ఆ కంటెస్టెంట్ల తీరుతో బిగ్ బాస్‌ షోపై పెరిగిన డౌట్లు: నాగార్జుననూ వదలడం లేదు.!

తెలుగులో బిగ్ బాస్ షోకు ఉన్న ప్రత్యేకత మరే దానికీ ఉండదనడంలో సందేహం లేదు. అంతలా ఈ రియాలిటీ షో మూడేళ్లుగా ప్రభావాన్ని చూపిస్తోంది. మరీ ముఖ్యంగా బుల్లితెరపై ఎన్నో తిరుగులేని, చెరిగిపోని రికార్డులను క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతోంది. అందుకే ఈ షో దేశంలో ప్రసారం అవుతోన్న అన్ని భాషల్లోకెల్లా నెంబర్ వన్‌గా కితాబందుకుంది. దీనికి ఎంతలా ప్రశంసలు దక్కుతున్నాయో.. అదే స్థాయిలో విమర్శలూ వస్తున్నాయి. ఇక, ఈ సీజన్‌లో కొందరు కంటెస్టెంట్లు వ్యవహరిస్తున్న తీరుతో షోపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. వివరాల్లోకి వెళ్తే...

ఊహించని ఫలితాలతో దూకుడు

ఊహించని ఫలితాలతో దూకుడు

రియాలిటీ ఆధారంగా ప్రసారం అవుతోంది బిగ్ బాస్ షో. కొందరు కంటెస్టెంట్లను ఓ ఇంట్లో ఉంచి, ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఒకరిని విజేతగా నిలపడమే ఈ షో ఉద్దేశ్యం. పరాయి భాష సంస్కృతితో ప్రసారం అవుతోన్న ఈ షో.. తెలుగులో మనుగడ సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఊహించని విధంగా ఈ షో సూపర్ సక్సెస్ అవడంతో పాటు ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.

వివాదాలమయంగా బిగ్ బాస్ షో

వివాదాలమయంగా బిగ్ బాస్ షో

బిగ్ బాస్ షోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ షో తెలుగులో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అదే సమయంలో విమర్శలు కూడా అందుకుందీ షో. అందులో జరిగే సంఘటనలు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, రొమాంటిక్ సన్నివేశాలు సహా ఎన్నో అంశాల కారణంగా బిగ్ బాస్ షో వివాదాస్పదం అయిపోయింది.

అన్ని భాషల్లోనూ అదే సందేహం

అన్ని భాషల్లోనూ అదే సందేహం


దేశంలోని చాలా భాషల్లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతోన్న సంగతి విధితమే. అన్ని చోట్లా ఇది నిజంగా రియాలిటీ షోనేనా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి.. అవుతున్నాయి. దీనికి కారణం బిగ్ బాస్ హౌస్‌లో జరిగే కొన్ని పరిణామాలే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రసారమైన కొన్ని సన్నివేశాలు నిజమైనవిగా అనిపించకపోవడమే దీనికి ప్రధానమైన కారణం.

ఎలిమినేషన్లతో మారిన లెక్కలు

ఎలిమినేషన్లతో మారిన లెక్కలు

తెలుగులో కూడా బిగ్ బాస్ షో రియాలిటీ ఆధారంగా ప్రసారం అవడం లేదన్న కామెంట్లు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇవి ఎక్కువైపోయాయి. దీనికి కారణం ప్రజాదరణ ఉన్న కొందరు కంటెస్టెంట్లు ఎలిమినేషన్ అవడమే. బిగ్ బాస్ నిర్వహకులు ప్రేక్షకుల ఓట్లను పక్కన పెట్టి.. ఎవరి వల్ల రేటింగ్ వస్తుందో వాళ్లనే షోలో ఉంచుతున్నారన్న ఆరోపణలు వినిపించాయి.

కంటెస్టెంట్ల తీరుతో పెరిగిన డౌట్లు

కంటెస్టెంట్ల తీరుతో పెరిగిన డౌట్లు


బిగ్ బాస్ యూనిట్ చేస్తున్న ఎలిమినేషన్లు మాత్రమే కాదు.. కంటెస్టెంట్లు చేస్తున్న కొన్ని పనుల కారణంగానూ షోపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. గత వీకెండ్ ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యాడన్న సమయంలో అఖిల్ వ్యవహరించిన తీరు.. నామినేషన్, ఎలిమినేషన్ సమయంలో కావాలనే హైడ్రామా ప్లే చేస్తున్నారని షోపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Recommended Video

Teja Launches Vikram Movie First Look
నాగార్జుననూ వదలడం లేదు.!

నాగార్జుననూ వదలడం లేదు.!


ఇదే విషయంలో హోస్ట్ అక్కినేని నాగార్జునపైనా కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆయన లేని ఎపిసోడ్లలో ఏమో కానీ, హోస్టింగ్ చేస్తున్న సమయంలోనూ కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయని, వాటిని నాగ్ పట్టించుకోవడం లేదని అంటున్నారు. అలాగే, టీఆర్పీ రేటింగ్ కోసం ఆయన కూడా దిగజారిపోయి మరీ యాక్టింగ్ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X