియస్ గా తీసుకుంటే మరిన్ని నిబంధనలు విధించే అవకాశాలు లేకపోలేదు. ప్రతిరోజు వినోదాన్ని పంచుతున్న బిగ్ బాస్ షోపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత నెలకొని ఉంది.

    English summary
    Complaint filed on Bigg Boss 2 Telugu in HRC. The show is misleading audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X