జబర్ధస్త్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్: ఆగిపోయిన కామెడీ షో.. లాక్ డౌన్ పూర్తయినా.!

By Manoj

దాదాపు ఏడేళ్లుగా తెలుగులో నెంబర్ వన్ కామెడి షోగా వెలుగొందుతోంది ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్. ఏమాత్రం అంచనాలు లేకుండా.. ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభం అయిన ఈ షో.. తక్కువ కాలంలోనే ఊహించని స్థాయిలో ప్రజాధరణను దక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సమానమైన రేటింగ్‌ను సాధిస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో అనివార్య కారణాల వల్ల జబర్ధస్త్‌ షోను నిలిపి వేశారు నిర్వహకులు. తాజాగా ఈ షో ఎప్పటి నుంచి పున: ప్రసారం అవుతుందో తెలిసింది. ఆ సంగతులు మీకోసం.!

 ఆ క్రెడిట్ మొత్తం జబర్ధస్త్‌కే దక్కుతుంది

ఆ క్రెడిట్ మొత్తం జబర్ధస్త్‌కే దక్కుతుంది

2013లో జబర్ధస్త్‌ షో ప్రారంభం అయింది. అప్పుడు వారంలో ఒకరోజు మాత్రమే ప్రసారం అయిన ఈ షో.. కొద్ది రోజుల తర్వాత రెండు రోజులకే చేరింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్‌లోకి ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వచ్చారు. వీరిలో చాలా మంది పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇప్పుడు వాళ్లంతా సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారంటే ఈ షోనే కారణం.

వాళ్లిద్దరిని కూడా మరింత హైలైట్ చేసింది

వాళ్లిద్దరిని కూడా మరింత హైలైట్ చేసింది

ఈ నెంబర్ వన్ కామెడీ షో ద్వారా ఎంతో మంది టాలెంట్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ షోకు జడ్జ్‌లుగా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు కూడా మరింతగా హైలైట్ అయ్యారు. వీళ్లిద్దరి నవ్వులు, స్కిట్ల మధ్యలో వేసే పంచులు బాగా పేలేవి. అందుకే ఈ ఇద్దరికీ మంచి పేరు వచ్చింది.

జబర్ధస్త్‌ షోలో ఊహించని పరిణామం

జబర్ధస్త్‌ షోలో ఊహించని పరిణామం

సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న జబర్ధస్త్‌ షోలో ఉన్నట్లుండి కుదుపులు వచ్చాయి. మొదటి నుంచీ ఈ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న నాగబాబు.. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. అంతేకాదు, ఆయనతో పాటు చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ సహా కొంత మంది ఆర్టిస్టులను తీసుకు వెళ్లారు. వీళ్లంతా కలిసి మరో చానెల్‌లో ‘అదిరింది' అనే షోను ప్రారంభించారు.

ఇప్పటికీ భర్తీ చేయలేదు.. ఆమె అంతా..

ఇప్పటికీ భర్తీ చేయలేదు.. ఆమె అంతా..

నాగబాబు జబర్ధస్త్‌ను వీడిన తర్వాత ఆయన స్థానాన్ని ఎవరు భర్తి చేస్తారన్న దానిపై పెద్ద చర్చే జరిగింది. కానీ, ఆ ప్లేస్‌ను అలానే ఉంచేశారు. అయితే, ఎపిసోడ్‌కు ఒకరు చొప్పున చాలా మంది సెలెబ్రిటీలు నాగబాబు చైర్‌లో కూర్చుంటున్నారు. మరోవైపు, ఆయన వెళ్లిపోయిన తర్వాత రోజా అన్నీ తానై చూసుకుంటూ రేటింగ్ ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు.

ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్: ఆగిపోయిన జబర్ధస్త్

ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్: ఆగిపోయిన జబర్ధస్త్

కరోనా వైరస్ (కోవిద్ 19) ప్రభావంతో ప్రపంచం అంతా వణికిపోతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా, టీవీ షూటింగ్‌లు బంద్ అయ్యాయి. దీంతో జబర్ధస్త్ షో ఆగిపోయింది. ప్రతి వారంలా ఈ సారి ప్రోమో విడుదల చేయకపోవడంతో ఈ విషయం సుస్పష్టమైంది. కొత్త ఎపిసోడ్ రాకున్నా పాత స్కిట్లు ప్లే చేస్తారని తెలుస్తోంది.

Recommended Video

Jabardasth Comedy Show Management New Rules To Comedians
లాక్ డౌన్ పూర్తయినా ప్రారంభం కాదట.!

లాక్ డౌన్ పూర్తయినా ప్రారంభం కాదట.!

ఏప్రిల్ 14తో లాక్ డౌన్ పూర్తవుతుంది. అప్పటి నుంచి అన్నీ షూటింగులు పున: ప్రారంభం అవుతాయి. అయినప్పటికీ జబర్ధస్త్ ప్రసారం కాదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం... ఈ కామెడీ షోకు మూడు నుంచి నాలుగు వారాల పాటు బ్రేక్ పడనుందట. ఒకవేళ లాక్ డౌన్ పొడిగిస్తే మాత్రం షో ప్రసారం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X