Bigg Boss Telugu 5 : చివరి టాస్క్ లో విన్నర్ తంటాలు.. ఫినాలే టికెట్ సాధించింది ఎవరు అంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్లు ఫైనల్ టాస్క్‌కి టిక్కెట్‌ను గెలుచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో జరుగుతున్న టికెట్ టు ఫినాలే టాస్క్ లో పెద్ద డ్రామా జరుగుతోంది. అయితే ఈ క్రమంలో చివరికి ఎవరు ఈ పోటీలో ఎవరు నిలబడ్డారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రోమో ప్రకారం

ప్రోమో ప్రకారం

ఇక తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం బిగ్ బాస్ ఇచ్చిన యాక్యురసీ ఛాలెంజ్ లో భాగంగా సన్నీ, షణ్ముఖ్ పోటీ పడ్డారు. ఈ ఇద్దరికీ కూడా రెండు వేర్వేరు ఎలక్ట్రిక్ బల్బులు పెట్టిన బోర్డులు ఉంచారు. వారి లెక్క ప్రకారం కొన్ని బల్బులు ఆన్ చేసి ఉంటే కొన్ని ఆఫ్ చేసి ఉంచారు. పోటీదారులు ఆ బల్బులను వెలిగించి చూసుకుని అన్నీ వెలిగేలా చేయాలి. అయితే ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు అనేది ఈరోజు ఎపిసోడ్ లో వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ లో రకరకాల సబ్ టాస్కులు పెడుతున్న సంగతి తెలిసిందే. పోటీదారులు చాలా సేపు మంచు మీద నిలబడి, ఆ తర్వాత కాళ్లకు గాయాలు అయిన కారణంగా వారిని మెడికల్ రూమ్‌కి పంపారు.

సిరి, శ్రీ రామ్ లలో ఎవరు?

సిరి, శ్రీ రామ్ లలో ఎవరు?

ఇక జరుగుతున్న ప్రచారం మేరకు మానస్, సిరి, శ్రీరామ చంద్ర మరియు సన్నీ ఫైనల్ టిక్కెట్‌ను గెలుచుకోగా, కాజల్, షణ్ముఖ్ జస్వంత్ మరియు ప్రియాంక సింగ్ ఫైనల్ టిక్కెట్ రౌండ్‌లో ఓడిపోయారు. అయితే తాజా సమాచారం ప్రకారం సన్నీ, మానస్, సిరి, శ్రీరామ్‌లులో పోటీ పడగా.. సిరి టికెట్ టు ఫినాలే సాధించి.. తొలి ఫైనలిస్ట్‌గా నిలిచినట్టు ప్రచారం జరిగుతోంది.

 ఊహాగానాలకు బ్రేక్

ఊహాగానాలకు బ్రేక్

అయితే అది నిజం కాదని, శ్రీరామ చంద్ర గెలిచాడని అంటున్నారు మరికొందరు. గురువారం అర్ధరాత్రి నుంచే సిరి టికెట్ టు ఫినాలే గెలిచి.. ఫైనల్‌లో అడుపెట్టిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు దర్శనం ఇస్తూ ఉండగా కొద్దిసేపటి క్రితం నుంచే శ్రీ రామ చంద్ర మొదటి టికెట్ సాధించాడు అని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ఎలిమినేట్ అవుతాడు అన్న ఊహాగానాలకు బ్రేక్ పడినట్టే.

ఫైనల్స్ లో

ఫైనల్స్ లో

ఇక ఫైనల్స్ లో షణ్ముఖ్ ఓడిపోతాడని నెటిజన్లు ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు. ఎందుకంటే షణ్ముఖ్ టాస్క్ విషయంలో పెద్దగా యాక్టీవ్ పార్ట్ తీసుకోలేదని, అందుకే ఆయన అతను ఓడిపోయినా ఆశ్చర్యం లేదని నెటిజన్లు అంటున్నారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా టాస్క్‌ల విషయంలో షన్ను ఎప్పుడూ యాక్టివ్‌గా లేడని అంటున్నారు.

Recommended Video

Shilpa Chowdary Case : Tollywood Hero Loses | Mahesh Babu Sister || Filmibeat Telugu
రెండో స్థానానికి

రెండో స్థానానికి

మొత్తం మీద ఇప్పుడు షణ్ముఖ్ స్థానం మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయిందని వినికిడి. నెటిజన్లు కూడా షణ్ముఖ్ బిగ్ బాస్ తెలుగు 5 రన్నరప్‌గా నిలుస్తారని అంటున్నారు. షణ్ముఖ్ హౌస్ కెప్టెన్‌గా ఉన్నందున, ఈ వారం, అతను నామినేట్ కాలేదు, కాబట్టి అతను ఖచ్చితంగా టాప్ 5 ఫైనల్ లిస్ట్‌లో ఉంటాడు. కానీ గ్రాండ్ ఫినాలేలో, పోటీదారుల మైండ్ గేమ్ ముఖ్యం, అలా కనుక ఆడితే ట్రోఫీని కోల్పోయినా నగదు బహుమతిని పొందవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X