Bigg Boss Telugu 8: బిగ్ బాస్ షోలో అమ్మాయిల రచ్చ.. బొ** అంటూ రెచ్చిపోయిన లేడీ

అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులో ప్రవేశించిన ప్రేక్షకుల హృదయాలను దోచుకుని సత్తా చాటిన షోనే బిగ్ బాస్. ఆరంభంలోనే రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్‌తో రచ్చ లేపిన ఇది.. ఆ తర్వాత వరుస సీజన్లతో దుమ్ములేపింది. ఇలా ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఇది పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్వహకులు ఎనిమిదో సీజన్‌ను తీసుకు వచ్చారు. ఇందులో ఆరంభం నుంచే ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు షోలో అమ్మాయిలు రెచ్చిపోయారు. అసలేమైందో మీరే చూసేయండి మరి!

మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోకు మాత్రమే భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీనికితోడు అన్‌లిమిటెడ్ కాన్సెప్టు కావడంతో ఎనిమిదో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండానే ఈ సీజన్ సరికొత్త కంటెంట్‌తో నడుస్తోంది. ఇందులో గత సీజన్లలో జరిగిన వాటికి ఏమాత్రం సంబంధం లేని సీన్స్ కనిపిస్తున్నాయి.

Contestants Fighting in Bigg Boss Telugu 8 Show 2nd Nominations Task

ఇటీవలే మొదలైన ఎనిమిదో సీజన్‌లోకి ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, మొదటి వారానికి జరిగిన ఎలిమినేషన్‌లో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిపోయింది.

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను కొత్తగా నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే హౌస్‌లో మూడు క్లేన్లు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో తమ క్లేన్ కాకుండా పక్క క్లేన్ వాళ్లనే నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్‌లో భాగంగా నామినేట్ చేసే ఇద్దరిపై వాళ్లు రంగు నీళ్లు పోసి తగిన కారణాలు చెప్పాలి ఉంది.

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోని రెండో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఎన్నో గొడవలతో సాగినట్లు తాజాగా వచ్చిన ప్రోమోలో చూపించారు. ముఖ్యంగా ఇందులో కిర్రాక్ సీత పలువురు కంటెస్టెంట్లతో గొడవకు దిగింది. ముఖ్యంగా ప్రేరణ, సోనియాపై ఆమె వాదన పెట్టుకుంది. ఆ సమయంలో కొందరు శృతి మించి మాట్లాడుతూ కనిపించారు.

గొడవ జరుగుతోన్న సమయంలో సోనియా 'గేమ్‌కు, పర్సనల్‌కు డివిజన్ లేదంటే అది పర్సనాలిటీ ప్రాబ్లం. సో నువ్వు అది డెవలప్ చేసుకోవాలి. ఆ మెచ్యూరిటీ నీకు రావాలి' అని చెప్పింది. దీనికి సీత 'నా క్లారిటీ నాకు ఉందో లేదో నాకే తెలుసు. నువ్వు గేమ్‌ను అర్థం చేసుకుని మళ్లీ వచ్చి నాకు చెప్పు. నీకే క్లారిటీ లేదు. బొ** క్లారిటీ పెద్ద నీకే ఉన్నట్లు' అంటూ బూతులు మాట్లాడింది. దీంతో ఇద్దరి మధ్యన మళ్లీ గొడవ జరిగింది. వీళ్లిద్దరికే కాదు.. చాలా మంది కూడా ఈ నామినేషన్స్‌లో గొడవ పడ్డారు. ఫలితంగా ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X