For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘ఢీ’లో ఊహించని సంఘటన: వాళ్లిద్దరి పొరపాటుతో వివాదం.. సుధీర్, ఆది చర్చలు.. వెళ్లిపోయినట్లేనా!

  |

  తెలుగు బుల్లితెరపై చాలా తక్కువ షోలకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. అందులో బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందిన 'ఢీ' ఒకటి. దాదాపు పదమూడేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ షోకు.. రోజురోజుకూ ఆదరణ పెరుగుతూనే ఉంది. ఫలితంగా ఇది సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతోన్న సీజన్ మజాను పంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఢీ షోలో ఊహించని సంఘటన జరిగింది. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

  మన ఢీ షోకు పోటీనే లేకుండా

  మన ఢీ షోకు పోటీనే లేకుండా

  మిగిలిన కార్యక్రమాలతో పోలిస్తే బుల్లితెరపై వచ్చే వాటిలో డ్యాన్స్ షోలకు మంచి ఆదరణ లభిస్తుంటుంది. అందులో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది ‘ఢీ'. మొదటి సీజన్ నుండి కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సాగుతుంది ఈ అల్టిమేట్ డ్యాన్స్ షో. దీనికి పోటీగా వచ్చిన కార్యక్రమాలు మధ్యలోనే ఆగిపోయినా.. ఇది మాత్రం రన్ అవుతూనే ఉంది.

   సినీ ఇండస్ట్రీల్లో మాస్టర్లదే హవా

  సినీ ఇండస్ట్రీల్లో మాస్టర్లదే హవా

  ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ఢీ షో వల్ల ఎంతో మంది టాలెంట్ బయటకు వచ్చింది. సుదీర్ఘమైన ప్రయాణంలో ఈ కార్యక్రమం వల్ల ఎంతో మంది కొరియోగ్రాఫర్లుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మరీ ముఖ్యంగా ‘ఢీ' ద్వారా శేఖర్, గణేశ్, జానీ, రఘు, యశ్వంత్ మాస్టర్లు కొరియోగ్రాఫర్లుగా మారారు. వీళ్లంతా దక్షిణాదిలోని ఇండస్ట్రీల్లో హవాను చూపిస్తున్నారు.

   ఒకటి కాదు.. రెండు కాదు.. 13

  ఒకటి కాదు.. రెండు కాదు.. 13

  విజయవంతంగా పన్నెండు సీజన్లు పూర్తి చేసుకున్న ‘ఢీ' షో.. పదమూడో దానిని కూడా ప్రారంభించింది. ‘కింగ్ వర్సెస్ క్వీన్స్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో.. గతంలో మాదిరిగా కాకుండా మొత్తం కొత్త వాళ్లను తీసుకొచ్చారు. దీంతో ఈ సీజన్ పోటీ పోటీగా జరుగుతోంది. అందుకే గతంలో ఉన్న ఫ్యాన్స్ కంటే ఈ సీజన్‌కు మరింత మంది దీనికి ఆకర్షితులు అవుతున్నారు.

  కొత్త పిల్లతో రచ్చ చేస్తున్నారుగా

  కొత్త పిల్లతో రచ్చ చేస్తున్నారుగా

  ‘కింగ్ వర్సెస్ క్వీన్స్' సీజన్‌ను అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య పోటీగా మొదలెట్టారు. అబ్బాయిల టీమ్‌కు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది మెంటర్లుగా.. అమ్మాయిల జట్టుకు రష్మీ గౌతమ్, దీపిక పిల్లి మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో దీనికి జడ్జ్‌లుగా గణేష్ మాస్టర్, పూర్ణ, ప్రియమణిలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నాడు.

  ఢీ షోలో ఊహించని సంఘటన

  వచ్చే బుధవారం ప్రసారం కాబోతున్న ‘ఢీ' డ్యాన్స్ షో ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో కంటెస్టెంట్లు అదిరిపోయే డ్యాన్సులు, టీమ్ మెంటర్ల కామెడీ టైమింగ్స్, ప్రదీప్ మాచిరాజు పంచులు ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు డెడికేట్ చేస్తూ చేసిన పాట హైలైట్ అవుతోంది. అయితే, ఇందులో ఓ ఊహించని సంఘటన జరిగింది. ఇది వివాదానికి కారణం అయింది.

  Pawan Kalyan Song In World Of Dance International Dance Show || Filmibeat Telugu
   వాళ్లిద్దరి పొరపాటుతో వివాదం

  వాళ్లిద్దరి పొరపాటుతో వివాదం

  షోలో భాగంగా ఓ జంట డ్యూయెట్‌కు డ్యాన్స్ చేసింది. అయితే, ఇందులో పలుమార్లు వాళ్లిద్దరూ పొరపాటు చేయడంతో దాన్ని మధ్యలోనే ఆపేశారు. ఇది పెద్ద వివాదంగా మారినట్లు ప్రోమోలో చూపించారు. దీంతో మెంటర్లు సుధీర్, హైపర్ ఆది జడ్జ్‌లుతో చర్చలు జరిపడం కూడా కనిపించింది. ఇక, ఆ కంటెస్టెంట్ ఈ షో నుంచి వెళ్లిపోతారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారిపోయింది.

  English summary
  Dhee is an Indian dance reality show. This Was telecasting in ETV. In Latest Promo.. Contestant Did a Mistake in Live Performance. This is Gonna be Controversy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X