Bigg Boss Telugu 7: బిగ్ బాస్ ఫైనల్ టాప్ 5 వీళ్లే.. టైటిల్ విన్నర్ కన్ఫార్మ్.. మరి రన్నరప్ ఎవరంటే!
తెలుగు బుల్లితెరపై సక్సెస్‌ఫుల్ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ కార్యక్రమం.. ఏకంగా ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఏడో సీజన్ కూడా మొదలై.. గతంలో ఎన్నడూ లేని విధంగా విభిన్నమైన అంశాలతో వినోదాత్మకంగా సాగిపోతోంది. ఇలా ఈ సీజన్ ఇప్పటికే పది వారాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సీజన్‌లో టాప్ 5గా ఎవరు ఉండబోతున్నారు? విజేతగా ఎవరు నిలవబోతున్నారు? అనే దానిపై కంటెస్టెంట్ల ఫ్యామిలీలు ఇచ్చిన రిజల్ట్‌ను ఒకసారి చూద్దాం పదండి!
ఏడో సీజన్‌ను గతంలో కంటే వినోదాత్మకంగా నడిపించే దానిలో భాగంగా గత ఆదివారం ఎపిసోడ్‌ను దీపావళి స్పెషల్‌గా నిర్వహించారు. ఇందులో ఎంతో మంది సెలెబ్రిటీ గెస్టులు ఎంట్రీ ఇచ్చారు. అలాగే, కొందరు హీరోయిన్లు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో అదరగొట్టేశారు. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్ కుటుంబ సభ్యులు, స్నేహితులు స్టేజ్ మీదకు వచ్చి తెగ సందడి చేశారు.

దీపావళి ఎపిసోడ్‌లో భాగంగా ముందుగా అమర్‌దీప్ కోసం వాళ్ల అమ్మ, మానస్ ఎంట్రీ ఇచ్చారు. వీళ్లు వరుసగా అమర్‌దీప్, శివాజి, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్‌లను టాప్ 5 కంటెస్టెంట్లుగా పెట్టారు. తర్వాత వచ్చిన గౌతమ్ ఫ్యామిలీ అతడితో పాటు అంబటి అర్జున్, శివాజి, ప్రియాంక జైన్, అమర్‌దీప్ చౌదరిలు టాప్ 5లో ఉంటారని అంచనా వేశారు.
ప్రిన్స్ యావర్ ఫ్రెండ్స్ అతడిని టాప్‌లో పెట్టి శివాజి, ప్రశాంత్, అమర్, భోలేలను టాప్ 5లో ఉంచారు. అర్జున్ తరపున వచ్చిన వాళ్లు అతడిని ఫస్ట్ ప్లేస్‌లో పెట్టి శివాజి, గౌతమ్, ప్రశాంత్, ప్రియాంకలను టాప్ 5 కంటెస్టెంట్లుగా నిలిపారు. తర్వాత అశ్విని ఫ్యామిలీ వాళ్లు శివాజిని టాప్‌లో పెట్టి.. ప్రశాంత్, అశ్విని, యావర్, అర్జున్‌లను టాప్ 5 కంటెస్టెంట్లు అని చెప్పారు.
శివాజి ఫ్యామిలీ వాళ్లు అతడినే టాప్‌లో పెట్టి తర్వాత ప్రశాంత్, యావర్, అమర్‌దీప్, ప్రియాంకలను టాప్ 5గా నిర్ణయించారు. ప్రియాంక తరపున వచ్చిన వాళ్లు ఆమె తర్వాత శివాజి, గౌతమ్, యావర్, శోభా శెట్టిలను టాప్ 5లోనే ఉంచారు. ప్రశాంత్ ఫ్యామిలీ మెంబర్లు అతడితో పాటు శివాజి, యావర్, ప్రియాంక, అమర్‌దీప్‌లను టాప్ 5 కంటెస్టెంట్లుగా అభివర్ణించారు.

రతికా రోజ్ ఫ్యామిలీ మాత్రం ప్రశాంత్‌ను టాప్‌లో పెట్టి తర్వాత శివాజి, యావర్, రతికా రోజ్, అర్జున్‌లను టాప్ 5లో ఉంచారు. శోభా శెట్టి కుటుంబ సభ్యులు ఆమెను టాప్‌లో పెట్టి ప్రశాంత్, శివాజి, అమర్‌దీప్, ప్రియాంకలను టాప్ 5 కంటెస్టెంట్లు అని అభిప్రాయపడ్డారు. భోలే బ్రదర్ శివాజిని టాప్‌లో పెట్టి తర్వాత ప్రశాంత్, భోలే, యావర్, గౌతమ్‌లను టాప్ 5 కంటెస్టెంట్లు అని చెప్పారు.
ఇలా కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు తమకు నచ్చిన వాళ్లను టాప్ 5 కంటెస్టెంట్లు అని చెప్పారు. ఇందులో ప్రతి కంటెస్టెంట్ ఫ్యామిలీ శివాజిని టాప్ 5లో ఉంచింది. దీంతో అతడికి 11 ఓట్లు వచ్చాయి. తర్వాత ప్రశాంత్‌కు 9 ఓట్లు పడ్డాయి. అలాగే, ప్రిన్స్ యావర్‌కు 7 ఓట్లు, అమర్‌దీప్ చౌదరికి 6 ఓట్లు, ప్రియాంక జైన్‌కు 6 ఓట్లు గౌతమ్‌కు 5 ఓట్లు వచ్చాయి.
మొత్తంగా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్లు పెట్టిన టాప్ 5 లిస్టుల ప్రకారం.. శివాజి, ప్రశాంత్, యావర్, ప్రియాంక, అమర్‌దీప్, గౌతమ్‌లు ఫైనలిస్టులు అయ్యే అవకాశం ఉంది. వీళ్లకు అర్జున్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక, ఇదే లెక్కలో చూసుకుంటే శివాజి విన్నర్‌గా.. ప్రశాంత్ రన్నర్‌గా నిలవొచ్చు అని చెప్పొచ్చు. అయితే, ప్రేక్షకుల ఓట్లను బట్టి ఈ లిస్ట్‌లో తేడా ఉండొచ్చు.


Click it and Unblock the Notifications











