చైతన్య మాస్టర్ సూసైడ్ వెనుక అసలు కారణం అదే.. గుట్టు విప్పిన కండక్టర్ ఝాన్సీ
తెలుగు బుల్లితెర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఏప్రిల్ 30 ఆదివారం రోజున ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల కారణంగా తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు ఆత్మహత్యకు ముందు తెలిపిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. డ్యాన్స్ మాస్టర్ చైతన్య బలవన్మరణంతో టెలివిజన్ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆర్టిస్టులు, పలువురు దిగ్భ్రాంతికి లోనయ్యారు. తాజాగా ఆయన మరణంపై డ్యాన్సర్, కండక్టర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్ చేశారు.
అప్పుల వాళ్ల ప్రెజర్:ఢీ 15 షోలో కొరియోగ్రాఫర్ గా చేస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దానికంటే ముందు ఓ సెల్ఫీ వీడియో చిత్రీకరించి నెల్లూరులోని ఓ హోటల్ లో సూసైడ్ చేసుకున్నారు. సెల్ఫీ వీడియోలో తల్లిదండ్రులకు, తోటీ డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు క్షమాపణలు చెప్పిన ఆయన అప్పులు ఇచ్చిన వాళ్ల ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాని, చాలా ప్రయత్నించినా వర్కౌట్ కాకపోవడంతోనే సూసైడ్ చేసుకుంటున్నట్లుగా తెలిపారు.

కూర్చుని మాట్లాడి ఉంటే:డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్యతో ఆయన స్నేహితులు, ఇండస్ట్రీలో పని చేసినవారు, పరిచయం ఉన్నవారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ క్రమంలో బుల్లితెరపై డ్యాన్సర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న కండక్టర్ ఝాన్సీ చైతన్య ఆత్మహత్యపై షాకింగ్ కామెంట్స్ చేసింది. "చైతన్య మాస్టర్ గారు చనిపోయినట్లు మేం ఒంగోలు ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు తెలిసింది. ఆయన అందరితో కలిసి ఒకసారి కూర్చుని మాట్లాడుంటే ఇలా జరిగేది కాదు" అని ఝాన్సీ తెలిపింది.

పక్కవాళ్లకు సాయం:"చైతన్య మాస్టర్ నిర్ణయం వల్ల అమ్మా, నాన్న, చెల్లి బాధపడుతున్నారు. ఆయనతో కలిసి ట్రావెల్ చేసినవాళ్లతో ఇదీ నా పరిస్థితి అని చెప్పి ఉండుంటే వాళ్లు కరిగేవాళ్లే. డబ్బులు ఇవ్వలేక చచ్చిపోవాలనిపిస్తుందని చెప్పి ఉండుంటే ఇలాంటి బాధాకరమైన పరిస్థితి వచ్చేది కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. తనుకున్న లేకపోయినా పక్కవాళ్లకు సాయం చేసే గుణం" అని ఝాన్సీ పేర్కొంది.

అప్పుల మీద అప్పులు:"డిసెంబర్ 31న కండక్ట్ చేసిన ఓ పోగ్రామ్ లో కొంతమంది ఆర్టిస్టులు ఆయనకు హ్యాండిచ్చారు. దాంతో ఆ కమిటీ వాళ్లు మాస్టర్ కు రావాల్సిన అమౌంట్ ను ఆపేశారు. సుమారు రూ. 6, 7 లక్షలు ఉంటుంది. అనుకున్న వాళ్లు ప్రోగ్రామ్ రాకపోయేసరికి ఆ కమిటీ వాళ్లకు కూడా లాస్ వచ్చింది. అందుకే పేమెంట్ ఆపేశారు. దాని వల్ల ఒక అప్పు.. అలా అప్పులు చేసుకుంటూ వచ్చారు. కానీ ప్రోగ్రామ్ లో పార్టిస్ పేట్ చేసినవాళ్లకు డబ్బులు ఇచ్చేందుకు మాస్టర్ అప్పులు చేశారు" అని ఝాన్సీ చెప్పుకొచ్చింది.

పేమెంట్స్ ఆపకండి:"తోటి కళాకారులను మోసం చేయకూడదని అప్పు తెచ్చి మరి డబ్బులు ఇచ్చారు. ఆర్గనైజర్స్ కు నేను చేసుకునే విన్నపం ఏంటంటే.. ఓ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మా ఒంట్లో బాగున్నా లేకపోయినా చాలా కష్టపడి పర్ఫామెన్స్ చేస్తాం. మీకు ప్రోగ్రామ్ నచ్చకపోతే తర్వాత నుంచి పిలవకండి. కానీ పేమెంట్స్ ఆపేయవద్దు. అలా చేయడం వల్లే ఆర్టిస్టులకు డబ్బులు ఇవ్వలేక, వాళ్లు చేసే ఫోన్ కాల్స్ ఎత్తి సమాధానం చెప్పలేక చైతన్య మాస్టర్ ఈ నిర్ణయం తీసుకుని ఉండుంటారు" అని ఝాన్సీ ఎమోషనల్ అయింది.


Click it and Unblock the Notifications











