twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6:ఆట మొదలైంది.. మొదటి రోజే ఇనయతో గీతూ గొడవ.. ఫస్ట్​ టాస్క్​తో బిగ్​బాస్​ చిచ్చు..

    |

    ఫైనల్​గా 21 మంది కంటెస్టెంట్స్​తో బిగ్​బాస్ సీజన్​ 6 హౌజ్ కలర్​ఫుల్​గా నిండింది. ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీలందరూ బిగ్​బాస్ హౌజ్​లోకి అడుగుపెట్టారు. ఈ 21 మంది సభ్యుల్లో ఒకరిద్దరూ మినహా మిగతా వారంతా సెలబ్రిటీలన్న విషయం తెలిసిందే. ఇక గ్రాండ్​గా ప్రారంభమైన ఈ సీజన్​లో రెట్టించిన ఉత్సాహంతో సభ్యులందరూ హౌజ్​లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వారిని అలా ప్రశాంతంగా ఉండనిస్తే తాను బిగ్​బాస్​ ఎందుకు అవుతానని అనుకున్నాడేమో.. మొదటి రోజే టాస్క్​ రూపంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు బిగ్​బాస్​.

    పక్కా లోకల్ సాంగ్​తో..

    పక్కా లోకల్ సాంగ్​తో..

    ఉదయాన్ని పక్కా లోకల్​ సాంగ్​కి 21 మంది కంటెస్టెంట్స్​ అందరూ డ్యాన్స్ పెర్ఫామెన్స్​ చేశారు. ఆ తర్వాత వెంటనే బాత్రూమ్​లోకి వెళ్లిన చిత్తూరు చిరుత గీతూ రాయల్​ అక్కడ జుట్టు ఎక్కువగా పడి ఉందని, బాత్​రూమ్​లో ఎవరు స్నానం చేశారని ప్రశ్నించింది. ఇందుకో మరో కంటెస్టెంట్​ ఇనయ సుల్తానా పేరు చెప్పగా.. ఆమె దగ్గరికి వెళ్లి ప్రశ్నిస్తుంది గీతూ రాయల్. అప్పుడు అందరం డ్యూటీస్ ప్లాన్ చేసుకుందాం అని ఇనయ సుల్తాన్​ చెబుతుంది.

    వేరొకరి జుట్టు తీయను..

    వేరొకరి జుట్టు తీయను..

    దీనికి నాకు బాత్​రూమ్​ క్లీనింగ్​ ఇచ్చినా.. బాత్​రూమ్​లో వేరొకరి జుట్టు తీయనని చెప్పింది గీతూ రాయల్. దీంతో ఇనయ సుల్తానాకు, గీతూ రాయల్​కు మధ్య క్లాష్​ ఏర్పడినట్లయింది. తర్వాత కంటెస్టెంట్స్​ అందరికీ బిగ్​బాస్ మొదటి టాస్క్​ ఇచ్చాడు. ఈ టాస్క్​ను జబర్ధస్త్ లేడి కమెడియన్​ ఫైమా చదివిచెబుతుంది. హౌస్​ను మూడు తరగతలుగా విడదీశారు. క్లాస్​ అండ్ ట్రాష్​ అని రెండు గ్రూప్స్​ పెట్టారు.

    ట్రాష్​ గ్రూప్ వారే..

    ట్రాష్​ గ్రూప్ వారే..


    ట్రాష్​ అనే గ్రూప్​లోకి వెళ్లిన వారు గార్డెన్​ ఏరియాలో వండుకొని తినాలని చెబుతుంది ఫైమా. అలాగే ట్రాష్​ గ్రూప్​లో ఎవరైతే ఉంటారో వారు నేరుగా ఈవారం నామినేషన్స్​లో ఉంటారని చెబుతుంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజగా విడుదల చేసింది స్టార్ మా. అయితే ఈ ట్రాష్ గ్రూప్​లో సింగర్ రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇందులోకి ఎలా వచ్చాను..

    ఇందులోకి ఎలా వచ్చాను..

    తను అన్ని పనులు చేసిన ట్రాష్​ గ్రూప్​లోకి ఎందుకు వచ్చానని ఆవేదన వ్యక్తం చేస్తాడు రేవంత్. మరి రేవంత్​తోపాటు ట్రాష్​ గ్రూప్​లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలియాలంటే ఇవాళ ప్రారంభమయ్యే పూర్తి ఎపిసోడ్​ను కచ్చితంగా చూడాల్సిందే. సో.. ఇలా మొదటిరోజునుంచే కంటెస్టెంట్​ల మధ్య వివాదాలు పెట్టేందుకు బిగ్​బాస్ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    21 మంది సభ్యులు..

    ఇక ఈ బిగ్​బాస్​ హౌజ్​లో కంటెస్టెంట్స్​గా కీర్తి భట్​ (కార్తీక దీపం సీరియల్​ నటి), సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, శ్రీ సత్య (మోడల్​), అర్జున్​ కల్యాణ్​ (సీరియల్ నటుడు), చలాకీ చంటి, అభినయ శ్రీ, గీతూ రాయల్, బాలాదిత్య, మరీనా (సీరియల్​ నటి, రోహన్​ భార్య), రోహన్​ (సీరియల్​ నటుడు, మరీనా భర్త), వాసంతి కృష్ణన్​ (సీరియల్ నటి), షాని సాల్మన్​ (కమెడియన్, నటుడు), ఆర్జే సూర్య, ఆది రెడ్డి, ఆరోహి రావు (టీవీ9 యాంకర్​), ఫైమా, రాజశేఖర్​ (మోడల్, నటుడు), ఇనయ సుల్తానా, సింగర్ రేవంత్ ఉన్నారు.

    English summary
    Popular Youtuber And Social Media Influencer Galatta Geetu Royal Conflict With Inaya Sultana In Bigg Boss Telugu Season 6 House.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X