Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్‌లో కూరల పంచాయితీ... యావర్ చేసిన పనికి ఏడ్చేసిన వంటలక్క
Priyanka Jain cried: బిగ్ బాస్ తెలుగు సీజన్ ప్రారంభం అయి 40 రోజులు కావొస్తుంది. ఇక తాజా ఎపిసోడ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. అందులో ప్రియాంక చాలా ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది. దానికి కారణం హౌజ్ లో తిండి కోసం యుద్ధం జరగడమే. బీబీ వంటలక్కగా పేరు తెచ్చుకున్న ప్రియాంకను... యావర్ ఏడిపించేశాడు. ఇక తాజా ప్రోమో అయితే ఎమోషనల్ గా ఉంది. అసలు ఏం జరిగింది... ఎందుకు ఆమె ఏడ్చిందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈసారి కాస్త విభిన్నంగా ఆకట్టుకుంటోంది. ఉల్టా పుల్టా అంటూ రోజుకో ట్విస్టు, షాక్ ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక కొత్తగా వచ్చిన వారిని పోటుగాళ్లు అని.. పాత కంటెస్టెంట్స్ ను పోటుగాళ్లు అని డివైడ్ చేసి టాస్కులు కండక్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఇక కంటెస్టెంట్స్ ఎంట్రీతో హౌజ్ లో సందడి ఎక్కువైంది. ఇక హౌజ్లో జరిగిన గేమ్స్ లో ఆటగాళ్లు, పోటుగాళ్లు సమానంగా గెలిచారు.

ఇక తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఈ ప్రోమో చాలా ఎమోషనల్ గా చూపించాడు బిగ్ బాస్. ఇక హౌజ్ లో బిగ్ బాస్ వంటలక్కగా పేరు తెచ్చుకున్న ప్రియాంక.. ఈ ప్రోమోలో ఏడ్చేసింది. ఆమె ఏడుస్తూ.. ఒక్కసారిగా ప్రేక్షకులను కూడా ఎమోషనల్ చేసేసింది. మొదట్లో దామిని కిచెన్ బాధ్యతలు చూసేది. ఆమె వెళ్లిన తర్వాత ప్రియాంక ఆ బాధ్యతలు చేపట్టింది. ఇక ఇంట్లో వాళ్లకు వండి పెడుతూ.. ముందుంటుంది ఈ భామ.
పవర్ అస్త్ర కోసం కూడా ప్రియాంక వెనుకాడకుండా జుట్టును త్యాగం చేసింది. ఆ విషయం పక్కన పెడితే.. ఈ భామ తాజా ఎపిసోడ్ లో ఏడవటం అందరినీ కలిచివేసేలా ఉంది. అయితే బిగ్ బాస్ హౌజ్ లో కూరల పంచాయితీ మొదలు అయిందని తెలుస్తోంది. ఓవైపు రోటీస్, మరోవైపు రైస్ అయిపోయిందంటూ గొడవలు ప్రారంభం అయ్యాయి. హౌజ్ మేట్స్ కు ఫుడ్ సరిపోవడం లేదని యుద్ధం మొదలు అయింది.
ఇక యావర్ తిండి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కాస్త ఎక్కువగానే లాగేస్తాడు. ఇక ఇంట్లో వాళ్లకు రోటిస్ సరిపోవడం లేదని... యావర్ కు చెప్పే ప్రయత్నం చేసింది ప్రియాంక. ఇక అది వినిపించుకోకుండా యావర్... ప్రియాంకను ఏదో అన్నాడు. ఇక ఆ తర్వాత ప్రియాంక కిచెన్ లోకి వెళ్లి ఎమోషనల్ అయింది. ఇక్కడ కర్రీ చాలా తక్కువ ఉంది అంటే వినరేంటి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు... నాకు బాధగా ఉంది.... అంటూ కన్నీళ్లు పెట్టుకుంది వంటలక్క.

మనం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాం.. మా ఇంటికి రండి కావాల్సినంత నెయ్యి వేసి వండిపెడతాను అంటూ బాధపడింది. ప్రియాంకను గౌతమ్, సందీప్ అంతా కలిసి ప్రియాంకను ఓదార్చారు. ఇక యావర్ మరోవైపు ఎవరికి మిగల్చకుండా తింటున్నట్లు ప్రోమోలో చూపించారు. అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే.. ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications










