Bigg Boss Telugu 7: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటే.. కన్ఫార్మ్ చేసిన హౌస్‌మేట్స్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఆట అయిపోయేందుకు దగ్గరకు వస్తున్నా కొద్దీ.. షోను మరింత అద్భుతంగా మలుస్తున్నారు బిగ్ బాస్ టీం నిర్వాహకులు. పదో వారంలో భాగంగా ఫ్యామిలీ వీక్ నిర్వహించిన బిగ్ బాస్.. హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను ఇంట్లోకి పంపించారు. అలాగే సండే రోజు మరో కుటుంబ సభ్యుడితో పాటు స్నేహితులను కూడా బిగ్ బాస్ స్టేజీపైకి తీసుకొచ్చి షోను రసవత్తరంగా మలిచారు. ఇదంతా ఒకెత్తు అయితే 11వ వారంలోనూ అలాగే అద్భుతంగా సాగుతుంది. నామినేషన్స్ తో హీటెక్కిపోయిన హౌస్.. ర్యాంకింగ్స్ తో మరింత వేడెక్కిపోయింది. ఈక్రమంలోనే టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరోల రివీల్ కాగా.. ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా హౌస్ మేట్స్ చెప్పేశారు.
బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లు అంతా విన్నర్ గా శివాజిని నిలబెట్టారు. ఇక అలాగే మొదటి నుంచి ఆట అద్భుతంగా ఆడుతున్న ప్రిన్స్ యావర్ ను రెండో స్థానంలో నిలిపారు. అలాగే అందరి ముద్దుబిడ్డ.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను మూడో స్థానంలో ఉంచారు. ఇక ఆ తర్వాత ప్రియాంక జైన్ ను నాలుగో స్థానంలో, శోభా శెట్టిని ఐదో స్థానంలో ఉంచారు. ఇక ఆరో స్థానంలో అమర్ దీప్, ఏడో స్థానంలో గౌతమ్ కృష్ణ, ఎనిమిదో స్థానంలో అంబటి అర్జున్, తొమ్మిదో స్థానంలో అశ్విని శ్రీ, ఇక చివరి పదో స్థానంలో రతికా రోజ్ ను ఉంచారు.

హౌస్ మేట్స్ అంతా కలిసి మెజార్టీ పరంగా ఈ ర్యాంకింగ్ లను ఇచ్చారు. అయితే ఇప్పటికే ఓసారి అంటే నాలుగో వారంలో ఎలిమినేట్ అయిపోయిన రతికా రోజ్.. మరోసారి రీఎంట్రీ ఇచ్చింది. ఇంట్లోకి మళ్లీ వచ్చినప్పటికి కూడా రతికా రోజ్ ఏమమాత్రం ఆట ఆడట్లేదు. ఈ కారణంగానే కంటెస్టెంట్లు అందరూ ఆమెను చివరి స్థానంలో నిలిపారు. ఇంతకాలం మొదటి వారాల్లో తాను తెచ్చుకున్న నెగిటివిటీని పోగొట్టుకునేందుకు విపరీతంగా ప్రయత్నించిన రతికా రోజ్.. ఈ వారం మాత్రం ఫుల్లుగా రెచ్చిపోయింది. ఎలాగూ ఎలిమినేట్ అవుతానన్న కాన్ఫిడెన్సో, అగ్రెషన్ చూపిస్తే హౌస్ లోనే ఉంటాననే నమ్మకమో తెలియదు కానీ.. రతికా రోజ్ 11వ వారంలో రెచ్చిపోయిందనే చెప్పాలి.
ఆమె రెచ్చిపోయిన తీరు చూస్తుంటే మరోసారి ఆమె నెగిటివిటీ సంపాధించుకోకతప్పదని అర్థం అవుతుంది. ముఖ్యంగా ఆమె మరోసారి రైతబిడ్డ పల్లవి ప్రశాంత్ పై విపరీతమైన కామెంట్లు చేసింది. మొదటి ఐదు వారాల్లలో నా వెంట తిరగడం తప్ప నువ్వు చేసిందేమీ లేదని, అలాగే ఓసారి ఇచ్చిన మొక్కను వాడిపోయేలా చేశావు కాబట్టి నువ్వేమీ ఆడలేవని అక్కడే తెలిసిపోయిందంటూ అరిచింది. దీనికి పల్లవి ప్రశాంత్ మరోసారి కన్నీళ్లు పెట్టడం, అంతా నన్ను కార్నర్ చేస్తే శివాజి అన్న ఒక్కడే నావెంట నిలిచాడని చెప్పడం చూస్తుంటే ప్రేక్షకులు చాలా ఎమోషనల్ అయిపోయారు.

అసలే హౌస్ మేట్స్ అంతా చివర్లో నిల్చోబెట్టిన రతికా రోజ్.. మరోసారి కంటెస్టెంట్లపై విరుచుకు బడిన తీరు చూస్తుంటే ఈవారం ఆమెనే ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది. అలాగే హౌస్ మేట్స్ దృష్టిలో కూడా ఇదే ఉందని ర్యాంకింగ్ ఇచ్చిన తీరు చూస్తుంటనే అర్థం అవుతుంది. చూడాలి మరి ఏం జరగనుందో, రతికానే ఎలిమినేట్ అవుతుందా లేకా చివర్లో ఏదైనా జరిగి ఆమె ఇంట్లో కొనసాగుతుందా అని.


Click it and Unblock the Notifications











