Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Bigg Boss Telugu 6:ఆట మొదలైంది.. మొదటి రోజే ఇనయతో గీతూ గొడవ.. ఫస్ట్ టాస్క్‌తో బిగ్‌బాస్ చిచ్చు..
ఫైనల్‌గా 21 మంది కంటెస్టెంట్స్‌తో బిగ్‌బాస్ సీజన్ 6 హౌజ్ కలర్ఫుల్గా నిండింది. ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీలందరూ బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. ఈ 21 మంది సభ్యుల్లో ఒకరిద్దరూ మినహా మిగతా వారంతా సెలబ్రిటీలన్న విషయం తెలిసిందే. ఇక గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ సీజన్లో రెట్టించిన ఉత్సాహంతో సభ్యులందరూ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వారిని అలా ప్రశాంతంగా ఉండనిస్తే తాను బిగ్‌బాస్ ఎందుకు అవుతానని అనుకున్నాడేమో.. మొదటి రోజే టాస్క్ రూపంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్.
పక్కా లోకల్ సాంగ్‌తో..
ఉదయాన్ని పక్కా లోకల్ సాంగ్‌కి 21 మంది కంటెస్టెంట్స్ అందరూ డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేశారు. ఆ తర్వాత వెంటనే బాత్రూమ్లోకి వెళ్లిన చిత్తూరు చిరుత గీతూ రాయల్ అక్కడ జుట్టు ఎక్కువగా పడి ఉందని, బాత్రూమ్లో ఎవరు స్నానం చేశారని ప్రశ్నించింది. ఇందుకో మరో కంటెస్టెంట్ ఇనయ సుల్తానా పేరు చెప్పగా.. ఆమె దగ్గరికి వెళ్లి ప్రశ్నిస్తుంది గీతూ రాయల్. అప్పుడు అందరం డ్యూటీస్ ప్లాన్ చేసుకుందాం అని ఇనయ సుల్తాన్ చెబుతుంది.
వేరొకరి జుట్టు తీయను..
దీనికి నాకు బాత్రూమ్ క్లీనింగ్ ఇచ్చినా.. బాత్రూమ్లో వేరొకరి జుట్టు తీయనని చెప్పింది గీతూ రాయల్. దీంతో ఇనయ సుల్తానాకు, గీతూ రాయల్‌కు మధ్య క్లాష్ ఏర్పడినట్లయింది. తర్వాత కంటెస్టెంట్స్ అందరికీ బిగ్‌బాస్ మొదటి టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌ను జబర్ధస్త్ లేడి కమెడియన్ ఫైమా చదివిచెబుతుంది. హౌస్‌ను మూడు తరగతలుగా విడదీశారు. క్లాస్ అండ్ ట్రాష్ అని రెండు గ్రూప్స్ పెట్టారు.
ట్రాష్ గ్రూప్ వారే..
ట్రాష్
అనే
గ్రూప్‌లోకి
వెళ్లిన
వారు
గార్డెన్
ఏరియాలో
వండుకొని
తినాలని
చెబుతుంది
ఫైమా.
అలాగే
ట్రాష్
గ్రూప్‌లో
ఎవరైతే
ఉంటారో
వారు
నేరుగా
ఈవారం
నామినేషన్స్‌లో
ఉంటారని
చెబుతుంది.
దీనికి
సంబంధించిన
ప్రోమోను
తాజగా
విడుదల
చేసింది
స్టార్
మా.
అయితే
ఈ
ట్రాష్
గ్రూప్‌లో
సింగర్
రేవంత్
ఉన్నట్లు
తెలుస్తోంది.
ఇందులోకి ఎలా వచ్చాను..
తను అన్ని పనులు చేసిన ట్రాష్ గ్రూప్‌లోకి ఎందుకు వచ్చానని ఆవేదన వ్యక్తం చేస్తాడు రేవంత్. మరి రేవంత్‌తోపాటు ట్రాష్ గ్రూప్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలియాలంటే ఇవాళ ప్రారంభమయ్యే పూర్తి ఎపిసోడ్‌ను కచ్చితంగా చూడాల్సిందే. సో.. ఇలా మొదటిరోజునుంచే కంటెస్టెంట్ల మధ్య వివాదాలు పెట్టేందుకు బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
|
21 మంది సభ్యులు..
ఇక ఈ బిగ్‌బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్‌గా కీర్తి భట్ (కార్తీక దీపం సీరియల్ నటి), సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, శ్రీ సత్య (మోడల్), అర్జున్ కల్యాణ్ (సీరియల్ నటుడు), చలాకీ చంటి, అభినయ శ్రీ, గీతూ రాయల్, బాలాదిత్య, మరీనా (సీరియల్ నటి, రోహన్ భార్య), రోహన్ (సీరియల్ నటుడు, మరీనా భర్త), వాసంతి కృష్ణన్ (సీరియల్ నటి), షాని సాల్మన్ (కమెడియన్, నటుడు), ఆర్జే సూర్య, ఆది రెడ్డి, ఆరోహి రావు (టీవీ9 యాంకర్), ఫైమా, రాజశేఖర్ (మోడల్, నటుడు), ఇనయ సుల్తానా, సింగర్ రేవంత్ ఉన్నారు.