Brahmamudi August 31st: కావ్యకు అపర్ణ సవాల్... వ్ర‌తం నువు చెయ్‌... ఫలితం ఇస్తానన్న రాజ్

బ్రహ్మముడి నేటి ఎపిసోడ్ లో.. కావ్యకి అత్త వేసిన శిక్ష గురించి అందరికీ ఇందిరా దేవి చెబుతుంది. ఇక స్త్రీ సంఘం వాళ్ళు రాజ్, కావ్యకి సన్మానం చేస్తారు. కళావతి సంతోషంగా మొగుడు చేతిని పట్టుకుని మరీ ఫోటో దిగి సంబరపడిపోతుంది. కావ్య చేసిన మంచి పని ఇంట్లో కొంతమందికి నచ్చలేదు కానీ అదే ఈ కుటుంబానికి పేరు తీసుకొచ్చిందని సుభాష్ అపర్ణకి తగిలేలా సెటైర్ వేస్తాడు.

అటు ఆసుపత్రిలో స్వప్న తన దొంగ కడుపు ఎక్కడ తెలిసిపోతుందోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెళ్లిపోదాం హాస్పిటల్ వాతావరణం పడటం లేదని నచ్చజెప్పి రుద్రాణి వాళ్ళని తీసుకెళ్లబోతుంటే డాక్టర్ పిలుస్తున్నారని చెప్తారు. ఇంత సేపు వెయిట్ చేశాం కదా చెక్ చేయించుకుని వెళ్లిపోదామని రుద్రాణి స్వప్నని డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్తుంది. ఆ డాక్టర్ ఎవరో కాదు గతంలో స్వప్న కళ్ళు తిరిగి పడిపోతే ఇంటికి వచ్చి చెక్ చేసిన ఆమె. దీంతో తనని చూడగానే స్వప్నకి ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది. అదే విషయాన్ని డాక్టర్ కి గుర్తు చేసి కడుపులో బిడ్డకి ఏం కాలేదని చెప్పిస్తుంది. అలా మరోసారి ఎస్కేప్ అవుతుంది.

Conflict Between Aparna and kavya about varalaxmi vratham in August 31st 2023 Episode number 189 in Brahmamudi Telugu Serial

సీన్ కట్ చేస్తే... మరోవైపు అనామిక కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది. కల్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. మళ్ళీ మళ్ళీ చేయడంతో లిఫ్ట్ చేసి డల్ గా మాట్లాడతాడు. కాసేపు ఊరించి ఊరించి పెళ్లి కాలేదని అనామిక చెప్పేసరికి కళ్యాణ్ సంతోష పడిపోతాడు. రెస్టారెంట్ దగ్గర కళ్యాణ్ ని డ్రాప్ చేసిందని తనేనని అనామిక చెప్పేసరికి షాక్ అవుతాడు.

Conflict Between Aparna and kavya about varalaxmi vratham in August 31st 2023 Episode number 189 in Brahmamudi Telugu Serial

తర్వాత తను పంపించిన గిఫ్ట్ ఎలా ఉందని అడుగుతుంది అనామిక. దాని కోసం ఇల్లంతా వెతుకుతాడు. ఇంట్లో వాళ్లను అడుగుతారు. చివరకు కావ్యను అడగ్గా.. చిన్న మావయ్య దగ్గర చూశాను అని చెబుతుంది. కల్యాణ్ వెళ్లి నాన్న నా గిఫ్ట్ చూశావా అని అడిగితే.. ఏం గిప్టు అని అయోమయంగా ఫేస్ పెడతాడు. చివరికి కావ్య అక్కడే ఉందని చూపిస్తుంది. అందులో ఏం ఉందని అడుగుతుంది.

Conflict Between Aparna and kavya about varalaxmi vratham in August 31st 2023 Episode number 189 in Brahmamudi Telugu Serial

కల్యాణ్ చేతుల్లో నుంచి కావ్య తీసుకుని ఓపెన్ చేసి చూస్తుంది. ఇక అది కల్యాణ్ కవితా సంపుటి అని తెలుసుకుంటుంది. అయితే ఒకప్పుడు అనామిక కోసం... కళ్యాణ్ కవితలు రాసి బాగా రాలేదని చింపేసిన పేపర్స్. వాటిని ఒక బుక్ గా తయారు చేయించి అనామిక గిఫ్ట్ గా ఇస్తుంది. అది చూసి ఇంట్లో అందరూ సంతోష పడతారు. మన ఇంట్లో కవి పుట్టాడు అని సీతారామయ్య మురిసిపోతాడు. ఇక గిఫ్ట్ బాక్స్ మీద పజిల్ రాసి దాని ప్రకారం కలవమని అనామిక హింట్ ఇస్తుంది. అది చదివి ఎక్కడికి వెళ్లాలో కావ్య చెప్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తోంది.

Conflict Between Aparna and kavya about varalaxmi vratham in August 31st 2023 Episode number 189 in Brahmamudi Telugu Serial

ఇక తదుపరి ప్రోమోలో... దుగ్గిరాల ఇంట్లో జరిగే వరలక్ష్మీ వ్రతం బాధ్యతలు ఈసారి అపర్ణ కోడలు కావ్యకి అప్పగిస్తున్నట్టు ఇంద్రాదేవి అందరికీ చెప్తుంది. ఆ మాటకి అపర్ణ కోపంతో రగిలిపోతుంది. దీంతో వారి మధ్య. మళ్లీ యుద్దం రానుందని తెలు్స్తోంది. ఇక ఈ ప్రోమోలో... కావ్య కిచెన్ లో ఉండగా అపర్ణ వెళ్తుంది. తనని ఎదిరించి తన కొడుకు వ్రతంలో కూర్చోడు అన్నట్టు ధీమాగా మాట్లాడుతుంది. అపర్ణ మాట్లాడుతూ... ఈ ఇల్లు నీకు ఆశ్రయం ఇచ్చింది. ఇంటి పెద్దలు నిన్నొక మనిషిలా గుర్తిస్తున్నారు. నువ్వు ఈ ఇంట్లో తిరుగుతుంటే చూసి సహించలేను.

Conflict Between Aparna and kavya about varalaxmi vratham in August 31st 2023 Episode number 189 in Brahmamudi Telugu Serial

అంటే కావ్య వ్రతానికి సంబంధించి ఏదో సవాలు విసిరినట్టుగా ఉంది. వాడు నా కొడుకు నువ్వు నాతో తిరగబడి మాట్లాడినందుకు ఇంటి ముందు నిలబెట్టి తలుపులు మూశాడు. ఇక నాతో సవాలు చేస్తే ఊరుకుంటాడా? అని అంటుంది. దీనికి మీ అబ్బాయ్ మీ మనసు మార్చొచ్చు ఏమో అని కావ్య సమాధానం చెబుతుంది. మరోవైపు అప్పుడే కావ్య గదిలోకి వెళ్తుంటే రాజ్ ఎదురుపడతాడు. వ్రతం నువ్వు చెయ్యి ఫలితం నేను ఇస్తానని మాట ఇస్తాడు. ఏం చేస్తారని కావ్య అడుగుతుంది. కానీ రాజ్ మాత్రం వెయిట్ అండ్ సీ అనేసి వెళ్ళిపోతాడు. ఇక చూడాలి ఏం జరగనుందోనని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X