నటిపై బిగ్‌బాస్ కంటెస్టెంట్ కన్ను... అలా తరిమికొట్టిన సీరియల్ బ్యూటీ
టీవీ షోలు, ఇతర కార్యక్రమాలలో అందమైన హీరోయిన్లు, నటీమణులు కనుక వస్తే కెమెరాలన్నీ వాళ్ల వైపే ఉంటాయి. ఇక రియాలిటీ షోలైతే కనుక ఫన్ జనరేట్ చేయడానికి, జనాన్ని ఎంటర్‌టైన్ చేయడానికి కొన్ని జంటల మధ్య లవ్ ట్రాక్స్, రొమాంటిక్ మూవ్‌మెంట్స్ క్రియేట్ చేస్తారు. ఇంకొన్ని కార్యక్రమాలలో అమ్మాయిల వెనుక కొందరు స్టార్స్ పడుతుంటారు. తాజాగా తెలుగు బుల్లితెరపై ఓ షోలో తనకు లైన్ వేస్తోన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ని ఓ నటి పరుగులు పెట్టించింది.
స్టార్ మాలో ప్రసారమవుతున్న కుకు విత్ జాతిరత్నాలు సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. యాంకర్‌గా ప్రదీప్.. జడ్జిలుగా అరుణ ముచ్చర్ల, కమెడియన్ అలీ, నటి శ్రీదేవి విజయ్ కుమార్, స్టార్ చెఫ్ సంజయ్ తుమ్మాలు వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో రకరకాల థీమ్స్, వెరైటీ వంటకాలతో జడ్జిలు ఇస్తున్న టాస్క్‌లు.. టెస్ట్‌లో పాస్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ పడుతున్న పాట్లు, వారి అల్లరి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. తాజాగా ఈ వారానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ అల్లరిని చూస్తే..

మీరు కుకింగ్ చేస్తున్నప్పుడు బజర్ సౌండ్ వినిపిస్తుంది. కుక్స్ అందరూ ఏ పొజిషన్‌లో ఉన్న స్టాచ్యూ అని యాంకర్ ప్రదీప్ చెబుతాడు. ఆ వెంటనే బజర్ సౌండ్ వినిపించడంతో ఎక్కడివారు అక్కడే బొమ్మల్లా నిలబడిపోతారు. డిమోన్ పవన్‌ను ముఖంలో ముఖం పెట్టి చూస్తూ రీతూ చౌదరి ఫన్ క్రియేట్ చేసింది. ఫ్రిజ్ ముందున్న పల్లవి ఒక్కతే చల్లగా ఎంజాయ్ చేస్తోందని ప్రదీప్ అనడంతో అంతా నవ్వేస్తారు. రాకింగ్ రాకేష్ దగ్గరికొచ్చిన యాంకర్ హరి.. మా కుక్ అయితే కనీసం ఊపిరి కూడా పీల్చుకోవడం లేదని చెబుతాడు.
ఆ వెంటనే పల్లవి గౌడ దగ్గరికి వెళ్లిని బిగ్‌బాస్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్ ఆమెను తన జడతో టచ్ చేస్తుంటాడు. నాకు ఎలా పడితే అలా చెబితే నేను వినను, ఫస్ట్ నన్ను ఏదో ఒకటి పొగిడి తర్వాత చెప్పమని పవన్‌తో అంటుంది రీతూ. దాంతో నువ్వు చాలా అందంగా ఉన్నావని అంటాడు. అది నాకు తెలిసిందే, కొత్తగా ఏదైనా చెప్పమని అంటుంది రీతూ. ఇంతలో ఇమ్మాన్యుయేల్‌ని పాలు కావాలని పల్లవి గౌడ అడుగుతుంది. దాంతో పాలు కావాలా? పళ్లు కావాలా? అంటూ పాట పాడుతూ హరి, ఇమ్మాన్యుయేల్‌లు పల్లవి దగ్గరికి రావడంతో ఆమె పెద్ద కత్తి చూపించడంతో ఇద్దరూ పారిపోతారు.
కంటెస్టెంట్స్ తయారు చేసిన వెరైటీలను టేస్ట్ చేసిన జడ్జిలు చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇస్తారు. తన ఫుడ్ బాగుందని అరుణ ముచ్చర్ల చెప్పడంతో రీతూ చౌదరి ఆనందంతో గంతులు వేయడంతో అంతా ఉలిక్కిపడతారు. ఇంకొక పీస్ ఉంటే నాకు ఇస్తారా? అని అడుగుదామనుకున్నా.. అంత టేస్టీగా ఉందని పవన్‌ను మెచ్చుకుంటుంది శ్రీదేవి విజయ్ కుమార్. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... మరి కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2కి సంబంధించి ఈ వీక్ ఎవరు విన్నర్ కానున్నారు? ఎవరు ఎలిమినేట్ కానున్నారు? తెలియాలంటే ఈ శని, ఆదివారాలలో ప్రసారమయ్యే కుకు విత్ జాతిరత్నాలు కార్యక్రమం చూసేయాల్సిందే.


Click it and Unblock the Notifications


