Bigg Boss Telugu 7: బిగ్ బాస్ విన్నర్ డిసైడ్.. స్ట్రాంగ్ ప్లేయర్లు లాస్ట్‌లో.. టాప్ 5లో ఎవరంటే!

అంచనాలు లేకుండానే తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. ఊహించని రీతిలో ప్రేక్షకుల మద్దతును సంపాదించుకుని నెంబర్ వన్ షోగా మారింది బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో నడిచేదే అయినా.. ఇది దేశంలోనే టాప్ షోగా ఎదిగింది. ఈ జోష్‌లోనే తెలుగులో ఏకంగా ఆరు సీజన్లను కూడా పూర్తి చేసుకున్నారు. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఏడోది కూడా ఆరంభం నుంచే మంచి స్పందనతో దూసుకుపోతోంది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు ర్యాంకులు ఇచ్చారు. అసలేం జరిగింది? ఎవరికి ఏ ర్యాంక్ లభించింది? అనేవి చూద్దాం పదండి!

ఈసారి వాటన్నింటికి మించేలా:బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు వచ్చినా దానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వస్తోంది. దీంతో టీఆర్పీలో మన షో దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంటోంది. ఇప్పుడు ఏడో సీజన్‌లో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఉల్టా పుల్టా కాన్సెప్టును చూపిస్తూ షోను రంజుగా మారుస్తున్నారు. మొత్తంగా గతంలో వాటికి మించేలా ఇది సాగుతోంది.

Contestants Gives Number One Rank to Sivaji in Bigg Boss Telugu 7

10 మంది ఔట్.. ఇప్పుడు వాళ్లే:ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, 2వ వారం షకీలా, 3వ వారం దామిని, 4వ వారం రతికా, 5వ వారం శుభశ్రీ, 6వ వారం నయనీ, 7వ వారం పూజా, 8వ వారం సందీప్‌, 9వ వారం టేస్టీ తేజ, 10వ వారం భోలేలు వెళ్లారు. దీంతో ఇప్పుడు పది మంది ఉన్నారు.

ఫైనల్ 5 వీక్స్.. కొత్త టాస్కులు:బిగ్ బాస్ ఏడో సీజన్ ఇప్పటికే పది వారాలను పూర్తి చేసుకుని లాస్ట్ స్టేజ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. మరో ఐదు వారాల్లో ఫినాలే కూడా జరగబోతుంది. దీంతో నిర్వహకులు చిత్ర విచిత్రమైన టాస్కులతో ముందుకు వస్తున్నారు. గతంలో కంటే భిన్నంగా ఆలోచిస్తూ కొత్త కంటెంట్‌ను తీసుకువస్తున్నారు. దీంతో ఇది అంతకంతకూ ఆసక్తికరంగా మారుతూ మజా ఇస్తోంది.

Contestants Gives Number One Rank to Sivaji in Bigg Boss Telugu 7

కంటెస్టెంట్లకు ర్యాంకులంటూ:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఇప్పుడు పది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. దీంతో వీళ్లలో బెస్ట్ ఎవరు అని డిసైడ్ చేసుకునేందుకు తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో హౌస్‌మేట్లకు ర్యాంకుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో ప్రతి కంటెస్టెంట్ తాము ఏ స్థానానికి అర్హులమో చెప్పి మిగిలిన వాళ్లను ఒప్పించాలని బిగ్ బాస్ చెప్పాడు. అందుకు అనుగుణంగా ఇంటి సభ్యులు తమ గొంతును వినిపించారు.

శివాజికే టాప్.. న్యాయం అని:తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు ఇంటి సభ్యులు మెజారిటీ ప్రకారం ర్యాంకులు ఇచ్చారు. అంటే హౌస్‌లోని ఎక్కువ మంది ఒక కంటెస్టెంట్ ఏ స్థానానికి అర్హుడు అని భావిస్తారో.. అదే ర్యాంకును వాళ్లకు ఇచ్చారు. ఇలా శివాజిని టాప్‌లో ఉంచారు. అప్పుడు అమర్‌ 'ఒకప్పుడు నీకు అన్యాయంగా పవర్ అస్త్రను తీసేశాం. ఇప్పుడు మేమే టాప్ ఇచ్చాం' అని అన్నాడు.

Contestants Gives Number One Rank to Sivaji in Bigg Boss Telugu 7

టాప్‌ 5లో ఉన్నది ఎవరంటే:గత ఎపిసోడ్‌లో జరిగిన ర్యాంకుల టాస్కులో శివాజిని అందరూ కలిసి టాప్‌లో పెట్టారు. ఆ తర్వాత ప్రిన్స్ యావర్ రెండో ర్యాంకులో, పల్లవి ప్రశాంత్ మూడో ర్యాంకులో, ప్రియాంక జైన్ నాలుగో ర్యాంకులో, శోభా శెట్టి ఐదో ర్యాంకులో నిలిచారు. ఈ టాస్కు జరుగుతున్న సమయంలో రతికా - ప్రశాంత్, శోభా శెట్టి - అర్జున్, ప్రిన్స్ - అశ్విని మధ్య చిన్నపాటి గొడవలు కూడా జరిగాయి.

చివరి ఐదు స్థానాల్లో ఎవరు?:శివాజి, ప్రిన్స్, ప్రశాంత్, ప్రియాంక, శోభా శెట్టిలు మొదటి ఐదు ర్యాంకులను సాధించగా.. మిగిలిన స్ట్రాంగ్ ప్లేయర్లు చివరి ఐదు స్థానాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. అందులో అమర్‌దీప్ చౌదరికి ఆరో స్థానం, గౌతమ్ కృష్ణకు ఏడో ర్యాంక్, అంబటి అర్జున్‌కు ఎనిమిదో స్థానం, అశ్విని శ్రీకి తొమ్మిదో ర్యాంక్, రతికా రోజ్‌కు పదో స్థానం దక్కాయి. ఇలా ఈ ర్యాంకుల టాస్కును ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X