బిగ్ బాస్ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు.. అసలు విషయాన్ని చెప్పిన గంగవ్వ

బిగ్ బాస్ సిజన్ 4ల కంటెస్టెంట్స్ లలో ఆడియెన్స్ కి బాగా దగ్గరరైనా కంటెస్టెంట్ గంగవ్వ. షో మొదలైనప్పుటి నుంచి కూడా గంగవ్వ పెద్దగా నెగిటివ్ కామెంట్స్ అందుకోలేదు. కనీసం ఎలిమినేషన్స్ లో కూడా డేంజర్ జోన్ లోకి రాలేదు. నామినేషన్ ప్రక్రియలో ఆడియెన్స్ ఆమెను ఏ మాత్రం ఒప్పుకోలేదు. ఇక తన సొంత నిర్ణయం తరువాత 35రోజులకు బయటకు వచ్చింది. ఇక ఆమె రెమ్యునరేషన్ పై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చారు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు రాగానే..

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు రాగానే..

బిగ్ బాస్ సీజన్ 4 నుంచి తన సొంత నిర్ణయంతోనే తప్పుకున్న గంగవ్వ తన సొంత గ్రామం లాంబాడి పల్లెకు చేరుకున్న తరువాత ఆమెను కలవడానికి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. జోర్దార్ సుజాత, బిత్తిరి సత్తి వారి ప్రొఫెషనల్ స్టైల్ లో ఇంటర్వ్యూలు చేయగా మరికొందరు పర్సనల్ గా కలుసుకున్నారు. ఇక హౌజ్ లో గడిపిన క్షణాలను గురించి షేర్ చేసుకున్న గంగవ్వ తన పర్సనల్ లైఫ్ విషయాలను గురించి కూడా క్లారిటీగా వివరించింది.

గంగవ్వ రెమ్యునరేషన్..

గంగవ్వ రెమ్యునరేషన్..

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే బిగ్ బాస్ హౌజ్ లో 35రోజుల పాటు ఉన్న గంగవ్వకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు అనేది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 10 లక్షల వరకు ఆమెకు పారితోషికం ఇచ్చారని అలాగే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మరో 5లక్షల వరకు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అయ్యాయి.

ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు..

ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు..

అయితే అవన్నీ అబద్దాలని ఒక్క మాటతో గంగవ్వ క్లారిటీ ఇచ్చేసింది. గంగవ్వ మాట్లాడుతూ.. నిజానికి ఇప్పటి వరకు బిగ్ బాస్ లో ఉన్నందుకు గాను నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ వాళ్ళు కచ్చితంగా ఇస్తానని చెప్పారు. అలాగే ఇల్లు లేదా మరొక విధంగా సహాయం చేస్తారని అనుకుంటున్నాను. హైదరాబాద్ లో ఇల్లు కట్టిస్తాను అన్నా కూడా నేను ఒప్పుకోను.

కోటి రూపాయల ఇల్లు అయినా అక్కడ వద్దు..

కోటి రూపాయల ఇల్లు అయినా అక్కడ వద్దు..

నా ఊళ్ళోనే ఇల్లు కట్టిస్తాను అంటేనే ఒప్పుకుంటాను. కోటి రూపాయలు ఇల్లు కట్టిచ్చినా కూడా హైదరాబాద్ లో అయితే ఉండలేను అని వివరణ ఇచ్చిన గంగవ్వ బిగ్ బాస్ టీమ్ త్వరలోనే తనకు ఎదో ఒక విధంగా సహాయం చేస్తారనే నమ్మకం తనకు ఉందని తెలిపింది. ఇక గంగవ్వ క్లారిటీ ఇవ్వడంతో ఆమె రెమ్యునరేషన్ పై వస్తున్న వార్తలు అబద్దాలని తేలిపోయింది.

కుమార్ సాయికి కూడా మాట ఇచ్చిన నాగార్జున

కుమార్ సాయికి కూడా మాట ఇచ్చిన నాగార్జున

నాగార్జున గంగవ్వకు తప్పకుండా సహాయం చేస్తానని షో నుంచి బయటకు వెళ్లిపోయినప్పుడు మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల హౌజ్ నుంచి ఎలిమినెట్ అయిన కుమార్ సాయికి కూడా నాగ్ సహాయం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కుమార్ సాయి ఒక కథ చెబుతానని చెప్పడంతో నాగ్ తప్పకుండా వింటానని మాట ఇచ్చాడు. దీంతో ఇద్దరి కోరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్ ఎప్పుడు వారి డ్రీమ్స్ ని నెరవేరుస్తాడా అని ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X