కంటెస్టెంట్లకు భారీ సర్‌‌ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్: ఆనందించే లోపే అందరినీ నిరాశ పరిచాడు

గత వాటిలాగే ఈ సీజన్‌ను కూడా విజయవంతంగా ముగించడానికి ప్రయత్నాలు చేస్తోంది బిగ్ బాస్ యూనిట్. ఇందులో భాగంగానే సరికొత్త టాస్కులు, సర్‌ప్రైజ్‌లు, గొడవలు, లవ్ ట్రాకులు, మసాలా సీన్లు ఇలా ఎన్నో రకాల సన్నివేశాలను చూపించి షోకు మంచి రెస్పాన్స్ వచ్చేలా చేశారు నిర్వహకులు. ఇప్పుడు ఫైనల్ స్టేజ్‌కు చేరుకోవడంతో మరిన్ని స్పెషల్ ప్లాన్లు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే స్పెషల్ గెస్టులను తీసుకురావడంతో పాటు జర్నీ వీడియోలు చేపించిన బిగ్ బాస్.. కంటెస్టెంట్లకు భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ఆ వివరాలు మీకోసం!

ఐదుగురు కంటెస్టెంట్లు.. విన్నర్ అతడే

ఐదుగురు కంటెస్టెంట్లు.. విన్నర్ అతడే

బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరుపుకోనుంది. నాలుగో సీజన్‌లో వైల్డ్ కార్డ్‌తో పాటు సాధారణంగా ఎంట్రీ ఇచ్చిన 19 మంది సభ్యుల్లో ఆరియానా గ్లోరీ, దేత్తడి హారిక, అఖిల్ సార్థక్, అభిజీత్, సయ్యద్ సోహెల్ రియాన్‌లు మాత్రమే టాప్ -5లోకి చేరారు. వీరిలో విజయావకాశాలు మిస్టర్ కూల్ అండ్ కామ్ కంటెస్టెంట్‌కే ఉన్నాయని చెప్పొచ్చు.

గ్రాండ్‌గా ఫినాలే.. మెగా గెస్టు స్పెషల్‌గా

గ్రాండ్‌గా ఫినాలే.. మెగా గెస్టు స్పెషల్‌గా

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అంటే ఎంతో స్పెషల్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు జరిగిన మూడు ఫినాలేల్లో మొదటి దానికి హోస్ట్ ఎన్టీఆర్ తప్ప ఎవరూ గెస్టుగా రాలేదు. కానీ, రెండో సీజన్‌లో విక్టరీ వెంకటేష్, మూడో సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు నాలుగో సీజన్‌కు కూడా చిరునే రాబోతున్నారని ఓ వార్త బయటకు వచ్చింది.

ఫినాలే వీక్‌లో ప్రత్యేకమైన ప్లాన్లతో రెడీ

ఫినాలే వీక్‌లో ప్రత్యేకమైన ప్లాన్లతో రెడీ

నాలుగో సీజన్‌కు గ్రాండ్ ఓపెనింగ్ వచ్చింది. ఆ తర్వాతా రేటింగ్ మంచిగానే దక్కింది. దీన్ని అదే రేంజ్‌లో ముగించాలని బిగ్ బాస్ యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఫైనల్ వీక్‌లో ప్రత్యేకమైన ప్లాన్లతో రెడీ అయింది. ఇప్పటికే మాజీ కంటెస్టెంట్లను తీసుకొచ్చిన షో నిర్వహకులు.. టాప్ -5 సభ్యులకు వాళ్ల వాళ్ల జర్నీ వీడియోలను చూపించి జోష్‌ను నింపాడు.

ఈ సారి ఆ ఎపిసోడ్‌పై అనుమానాలు

ఈ సారి ఆ ఎపిసోడ్‌పై అనుమానాలు

గత సీజన్లతో పోలిస్తే ఈ సారి కరోనా వైరస్ కారణంగా స్పెషల్ గెస్టులు ఎవరూ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించలేదు. కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు వచ్చినా.. వాళ్లు ఓ అద్దాల గదికే పరిమితం అయ్యారు. దీంతో వాళ్లు వచ్చిన సంతోషం కూడా లేకుండా పోయింది. ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల రీఎంట్రీ ఉంటుందా? ఉండదా? అన్న దానిపై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి.

కంటెస్టెంట్లకు సర్‌‌ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్

కంటెస్టెంట్లకు సర్‌‌ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్

టాప్ -5కి చేరిన కంటెస్టెంట్లకు వరుసగా గిఫ్టులు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే మరో బిగ్ సర్‌ప్రైజ్‌ను కూడా ఇవ్వబోతున్నాడు. ఫినాలేకు ముందు వాళ్లందరినీ మరింత ఉత్సాహ పరిచేందుకు మాజీ కంటెస్టెంట్లను హౌస్‌లోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తవగా.. దీన్ని శుక్రవారం ఎపిసోడ్‌లో ప్రసారం చేయనున్నారు.

ఆనందించే లోపే అందరినీ నిరాశ పరిచి

ఆనందించే లోపే అందరినీ నిరాశ పరిచి

గురువారం ఎపిసోడ్ చివర్లో శుక్రవారం ప్రసారం కాబోయే ప్రోమోను చూపించారు. అందులో మోనాల్ గజ్జర్, కరాటే కల్యాణీ, లాస్య మంజునాథ్ సహా పలువురు కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, వీళ్లు కూడా కుటుంబ సభ్యుల్లా అద్దాల గదికే పరిమితం అయ్యారు. దీంతో కంటెస్టెంట్లు నిరాశకు లోనయ్యారు. కరోనా వైరస్ ప్రభావం వల్లే బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X