జబర్ధస్త్ ప్రియులకు మరో షాకింగ్ న్యూస్: లాక్‌డౌన్ తర్వాత వాళ్ల స్కిట్లు కనిపించవు.!
తెలుగు బుల్లితెర చరిత్రలో ఎన్నో కార్యక్రమాలు వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందుతాయి. అలాంటి వాటిలో 'జబర్ధస్త్' అనే కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2013లో ప్రారంభమైన ఈ షో.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలా రేటింగ్ సాధిస్తూ దూసుకెళ్తోంది. అదే సమయంలో భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వల్ల తొలిసారి కొన్ని వారాల పాటు ప్రసారాలు నిలిపివేయాల్సి వచ్చింది. తాజాగా జబర్ధస్త్ ప్రియులను షాక్‌కు గురి చేసే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

ఆ విషయంలో జబర్ధస్త్‌ను మెచ్చుకోవాల్సిందే
దాదాపు ఏడేళ్లుగా వారానికి రెండు రోజులు జబర్ధస్త్ షో ప్రసారం అవుతోంది. దీనికి మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ హీరోయిన్ రోజా మొదటి నుంచీ జడ్జ్‌లుగా వ్యవహరించారు. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, రైటర్లు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ప్రస్తుతం వాళ్లంతా సెలెబ్రిటీ హోదాను దక్కించుకుని దూసుకుపోతున్నారు. ఇది జబర్ధస్త్ ఘనతే అని చెప్పాలి.

జబర్ధస్త్ అరుదైన ఘనత.. ఏ భాషలోనూ లేదు
2013 నుంచి ఇప్పటి వరకు జబర్ధస్త్‌కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. అందుకోసమే ఈ షో ఎప్పుడూ టీఆర్పీ రేటింగ్స్‌లో దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఐదారేళ్ల నుంచి జబర్ధస్త్ ఎప్పుడు రేటింగ్స్ విడుదల చేసినా టాప్ -5లో తప్పకుండా ఉంటోంది. ఇలా ఓ కామెడీ షో సుదీర్ఘ కాలం పాటు రేటింగ్ సాధించడం ఏ భాషలోనూ జరగలేదు.

షాకిచ్చిన నాగబాబు.. మొత్తం ఆమె ఘనతే
విజయవంతంగా సాగిపోతున్న జబర్ధస్త్ షోకు మెగా బ్రదర్ నాగబాబు షాకిచ్చాడు. చాలా కాలం పాటు జడ్జ్‌గా వ్యవహరించిన ఆయన ఇటీవల షో నుంచి తప్పుకున్నాడు. ఆయనతో పాటు కొందరు టీమ్ లీడర్లు కూడా వెళ్లిపోయారు. అప్పటి నుంచి మరో జడ్జ్ అయిన రోజా ఒంటి చేత్తే షోను నడిపిస్తున్నారు. అలాగే, నాగబాబు స్థానంలో ఎవరో ఒక సెలెబ్రిటీని తీసుకొస్తున్నారు.

ఆగిపోయిన జబర్ధస్త్... ఆ తర్వాతా కష్టమే
కరోనా వైరస్ (కోవిద్ 19) ప్రభావంతో టీవీ షూటింగులు అన్నీ బంద్ అయ్యాయి. దీంతో అన్ని సీరియల్స్, షోలు నిలిచిపోయాయి. వాటిలో జబర్ధస్త్ కూడా ఉంది. ఈ షో చాలా వారాలుగా ప్రసారం కావడం లేదు. అయితే, లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత కూడా ఇది ప్రారంభం అవ్వకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం.. ఎడిటింగ్ వర్క్‌పై ఆధారపడడమే అని సమాచారం.

జబర్ధస్త్ ప్రియులకు మరో షాకింగ్ న్యూస్
కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకూ పెరిగిపోతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను నాలుగో విడుత ప్రకటించింది. ఈ నేపథ్యంలో షూటింగులు మరింత ఆలస్యం కానున్నాయి. అయితే, కొన్ని పరిమితులతో కార్యక్రమాలు, సీరియల్స్ చిత్రీకరణకు అనుమతులు లభిస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జబర్ధస్త్ ప్రియులకు మరో షాకింగ్ న్యూస్ తెలిసింది.
Recommended Video

లాక్‌డౌన్ తర్వాత వాళ్ల స్కిట్లు కనిపించవు.!
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. లాక్‌డౌన్ పూర్తయి.. షూటింగ్‌కు అనుమతులు వచ్చినప్పటికీ... జబర్ధస్త్‌లో గతంలో మాదిరిగా అందరి స్కిట్లు ప్రసారం కావట. దీనికి కారణం.. షూటింగ్‌లకు కొంత మందినే అనుమతించబోతున్నారన్న వార్త బయటకు రావడమే. దీంతో రొటేషన్ పద్దతిలో షూటింగ్ జరిపబోతున్నారనే టాక్ బాగా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











