Bigg Boss Telugu 7 పల్లవి ప్రశాంత్ విషయంలో రతిక పంచాయితీ... కాళ్లు పట్టుకుంటానన్న శివాజీ

బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం ఇంట్రెస్టింగ్ గా మొదలు అయింది. ఇక నామినేషన్స్ ప్రక్రియకు ముందే రతిక.. అందరితో పంచాయితీ మొదలు పెట్టింది. ఇప్పుడిప్పుడే సీరియల్ బ్యాచ్ తో కలుస్తున్న రతిక.. ఇంట్లో గొడవలు పెడుతూ.. రెచ్చిపోయింది. ఇక మొన్నటి నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో శివాజీ చేసిన వ్యాఖ్యలను పట్టుకుని... ఈరోజు రతిక రచ్చ చేసింది. ఇక ఆఖరికి శివాజీ... రతిక కాళ్లు పట్టుకుంటా అంటూ చెప్పుకు వచ్చాడు. ఈ సీన్ హైలెట్ గా నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే...

బిగ్ బాస్ హాజ్ లో రతిక అడుగుపెట్టినప్పటి నుంచి ప్రేక్షకులకు మంచి ఎంటటైన్మెంట్ దొరుకుతుంది. మొదట్లో రతిక.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఆ తర్వాత వారి మధ్య కాస్త మనస్పర్ధలు వచ్చాయి. ఇక యావర్ ఎంటర్ అయ్యాడు. యావర్ రతిక లవ్ ట్రాక్ నడుస్తుందని అనుకునే లోపే... రతిక రూట్ మార్చేసింది. ప్రస్తుతం సీరియల్ బ్యాచ్ తో కలిసిన రతిక... యావర్, ప్రశాంత్ లను ఛీ కొడుతోంది.

Conflict Between Rathika Rose and Sivaji About Pallavi Prashanth Issue in Bigg Boss Telugu 7

ఇక రతిక, అమర్ దీప్ డిస్కర్షన్ కూడా పెట్టారు. యావర్‌ కి చనువు ఇచ్చి తప్పు చేశానంటూ అమర్‌తో రతిక చెప్పుకొచ్చింది. మరోవైపు శివాజీ అన్న కూడా అన్ని తెలిసీ... నాగార్జున గారి దగ్గర ప్రశాంత్ వెనక నేను తిరుగుతున్నా అన్నట్లుగా చెప్పాడంటూ అమర్ తో రతిక చెప్పుకువచ్చింది. శివాజీ అన్న మాట్లాడిన మాటలు సరిగ్గాలేవని ఆరోపించింది. ఆయన్ని అసలు మనిషి అనాలా... ఇంకేమైనా అనాలా అంటూ రెచ్చిపోయింది.

శివాజీ అన్న సేఫ్ గేమ్ ఆడుతూ... అందరినీ సేఫ్ గేమ్, గ్రూప్స్ అంటున్నాడు అంటూ రతిక ఫైర్ అయింది. ఆయన ఆడుతున్నాడు సేఫ్ గేమ్.. ప్రియాంక మీ గ్రూప్‌కి మాస్టర్ అని.. తను ఎలా కీ ఆడిస్తే అలా ఆడుతున్నారు మీరంతా అని డైరెక్ట్‌గా శివాజీ నాతోనే చెప్పుకొచ్చాడు.. అంటూ రతిక అమర్ దీప్ కు చాడీలు చెప్పింది. ఛీ ఈయన్నా నేను సపోర్ట్ చేస్తూ వచ్చింది... పైకి మంచి మార్కులు కొట్టేస్తున్నాడు ఆయన మనల్ని పిచ్చోడిని చేస్తున్నాడు.. అంటూ రతిక ఫైర్ అయింది.

Conflict Between Rathika Rose and Sivaji About Pallavi Prashanth Issue in Bigg Boss Telugu 7

ఇక శివాజీ దగ్గరకి వెళ్లిన రతిక... కావాలని గొడవ పెట్టుకున్నట్లు అనిపించింది.. నిన్న నాగార్జున సార్ ముందు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. రెండూ ఒకేసారి వచ్చాయంటూ ప్రశాంత్- నా టాపిక్ గురించి ఎందుకు అలా అన్నావ్ అని శివాజీని అడిగింది రతిక. నేను అలా అనకపోతే ఆయన వీడియోలు ప్లే చేస్తాడమ్మా అంటూ శివాజీ చెప్పుకువచ్చాడు. ఆ టాపిక్ కట్ చేద్దామనే అలా చెప్పాను.. అని సర్ది చెప్పబోయాడు.

అరె నీ దుంపతెగ బాబు గారు వచ్చాక మళ్లీ నేనే చెబుతా అంటూ శివాజీ చెప్తాడు. అన్నం మీద ఒట్టేసి చెబుతా.. నువ్వు అనవసరంగా గెలుక్కుంటున్నావ్.. అంటూ శివాజీ అంటాడు. అమ్మాయిగా నాకు అనిపిస్తుందన్నా.. నా క్యారెక్ట‌ర్‌ని ఇట్ల అనేసిండేంటి అనిపించింది. నువ్వు అలా అనుకుంటే సారీ అని శివాజీ చెప్తాడు. నిన్ను ఎలా ట్రీట్ చేస్తానో... మిగిలిన అమ్మాయిలను ఎలా చూస్తానో నీకు తెలీదా.. నువ్వు దీన్ని సాగదీస్తున్నావ్.. అంటూ శివాజీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు.

Conflict Between Rathika Rose and Sivaji About Pallavi Prashanth Issue in Bigg Boss Telugu 7

ఇక ప్రశాంత్ విషయంలో అయితే క్లారిటీగా చెప్తావ్.. అలానే అందరి విషయంలో కూడా చెబితే బావున్ను అనుకుంటున్నాను అన్నా అంటూ రతిక అంటుంది. నువ్వు నాకు క్లాసు పీకుతున్నావ్ అంతే కదా.. నేను ఎప్పుడైనా ఆడపిల్లల్ని ఏమైనా అన్నానా.. అంటూ శివాజీ కొశ్చన్ చేశాడు. అన్న అని అంటున్నా కాబట్టే వాయిస్ రెయిజ్ చేయలేదు.. అంటూ రతిక చెప్తుంది. సారీ చెప్పా కదా ఎందుకు సాగదీస్తున్నావ్.. కాల్లు పట్టుకోవాలన్నా.. వాంటెడ్‌గా కనిపిస్తుంది.. ఇంతలా ఎందుకు సాగదీస్తున్నావ్.. అంటూ శివాజీ ఫైర్ అయ్యాడు.ఇక సీన్ ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X